నాటక సంస్థలకు జీవం పోసే యత్నం | - | Sakshi
Sakshi News home page

నాటక సంస్థలకు జీవం పోసే యత్నం

May 15 2025 2:15 AM | Updated on May 15 2025 2:15 AM

నాటక

నాటక సంస్థలకు జీవం పోసే యత్నం

చిలకలూరిపేట: కళల పరవళ్లు ఎగసిపడే పండుగ సమయం వచ్చేసింది! నాటక రంగానికి నిలయమైన చిలకలూరిపేట పట్టణం మళ్లీ కళాకారుల సందడితో కళకళలాడబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 9వ ఆహ్వాన నాటిక పోటీలు ఈ నెల 16, 17, 18వ తేదీల్లో వైభవంగా జరగబోతున్నాయి. చిలకలూరిపేట సీఆర్‌ క్లబ్‌ ఓపెన్‌ థియేటర్‌ ప్రేక్షకుల కోసం అందంగా సన్నద్ధమవుతోంది. ‘చిలక లూరిపేట కళాపరిషత్‌, సీఆర్‌ క్లబ్‌’ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి ప్రముఖ నాటక సమాజాలు, రచయితలు, సృజనాత్మక దర్శకులు, అభినయ నిపుణులు హాజరుకానున్నారు. వినోదంతోపాటు ఆలోచనలకు ఆహ్వానం పలికే కళారూపాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ పోటీలకు కళాపరిషత్‌ అధ్యక్షుడు చెరుకూరి కాంతయ్య, సీఆర్‌ క్లబ్‌ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, కోశాధికారి మక్కెన నరసింహారావు రథసారథులు కాగా.. ప్రముఖ రంగస్థల దర్శకుడు షేక్‌ షఫీ తదితరులు ఆయా నిర్వహణ పనుల్లో భాగస్వాములయ్యారు.

ప్రదర్శనల వివరాలు ఇలా..

●16న స్వర్గీయ మద్ది లక్ష్మయ్య కళా ప్రాంగణంలో సాయంత్రం 7 గంటలకు మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. 7.30 గంటలకు కంచర్ల సూర్య ప్రకాష్‌ రచనకు, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన కళాంజలి హైదరాబాద్‌ వారి ‘రైతే రాజు’ నాటిక ప్రదర్శించనున్నారు.

●8:30 గంటలకు సభా కార్యక్రమం, 8:45 గంటలకు మద్దుకూరి రవీంద్రబాబు రచించి దర్శకత్వం వహించిన మద్దుకూరి ఆర్ట్స్‌ క్రియేషన్‌న్స్‌ చిలకలూరిపేట వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటిక ప్రదర్శన ఉంటుంది. 10 గంటలకు అక్కల తామేశ్వరయ్య రచనకు వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించిన యువభేరి ఆర్ట్స్‌ హైదరాబాద్‌ వారి ‘నా శత్రువు’ నాటిక ప్రదర్శిస్తారు.

●17వ తేదీన స్వర్గీయ ఇందుమల్లి రాజ్‌కుమార్‌ కళా ప్రాంగణంలో..

రాత్రి 7:30 గంటలకు ఆకురాతి భాస్కరచంద్ర రచనకు ఎస్‌ఎం బాషా దర్శకత్వం వహించిన మిత్ర క్రియేషన్స్‌ హైదరాబాదు వారి ‘ఇది రహదారి కాదు’ నాటిక ప్రదర్శితం కానుంది. 8:45 గంటలకు పరమాత్ముని శివరాం రచనకు రమేష్‌ మంచాల దర్శకత్వం వహించిన కళాభారతి కరీంనగర్‌ వారి ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన ఉంటుంది. 10 గంటలకు డేవిడ్‌రాజు రచించి దర్శకత్వం వహించిన భద్రం ఫౌండేషన్‌ విశాఖపట్నం వారి ‘దొందు దొందే’ నాటిక ప్రదర్శించనున్నారు.

●18న స్వర్గీయ నాగభైరు సుబ్బారావు కళాప్రాంగణంలో.. రాత్రి 7:45 గంటలకు కావూరి సత్యనారాయణ రచనకు ఏపూరి హరిబాబు దర్శకత్వ వహించిన అమరావతి ఆర్ట్స్‌ గుంటూరు వారి ‘చిగురు మేఘం’ నాటిక ప్రదర్శిస్తారు. 8:45 గంటలకు అద్దేపల్లి భరత్‌ కుమార్‌ రచనకు ఎస్‌కే షఫీ దర్శకత్వం వహించిన ది అమేచ్యూర్‌ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ వారి ’ఆలీతో సరదాగా’ నాటిక ప్రదర్శన ఉంటుంది. అనంతరం సభా కార్యక్రమం జరుగుతుంది.

●10:45 గంటలకు తాళాబత్తుని వెంకటేశ్వరరావు రచనకు అమృత లహరి దర్శకత్వం వహించిన అమృత లహరి ఆర్ట్స్‌ థియేటర్స్‌ వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ప్రదర్శితం అవుతుంది.

●11.50 గంటలకు శ్రీకృష్ణ మానసం నటులు గొట్టిపాటి కోటేశ్వరరావుచే ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది.

చిలకలూరిపేటలో మూడు రోజుల మహోత్సవం కళల పండుగకు ముస్తాబైన సీఆర్‌ క్లబ్‌ ఒకే వేదికపై నవరత్నల్లాంటి కళారూపాలు

సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కళాకారుల్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. కళల కాణాచి చిలకలూరిపేటలో ఎన్నో నాటక పరిషత్‌లు ఉన్నాయి. అవి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం సాంస్కృతిక సంస్థలు ఉన్నప్పటికీ నాటక రంగ పరిషత్‌లు కొంతకాలంగా నిలిచిపోయాయి. వాటికి తిరిగి జీవాన్ని పోసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే చిలకలూరిపేట కళా పరిషత్‌, సీఆర్‌ క్లబ్‌ సమిష్టిగా నిర్వహిస్తున్న ఈ పోటీలు.

– చెరుకూరి కాంతయ్య, పరిషత్‌ అధ్యక్షుడు

నాటక సంస్థలకు జీవం పోసే యత్నం 1
1/2

నాటక సంస్థలకు జీవం పోసే యత్నం

నాటక సంస్థలకు జీవం పోసే యత్నం 2
2/2

నాటక సంస్థలకు జీవం పోసే యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement