
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పార్టీ కమిటీని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నాయుడు సాంబశివరావు(పెదకూరపాడు), పచ్చవ రవీంద్రబాబు (నరసరావుపేట), కూకుట్ల శ్రీనివాసరావు (సత్తెనపల్లి), తుర్లపాటి చౌదరయ్య (వినుకొండ), వీరంరెడ్డి అమరారెడ్డి (గురజాల), తాడి వెంకటేశ్వరరెడ్డి (మాచర్ల)ను నియమించారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కొమరాల రమేష్ (పెదకూరపాడు), సాతులూరి సుజాతాపాల్ (నరసరావుపేట), మర్రి సుబ్బారెడ్డి (సత్తెనపల్లి), గిలుగు వెంకటనర్సింహారెడ్డి (గురజాల), పోతిరెడ్డి కోటిరెడ్డి (మాచర్ల) నియమితులయ్యారు. కోశాధికారిగా నరసరావుపేటకు చెందిన అన్నా చంద్రమోహన్‌ను నియమించారు. సెక్రటరీ ఆర్గనైజర్లుగా షేక్ సుభాని, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (పెదకూరపాడు), షేక్ మహమద్ గౌస్, పల్లపు అంజయ్య (నరసరావుపేట), గంటా ఏసుబాబు, కోవూరి నరసయ్య(సత్తెనపల్లి), పీపాల సాయిబాబు, తలారి ఆంజనేయులు (వినుకొండ), పసుపులేటి నరసింహారావు, లంజెపల్లి అంకారావు(గురజాల), ఏరువ ప్రతాపరెడ్డి, వెలిదండి గోపాలరావు(మాచర్ల) నియమితులయ్యారు. సెక్రటరీ యాక్టివిస్టులుగా గాదే వెంకటేశ్వరరెడ్డి, సందెపోగు పున్నారావు(పెదకూరపాడు), గొర్రెపాటి అచ్యుతరావు, గెల్లి చినకోటిరెడ్డి (నరసరావుపేట), షేక్ మహబూబ్ కమాల్‌బాష, జొన్నలగడ్డ ఆనంద్(సత్తెనపల్లి), ముండ్రు జీవప్రసాదు, చీరపురెడ్డి రామకృష్ణారెడ్డి (వినుకొండ), షేక్ దస్తగిరి, కొమెర వెంకటేశ్వర్లు(గురజాల), మంది పెదముల్లుస్వామి, మున్నా మురళి (మాచర్ల), అపీషియల్ స్పోక్‌పర్శన్లుగా ఏకుల అన్నపాములు (పెదకూరపాడు), రాపోలు శ్రీనివాసరావు (నరసరావుపేట), దార్ల ఏడుకొండలు (సత్తెనపల్లి), మండవ నాగభూషణ ప్రసాదు (వినుకొండ), చింతా వెంకటరామారావు(గురజాల) నియమితులయ్యారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన ఇరువురిని పల్నాడు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మద్దం శ్రీనివాసరావును గ్రీవెన్స్‌సెల్‌కు, ఇండూరి నరసింహారెడ్డిని బూత్ కమిటీ వింగ్‌కు అధ్యక్షులుగా నియమించారు.