
హెచ్‌ఐవీ మహిళలకు క్యాన్సర్ పరీక్షలు
నరసరావుపేట: స్థానిక ఏరియా వైద్యశాలలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న మహిళలకు త్వరలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) విభాగంతో కలిసి ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ శాక్స్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ పి.అంకినీడుప్రసాదు, డీడీ సీఎస్‌టీ డాక్టర్ చక్రవర్తి, పెప్‌ఫార్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాదు షేర్ ఇండియా అధికారులు డాక్టర్ జయకృష్ణ బుధవారం ఏరియా వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్‌కుమార్, గైనకాలజీ విభాగ అధిపతులతో ఈ అంశంపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ చేయటం వలన హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి త్వరగా షుగర్, బీపీ, క్యాన్సర్ గుర్తించి ముందుగానే చికిత్స ప్రారంభించటం తద్వారా వారి జీవితకాలం పొడిగించే అవకాశం ఉన్నందున దీనికి కావాల్సిన సహాయసహకారాలు అందజేసేందుకు తాము సిద్ధమని హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్‌ఎంఓ డాక్టర్ కె.ఏడుకొండలు, డాక్టర్ దయానిధి, గైనకాలజీ డాక్టర్ మంత్రూనాయక్, ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద పాల్గొన్నారు.
ఏర్పాట్లపై నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఏపీ శాక్స్ అధికారుల సమీక్ష