
స్థలం కోసం కొడుకే వేధిస్తున్నాడు..
‘నేను బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి పదవీ విరమణ చేశా. నాకు పట్టణ షాలెంనగర్‌లోని వైఎస్సార్ బొమ్మ వద్ద సొంత స్థలం ఉంది. దానిని తనపేరుపై రాయాలంటూ రెండు నెలల నుంచి కొడుకు ప్రసాద్, మనుమడు దర్శన్ దౌర్జన్యం చేస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారు. సుమారు ఆరు నెలల క్రితం ఇంటి మీదకు వచ్చి నన్ను బెదిరించి స్థలం కాగితాలు బలవంతంగా లాక్కొని వెళ్లారు.’ వారిపై చర్య తీసుకోవాలని వేముల మోహనరావు ఎస్పీని వేడుకున్నారు...
నరసరావుపేట: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 75 ఫిర్యాదులు ఎస్పీ స్వీకరించారు. ఎస్పీ అర్జీదారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యపై శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి కృషి చేయాలని ఆదేశించారు.
భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన డి.హరిశంకర్ అనే వ్యక్తి పల్నాడు కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆర్డీలు, చిట్టీలు వేస్తూ జనం దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. సుమారు పదిమంది బాధితుల వద్ద రూ.60 లక్షలు కట్టించుకుని వారికి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం బ్యాంకును వేరే వ్యక్తులకు అప్పగించారు. ప్రస్తుతం 60 లక్షల దాకా రావాల్సిన డబ్బుకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నారు.
–సువర్ణలక్ష్మి, చిలకలూరిపేట పట్టణం
రూ.60 లక్షలకు సమాధానం చెప్పట్లేదు
భర్త చిత్రహింసలు పెడుతున్నాడు..
ఓ తండ్రి ఎస్పీకి ఫిర్యాదు పీజీఆర్‌ఎస్‌కు 75 ఫిర్యాదులు
నాకు బతుకు తెరువు చూపించండి