
అభివృద్ధి వదిలి ఫ్యాక్షనిజాన్ని ఎంచుకున్న ప్రభుత్వం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలిపెట్టి ఫ్యాక్షనిజాన్ని ఎంచుకుందని గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నరసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలె, ఐఏఎస్, ఐపీఎస్‌లపై కేసులు పెట్టి అరెస్టు చేసి , వేధించడం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలుచేయాలని ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ కోరుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క ఏడాదిలోనే ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారగా ప్రతిపక్షం గ్రాఫ్ పెరుగుతుందన్నారు. జగన్ వద్ద పని చేసిన ఐఏఎస్ ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డిలకు ఏమాత్రం సంబంధం లేని మద్యం కేసులో ఇరికించి తమకు ఇష్టమొచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. సిట్ పేరుతో పోలీసులే పచ్చచొక్కాలు వేసుకుని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిన వారిని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌తోపాటు అతని సొంత మనుషులను అరెస్టు చేయాలని, బిగ్‌బాస్ తాడేపల్లి వరకు వెళతామని కొన్ని చానళ్లలో చెబుతున్నారన్నారు. 2010 నుంచి పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జగన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించారని గుర్తు చేశారు. దీంతో 40 శాతం శాశ్వత ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు రెండు శాతానికి పడిపోయిందన్నారు. ఇప్పుడు కూడా టీడీపీకి అదే జరగనుందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న మద్యం బ్రాండ్లనే కూటమి ప్రభుత్వం ధర పెంచి అమ్ముతుందని ఆరోపించారు. అప్పుడు మద్యం వ్యాపారంలో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సంబంధం లేకుండా అమ్మకాలను ప్రభుత్వం తరఫున నిర్వహించిందన్నారు. ఇప్పుడు మద్యం దుకాణాలు టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల ప్రమేయంతోనే నిర్వహిస్తున్నారని, వారి అనుమతితోనే మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వారు నేర్పిన విధానాలే వారికి గుణపాఠాలు అవుతాయన్నారు. ఎవరిని వదిలేది లేదని హెచ్చరించారు. సమావేశంలో గురజాల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
రోజురోజుకు తగ్గుతున్న ప్రభుత్వ గ్రాఫ్
ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు
మద్యం కుంభకోణమంటూ
కేసు పెట్టి ఐఏఎస్‌లపై వేధింపులు
జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా
ప్రభుత్వ చర్యలు
విలేకర్ల సమావేశంలో గురజాల
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి