
అందరూ కలిసి దగా చేస్తున్నారు
కంపెనీలు పొగాకు కొనకపోగా, ప్రైవేటు వ్యాపారుల్ని కూడా రాకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం కచ్చితంగా కొనాలని చెబుతున్నా అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో కంపెనీలు సిండికేట్‌గా మారి నామమాత్రంగా ధర ఇస్తున్నాయి. గ్రామంలో 10 ఎకరాలు సాగు చేశా. ఎక్కువగా కౌలు ఉంది. అధికారులు మా పొగాకు బాగుందని కొంటామన్నారు. తీరా చెక్కుల్ని తొక్కిస్తే బాగోలేదంటూ సగం తీసేయాలన్నారు. దీంతో విక్రయించలేదు. ఇలా అధికారులే రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. క్వింటా రూ.15 వేలకు తగ్గితే పెట్టుబడి కాదు కదా... కౌలు, ఆకు తీసిన కూలీల డబ్బులు చెల్లించే పరిస్థితి కూడా లేదు.
– నూతలపాటి సుబ్బరామమూర్తి, పొగాకు రైతు, యడ్లపాడు