
● వైభవంగా సొలస శ్రీభూసమేత రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్
యడ్లపాడు: సొలస శ్రీభూసమేత రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకుడు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో రంగనాధుడు, శ్రీదేవి, భూదేవి నవ వధువరులుగా సర్వాంగ శోభితంగా అలంకారకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. బాజాభజింత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, అశేష భక్తజనాల నడుమ శ్రీదేవి, భూదేవి కల్యాణ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కమనీయమైన ఆ కల్యాణ దృశ్యాలను దగ్గరగా చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. కల్యాణం అనంతరం దేవతామూర్తులు హమమత్, గరుడ వాహనాలపై అధిరోహించి పురవీధుల్లో విహరింపజేశారు. తమ ఇళ్ల ముందుకే వచ్చిన స్వామివారిని కన్నులారా దర్శించుకుని భక్తులు పూజలు చేశారు. కొందరు ఆయా వాహన సేవల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వరకు రంగనాధుడిని స్మరిస్తూ భక్తులు తరించారు.
కల్యాణ
వైభోగమే..!

● వైభవంగా సొలస శ్రీభూసమేత రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్

● వైభవంగా సొలస శ్రీభూసమేత రంగనాయకస్వామి దేవస్థానం బ్రహ్