ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లో బదులు ఇవ్వాలని సెంగార్‌ను అందులో కోర్టు ఆదేశించింది. ‘‘ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు. ఓ కానిస్టేబుల్ పబ్లిక సర్వెంట్ అయినప్పుడు.. ఓ ఎమ్మెల్యే మాత్రం కాదా?.. ఈ కేసులో ఆ బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే. మేం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం కదా. ఇంతకీ ఎవరు పబ్లిక్ సర్వెంట్లు?’’ అంటూ సెంగార్ తరపు వాదించిన లాయర్లు సిద్ధార్థ దవే, హరిహరన్‌లను జస్టిస్ సూర్యకాంత ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులను ఆశ్రయించినా.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు.. హైప్రొఫైల్ కేసుగా గుర్తింపు దక్కించుకుంది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే.. బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆపై ఆమె అనూహ్యంగా ప్రమాదానికి గురికాగా.. సురక్షితంగా బయటపడింది. అయితే ఆమె ఇద్దరి బంధువులు మాత్రం ప్రమాదంలో మరణించారు. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదు అయ్యాయి. 2018లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు విచారణ యూపీ ట్రయల్ కోర్టు ఢిల్లీ కోర్టుకు మారింది. 2019 డిసెంబర్లో దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. సెంగార్‌కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే.. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలాయి. బాధిత కుటుంబం దేశరాజధానిలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అదే సమయంలో.. యూపీ ఎన్నికల నేపథ్యంలో సెంగార్ కమ్యూనిటీ ఓట్ల కోసమే ఆయన్ని విడిపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విమర్శలు తలెత్తారు. ఈ పరిణామాల నడుమ.. సీబీఐతో పాటు బాధితురాలి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్లోనే కొత్త ఏడాది రాబోతుంది. అందుకు తగ్గట్లే న్యూఇయర్ సందర్భంగా థియేటర్లలోకి పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ, ఘంటసాల, 45, గత వైభవం తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఎకో అనే మలయాళ డబ్బింగ్ చిత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ అద్భుతమైన హిట్ కావడంతో కొందరు తెలుగు ఆడియెన్స్ దీనికోసం ఎదురుచూస్తున్నారు. హక్ అనే హిందీ మూవీతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్, ఎల్బీడబ్ల్యూ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు)నెట్ఫ్లిక్స్మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) - జనవరి 29ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 31స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01హక్ (హిందీ మూవీ) - జనవరి 02అమెజాన్ ప్రైమ్సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) - డిసెంబరు 29సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02హాట్స్టార్ఎల్బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01సన్ నెక్స్ట్ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01(ఇదీ చదవండి: ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. హీరోయిన్ నిధి అగర్వాల్ ట్వీట్)
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
తాడేపల్లి : ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) పార్టీ లీగల్ సెల్ నేతలతో ఆయన జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు.
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
హైదరాబాద్‌లో కొత్త పోలీస్ కమిషనరేట్లు.. నలుగురు ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా..
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
ఐ బొమ్మ నాదే అనడానికి ప్రూఫ్స్ ఏవి?.. ఇమంది రవి
మహిళ హత్య.. నిందితునికి మరణశిక్ష
జనవరి నెల శ్రీవారి ఆలయ విశేష పర్వదినాల తేదీల ప్రకటన
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
హైదరాబాద్‌లో కొత్త పోలీస్ కమిషనరేట్లు.. నలుగురు ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా..
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
ఐ బొమ్మ నాదే అనడానికి ప్రూఫ్స్ ఏవి?.. ఇమంది రవి
మహిళ హత్య.. నిందితునికి మరణశిక్ష
జనవరి నెల శ్రీవారి ఆలయ విశేష పర్వదినాల తేదీల ప్రకటన
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
‘జనం చెప్పులతో కొట్టేలా ఉన్నారు’
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
సార్! మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒక టెండరూ రాదు! మీ భవిష్యత్తు చిత్రం కాంట్రాక్టర్లకు తెలిసిపోయినట్లుంది!!
ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
పార్టీ బలోపేతం అంటే అది అధికార పార్టీని ఉద్దేశించి సార్!
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. కొత్త పనులకు శ్రీకారం
ఫొటోలు
ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)
అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)
థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)
బుక్‌ఫెయిర్ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)
సినిమా
దేవుడిపై తప్పుడు ప్రచారం.. నటి మాధవీలతపై కేసు
నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి మాధవీలత ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవుడిపై తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకుగానూ మాధవీలతపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యాబర్లని ఆదేశించారు.నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వీళ్లందరి సోషల్ మీడియా అకౌంట్స్‌పై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.(ఇదీ చదవండి: ఏపీలో పర్మినెంట్‌గా పెరగనున్న సినిమా టికెట్ ధరలు)
ఏపీలో పెరగనున్న సినిమా టికెట్ ధరలు.. అది కూడా పర్మినెంట్‌గా!
మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్ థియేటర్లో ఇకనుంచి రూ. 50 టికెట్ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.పవన్ కల్యాణ్‌తో చర్చలుసినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు. 'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్ ధర ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 175 వరకు ఉంది. ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్ థియేటర్స్‌లలో టికెట్ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.సింగిల్ థియేటర్ టికెట్ ధర రూ. 150కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్ థియేటర్లో టికెట్ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.చిన్న సినిమాలకి AP లో 50 పెంచుతున్నాం GO ద్వారా. దానికి కారణాలు ఇవి.అందుకే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, ఒక కమిటీ ఫార్మ్ చేసి పర్మినెంట్ GO వచ్చేలా జరుగుతుంది.- Naga Vamsi#AnaganagaOkaRaju Full interview youtube link : https://t.co/2RuecuqHJp@vamsi84 https://t.co/u8yhybkIxm pic.twitter.com/I2hwiXQWO8— idlebrain.com (@idlebraindotcom) December 29, 2025
'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)Honoured and super glad to be 'APPALASOORI' in #Peddi ❤🔥Thoroughly enjoyed playing this role. #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025
'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?)
క్రీడలు
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ఈ ఫార్మాట్ చరిత్రలో తొలిసారి ఓ బౌలర్ 8 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో అత్యుత్తమంగా 7 వికెట్ల ప్రదర్శనలు మాత్రమే నమోదయ్యాయి.తాజాగా మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20లో భూటాన్ బౌలర్ సోనమ్ ఎషే (22 ఏళ్ల లెఫ్డ్ ఆర్మ్ స్పిన్నర్) 8 వికెట్ల చారిత్రక ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో సోనమ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి (ఓ మెయిడిన్) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సోనమ్ నమోదు చేసిన ఈ గణాంకాలు యుగయుగాలు గుర్తుండిపోతాయి.ఎషే చారిత్రక ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో మయన్మార్‌పై భూటాన్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల ఛేదనలో మయన్మార్ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భూటాన్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.పొట్టి క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు..సోనమ్ ఎషే (భూటాన్)- మయన్మార్‌పై 4-1-7-8శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషినా)- చైనాపై 4-1-8-7అలీ దావూద్ (బహ్రెయిన్)- భూటాన్‌పై 4-0-19-7హర్ష భరద్వాజ్ (సింగపూర్)- మంగోలియాపై 4-2-3-6పీటర్ అహో (నైజీరియా)- సియెర్రా లియోన్‌పై 3.4-1-5-6దీపక్ చాహర్ (భారత్)- బంగ్లాదేశ్‌పై 3.2-0-7-6చదవండి: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్ కోహ్లి
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ (Shan Masood) స్వదేశీ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్ కప్ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. సూయ్ నార్త్రన్ గ్యాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ పేరిట ఉండేది. ఇంజమామ్ 1992లో ఇంగ్లండ్‌పై 188 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్ ఇంజమామ్ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.అయితే, పాకిస్తాన్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఖాతాలో ఉంది. సెహ్వాగ్ 2006లో జరిగిన లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.కాగా, యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు కే కింబర్ పేరిట ఉంది. ఇంగ్లండ్ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. షిన్వారి, కింబర్ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. హైదరాబాద్‌కు చెందిన తన్మయ్ అరుణాచల్ ప్రదేశ్‌పై 119 బంతుల్లో డబుల్ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లోనే డబుల్ పూర్తి చేశాడు.
న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు. విరాట్ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!
7 వికెట్లతో చెలరేగిన సీఎస్కే ఫాస్ట్ బౌలర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఘోష్ చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్కు వైభవ్ అరోరా (40), అమన్‌ప్రీత్ సింగ్ (30), నితిన్ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్ అరోరా, ధలివాల్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన 28 ఏళ్ల ఘోష్ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సీఎస్కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. ఘోష్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్‌లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
బిజినెస్
కొత్త మార్క్‌కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా: ఉన్నత న్యాయస్థానం
ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.కేసు నేపథ్యంతమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలుకారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3-9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.న్యాయ నిపుణుల విశ్లేషణఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.ఇదీ చదవండి: మీరు బిజినెస్‌లో కింగ్ అవ్వాలంటే..
మీరు బిజినెస్‌లో కింగ్ అవ్వాలంటే..
వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి, అమ్మకాలు మాత్రమే అనుకుంటే పొరపాటే! ప్రస్తుత కాలంలో మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో బిజినెస్ రూపురేఖలే మారిపోయాయి. చాలా మంది పాత పద్ధతులతో నష్టపోతుంటే, కొందరు మాత్రం టెక్నాలజీని వాడుకుంటూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారు. ఇంతకీ ఆ సక్సెస్ మంత్ర ఏమిటో తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఐదు వ్యూహాలను కింద తెలియజేశాం.ఆర్థిక నిర్వహణవ్యాపారానికి క్యాష్ ఫ్లో, ఆర్థిక నిర్వహణ చాలా కీలకం. 2025లో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ 3% వద్ద స్థిరపడినప్పటికీ అంతర్జాతీయ టారిఫ్‌లు, సప్లై చైన్ సమస్యల వల్ల ముడిసరుకుల ధరలలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సేల్స్ పెంచుకోవడం మీద కాకుండా, ప్రాఫిట్ మార్జిన్లపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ‘ప్రాఫిట్ ఫస్ట్’ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆదాయం రాగానే లాభం, పన్నులు, వేతనాలను పక్కన పెట్టి, మిగిలిన మొత్తంతోనే ఖర్చులను నిర్వహించాలి. మార్కెట్లోని కొన్ని సాఫ్ట్వేర్లు ఇప్పుడు ఏఐ ఆధారిత అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో రాబోయే ఖర్చులను ముందే అంచనా వేసి, ఖర్చులను 20-30% తగ్గించడంలో సహాయపడుతున్నాయి.కస్టమర్ ఫోకస్కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ (కొత్త కస్టమర్‌ను ఆకర్షించే ఖర్చు) భారీగా పెరిగింది. అందుకే ఉన్న కస్టమర్లను నిలబెట్టుకోవడమే అత్యంత లాభదాయకమైన మార్గం. 80 శాతానికిపైగా చిన్న వ్యాపారాలు ఇప్పుడు జనరేటివ్ ఏఐను వాడుతూ కస్టమర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నాయి. వ్యాపారులు కస్టమర్ డేటాను విశ్లేషించి, వారి అవసరాలకు తగినట్లుగా లాయల్టీ ప్రోగ్రామ్‌లు రూపొందించడం వల్ల రిపీట్ సేల్స్ పెరుగుతాయి. తాజా సర్వేల ప్రకారం, కస్టమర్ రిటెన్షన్ రేటు(అధిక మార్జిన్లు వచ్చే వస్తువులను కొనేలా చేయడం) 5% పెరిగితే, ప్రాఫిట్ మార్జిన్లు 25% నుంచి 29% వరకు మెరుగుపడే అవకాశం ఉంది.ఖర్చుల నియంత్రణఖర్చు తగ్గించడం అంటే నాణ్యతను తగ్గించడం కాదు, వనరులను సమర్థవంతంగా వాడటం అని గుర్తుంచుకోవాలి. ఇంధన ధరలు, కార్మిక వ్యయాలు పెరిగిన తరుణంలో ఆటోమేషన్ ఒక వరంగా మారింది. క్లౌడ్ ఆధారిత టూల్స్, ఎనర్జీ-ఎఫిషియంట్ పరికరాలను వాడటం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు. టెక్నాలజీ సాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ అవుట్‌పుట్ సాధించేలా ఆపరేషన్లను ఆప్టిమైజ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫ్లేషన్, టారిఫ్‌ల ప్రభావం వ్యాపారంపై తక్కువగా ఉంటుంది.డిజిటల్ పరివర్తన‘ఏఐ వ్యాపారాలను భర్తీ చేయదు కానీ, ఏఐని వాడే వ్యాపారస్తులు దాన్ని వాడని వారిని వెనక్కి నెట్టేస్తారు’ అనేది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయలపై 400 బిలియన్ డాలర్ల పెట్టుబడులు జరుగుతున్న తరుణంలో దీన్ని విస్మరించడం అసాధ్యం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్(వస్తు నిర్వహణ)లో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడటం ద్వారా స్టాక్ వృధాను అరికట్టవచ్చు. ఆటోమేటెడ్ ఇన్వాయిసింగ్(ఆటోమేటెడ్ బిల్లింగ్ విధానం) ద్వారా పేమెంట్స్ త్వరగా వచ్చేలా చూడవచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఏఐ బాట్లను వాడి 24/7 కస్టమర్ సపోర్ట్ అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి.మార్కెట్ ట్రెండ్స్మార్కెట్ మారుతున్న వేగానికి అనుగుణంగా వ్యాపార సరళి మారకపోతే ఎంతటి పెద్ద బిజినెస్ అయినా కుప్పకూలుతుంది. పర్యావరణ హితమైన పద్ధతులు పాటిస్తున్న బిజినెస్‌ల పట్ల కస్టమర్లు మక్కువ చూపుతున్నారు. ఇది బ్రాండ్ విలువను పెంచడమే కాకుండా దీర్ఘకాలంలో పన్ను రాయితీలకు కూడా దోహదపడుతుంది. డేటా అనలిటిక్స్ ద్వారా మార్కెట్ మూడ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే బిజినెస్ మోడల్‌ను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.ఇదీ చదవండి: మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ప్రస్తుతం ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్న అంశం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే తక్కువ ధరకు ఈ కంపెనీల షేర్లు కొని, ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత అధిక లాభాలు సంపాదించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే, మెరిసేదంతా బంగారం కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సెబీ సైతం అన్‌రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అన్‌లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం అత్యవసరం.‘గ్రే మార్కెట్’ ఉచ్చులో పడకండి!అన్‌లిస్టెడ్ షేర్లు సాధారణంగా అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లభించవు. వీటిని ‘గ్రే మార్కెట్’ లేదా కొన్ని ప్రైవేట్ యాప్స్ ద్వారా విక్రయిస్తుంటారు. అయితే, వీటిలో ధరను పారదర్శకంగా నిర్ణయించరనే వాదనలున్నాయి. ఒక యాప్‌లో ఒక ధర ఉంటే, మరో చోట మరో ధర ఉండే అవకాశం ఉంది. సెబీ ఇప్పటికే ఇలాంటి అనధికారిక ప్లాట్‌ఫామ్‌ల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఎంత లాభం ఉందో అంతే రిస్క్ కూడా ఉందని గమనించాలి.అన్‌లిస్టెడ్ కంపెనీలు అంటే ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE)లో నమోదు కాని కంపెనీలను అన్‌లిస్టెడ్ కంపెనీలు అంటారు. ఇవి సాధారణంగా స్టార్టప్‌లు కావచ్చు లేదా పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న పెద్ద కంపెనీలు కావచ్చు. వీటి షేర్లను ‘ప్రీ-ఐపీఓ (Pre-IPO) షేర్లు’ అని కూడా అంటారు.ఎలా పెట్టుబడి పెడుతారంటే..అన్‌లిస్టెడ్ మార్కెట్లో షేర్లు కొనడానికి నేరుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉండవు. దీనికోసం కొన్ని మార్గాలను అనుసరిస్తారు. ప్రస్తుతం అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ కోసం Precise, UnlistedZone, Altius Investech.. వంటి చాలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది స్టాక్ బ్రోకర్లు పర్సనలైజ్డ్ సర్వీసుల ద్వారా అన్‌లిస్టెడ్ షేర్లను విక్రయిస్తుంటారు. ఇంకో మార్గం ఏమిటంటే.. కంపెనీ ఉద్యోగులు తమకు వచ్చిన షేర్లను బయటి వ్యక్తులకు విక్రయించినప్పుడు వాటిని కొనుగోలు చేయవచ్చు.ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలులిస్టెడ్ షేర్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. కానీ అన్‌లిస్టెడ్ షేర్లకు కొనుగోలుదారులు దొరకడం కష్టం. మీరు అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు అవి అమ్ముడుపోకపోవచ్చు.లిస్టెడ్ కంపెనీల వలె ఇవి ప్రతి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కాబట్టి కంపెనీ ఫైనాన్షియల్ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత, అంతకుముందు కొన్న అన్‌లిస్టెడ్ షేర్లపై 6 నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే లిస్ట్ అయిన వెంటనే మీరు వాటిని అమ్మలేరు.ఈ షేర్ల ధర డిమాండ్, సప్లై ఆధారంగా మారుతుంటుంది. అధికారిక ధర అంటూ ఏదీ ఉండదు కాబట్టి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో ధరను సరిపోల్చుకోవాలి.లిస్టింగ్ అయ్యే విధానంఅన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవ్వాలంటే సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. కంపెనీ ముందుగా ఐపీఓ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. కంపెనీ తన పూర్తి వివరాలతో కూడిన డీఆర్‌హెచ్‌పీను సెబీకి సమర్పిస్తుంది. సెబీ ఈ నివేదికను పరిశీలించి అన్నీ బాగున్నాయని భావిస్తే అనుమతి ఇస్తుంది. కంపెనీ తన షేర్ ధరను నిర్ణయించి పబ్లిక్ ఇష్యూ తేదీలను ప్రకటిస్తుంది. ఐపీఓ సక్సెస్ అయ్యాక షేర్లు ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తాయి. దాంతో అన్‌లిస్టెడ్‌గా ఉన్న షేర్లు లిస్టెడ్ కేటగిరీలోకి మారతాయి.ఇదీ చదవండి: ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం
ఫ్యామిలీ
కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గాలంటే..!
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు, వ్యాయామాల తోపాటు..డిటాక్స్ డ్రింక్‌లు తోడైతే మరింత త్వరితగతిన బరువు తగ్గుతాం. ఇవి మన ఇంట్లోదొరికే వాటితోనే సులభంగా తయరు చేసుకోవచ్చు కడా. కఠినమైన డైట్, వర్కౌట్ల కంటే..ఇలాంటి సింపుల్ చిట్కాలతో మరింత సులభంగా బరువు తగ్గిపోగలమని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. తేలిక పాటి వర్కౌట్లు, చక్కటి ఆరోగ్యకరమైన డైట్ తోపాటు ఇలాంటి కొలెస్ట్రాల్‌ని తగ్గించే అద్భతమైన పానీయాలు త్వరితగతిన వెయిట్‌లాస్ అవ్వడంలో బాగా హెల్ప్అవుతాయట. నిశబ్దంగా వొంట్లో కొవ్వుని తగ్గించే ఆ గట్ రీసెంట్ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఫిట్నెస్ కోచ్ నేహా పరిహార్ కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గారట. అందుకు ఈ గట్ రీసెట్ డ్రింక్ బాగా హెల్ప్ అయ్యిందట. ఇది మన ఇంట్లో దొరికే దేశీ వస్తువులతో తయారు చేసే సాధారణ దేశీ మిశ్రమ టానిక్‌గా చెబుతున్నారు నేహా. అందుకు కావాలసినవి:అజ్వైన్ (వాము): 1 టేబుల్ స్పూన్ సోంపు : 2 టేబుల్ స్పూన్లు మెంతి గింజలు (మెంతి గింజలు): 1 టేబుల్ స్పూన్ తాజాగా తురిమిన అల్లం: 1 టేబుల్ స్పూన్ నీరు: 2.5 లీటర్లతయారీ విధానం:నీటిలో వాము, సొంపు, మెంతి గింజలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను కాస్త తగ్గించిన అప్పుడే తురిమిన తాజా అల్లం వేసి కొద్దిసేపు మరగనివ్వండి. ఆ తర్వాత వడకట్టి దానికి కొంచెం నిమ్మకాయ రసం జోడించి సేవించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 14 రోజుల చేసి చూస్తే..తప్పక మంచి ఫలితాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ నేహా.కలిగే లాభాలు..నేహా ప్రకారం,కొలెస్ట్రాల్‌ని ఎలా కరిగిస్తుందంటే..జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందిఅదనపు నీటి నిలుపుదలను బయటకు పంపిచేయడంలో సహాయపడుతుందిఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది. జీవక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుందిపేగు మంటను శాంతపరుస్తుందిచెడుకొలెస్ట్రాల్ని బయటకు పంపించేస్తుందిచివరగా ఈ పానీయం బరువు తగ్గేలా చేయదు, మన శరీర వ్యవస్థకు మద్దతు ఇచ్చి..ఆయా వ్యవస్థల పనితీరుని సమర్థవంతంగా ఉంచి..బరువుతగ్గేందుకు దారితీస్తుందని చెబుతోంది నేహా. దీంతోపాటు సమతుల్య భోజనం, తేలికపాటి వ్యాయామాలు, వేళ్లకు నిద్ర తోడైతే బరువు తగ్గడం మరింత సులభమని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ నేహా. ఈ చిన్నపాటి సాధారణ మార్పులు చోటుచేసుకుంటే సత్ఫలితాలను త్వరితగతిన పొందుగలమని చెప్పుకొచ్చింది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సూచనలు సలహాలు పాటించటం ఉత్తమం. View this post on Instagram A post shared by Neha Parihar (@growithneha) (చదవండి: సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..! అంత ఖరీదా..?)
మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలుసన్నిధానంపాండితావళంమాలికాపురం ప్రాంతం – అట్టతోడునీలిమలపుల్మేడుశరణ్ గుత్తిమరకూట్టంభక్తులకు సూచనలు..మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.(చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!)
విహారాల సీజన్ వింటర్..! సన్‌రైజ్ కోసం అక్కడ వాలిపోదామా..!
నిండా దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకోడానికి ఇష్టపడే పాత రోజులకు భిన్నంగా సూర్యోదయ కాంతిని ఆస్వాదించాలి అనుకుంటున్నారు నేటి తరం యువత. కురిసే మంచుకు చిక్కకుండా దాక్కునే ఒరవడికి భిన్నంగా మంచుకురిసే వేళ.. మెరిసే అందాలను వెతుక్కుంటున్నారు. ప్రతి చలికాలం కనిపించే ఈ సరదాలు.. సిసలైన చలిపులిని రుచి చూపిస్తున్నసీజన్లో సాహసికుల సరదాలు సిటీలో మరింత ఊపందుకున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షణకు కొండలు, గుట్టలమీదకు చేరుతున్నారు ఔత్సాహికులు. బ్రేక్‌ఫాస్ట్ టూర్స్ నుంచి బోన్ ఫైర్ వరకూ రెడీ అంటూ ఏడాదికి ఓసారి వచ్చే ఈ సీజన్లో అరుదుగా కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. స్వభావరీత్యా హైదరాబాద్ నగరం చల్లగా ఉండే ప్రాంతం.. శతాబ్దాల క్రితం మన సిటీని వేసవి విడిదిగా కూడా ప్రముఖులు పరిగణించేవారనే విషయం తెలిసిందే. అయితే రాను రాను కాంక్రీట్ జంగిల్లా మారిన నగరం తన అసలు స్వభావానికి దూరమైపోతోంది. అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే శీతాకాలంలో మాత్రం సిటీ పరిసరాలు రెట్టింపు ఆకర్షణతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ అందాలు ఆస్వాదించమంటూ సిటీజనులను ఆహ్వానిస్తున్నాయి. సన్‌రైజ్.. సర్‘ప్రైజ్’పొగమంచుతో కూడిన ఉదయాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఈ సీజన్లో ఆకట్టుకునే సన్‌రైజ్‌లు వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం బద్ధకాన్ని పక్కనబెట్టి తెల్లవారుఝామున 5 గంటలకే నిద్రలేని పలు ప్రాంతాలకు పయనమవుతున్నారు. అందమైన సూర్యోదయాల కోసం ఔటర్ రింగ్ రోడ్ (కోకాపేట్/నార్సింగి) లతో పాటు మహేంద్ర హిల్స్, ఖాజాగూడ హిల్స్ (బౌల్డర్ హిల్స్), మౌలాలీ హిల్స్.. వంటి కొండ ప్రాంతాలకు అలాగే నీటిలో తేలియాడే సూర్య కిరణాలను వీక్షించేందుకు అమీన్పూర్ సరస్సు, గండిపేట (ఉస్మాన్ సాగర్) రాజేంద్రనగర్ సమీపంలోని పీరంచెరువు సరస్సు, కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు అనుకునేవారు పోచారం ఆనకట్ట/సరస్సును విహారాలకు విడిదిగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో, అద్భుతమైన సహజ కాంతి కోసం కోహెడ గుట్ట ఎక్కువ మంది ఛాయిస్. వర్కవుట్.. ట్రెక్కింగ్ శరీరం నిదానంగా కదులుతూ క్రమక్రమంగా చురుకుగా మారే వాతావరణ పరిస్థితుల్లో తక్కువ అలసట, ఎక్కువ సంతృప్తి అందిస్తుంది. అందుకే యువత క్రీడలు, ముఖ్యంగా తెల్లవారుజామున ట్రెక్కింగ్ ఎంచుకునేందుకు అనువైన సీజన్ ఇది. ‘హైదరాబాద్‌లోని ప్రకృతి అందాలను అన్వేషించడానికి శీతాకాలం ఉత్తమ సమయం. మేం ఈ సీజన్లో వికారాబాద్ లేదా నగర శివార్లలో ట్రెక్కింగ్‌కు వెళ్తాం. చల్లని వాతావరణం, మా శారీరక సామర్థ్యాన్ని సానపెడుతోంది.ఓ ఆరోగ్యకరమైన ఈవెంట్‌ను ఆస్వాదించేలా చేస్తుంది’ అని కళాశాల విద్యారి్థని దీపా సమిరవ్ దేశాయ్ అంటున్నారు. వ్యాయామాలు, ఆటలు కూడా సిటిజనుల సీజనల్ ఫన్‌లో భాగమే. ‘మా స్నేహితుల బృందం శీతాకాలపు ఉదయాలను ఎక్కువగా సద్వినియోగం చేసుకునేందుకు సైక్లింగ్‌కు వెళ్తాం.. అలాగే ప్రశాంతమైన పరిసరాల్లో యోగా సాధన చేస్తాం.. దీని కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి ప్రాంతాలకు వెళతాం’ అని కార్పొరేట్ ఉద్యోగిని సోనియా గాలా చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ టూర్స్ షురూ.. ఈ సీజన్లో ఉదయాన్నే అల్పాహారపు వింటర్ టూర్స్ ఆస్వాదించే సమూహాలు కూడా ఉన్నాయి. అటువంటి క్లబ్ ది పొంగల్ గ్రూప్, ఇది ఈ సీజన్లో శాఖాహార అల్పాహారం కోసం బృందాలుగా బయటకు వెళుతుంది. సఫిల్‌గూడ నివాసి రాజేష్ కళ్యాణన్ మాట్లాడుతూ.. ‘మా బృందంలో చాలా మంది సభ్యులు ముఖ్యమైన సంస్థల్లో అధికారులు, కాబట్టి ఆదివారాలను విహారయాత్రల కోసం ప్రత్యేకిస్తాం. ఇతర శీతాకాలపు ఉదయాలు మాకు రైట్ టైమ్’ అని చెప్పారు. సన్‌సెట్స్.. అదిరే స్పాట్స్సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాలు కూడా ఈ సీజన్లో కనువిందు చేస్తాయి. నగరం చుట్టుపక్కల అటువంటి అందమైన సూర్యాస్తమయాల కోసం మౌలాలీ హిల్స్, విస్పర్ వ్యాలీ, ట్యాంక్ బండ్, ఖాజాగూడ హిల్స్, బుద్ధ విహార్, బిర్లా మందిర్, ఉస్మాన్ సాగర్, కుతుబ్ షాహీ టూంబ్స్, గోల్కొండ కోట, షామీర్పేట్ లేక్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, లాస్ట్ హౌస్ కాఫీ, వంటి ప్రదేశాలు బాగా పేరొందాయి. నగరంలోని బైద బాటిల్ వంటి కేఫ్స్, ఆక్వా ది పార్క్ వంటి హోటల్స్ కూడా ప్రత్యేకంగా సన్ రైజ్, సన్‌సెట్స్ ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. సాహసాల సీజన్.. ఈ సీజన్లో వారాంతాల్లో సాయంత్రం వేళ బహిరంగ సాహసాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. మన్నెగూడలోని డెక్కన్ ట్రైల్స్ మేనేజర్ ఫిలిప్ ప్రసాద్ ప్రకారం, ‘బోన్ ఫైర్లు, తెల్లవారుజామున ట్రెక్కింగ్, టెంట్లలో ఆకాశం కింద క్యాంపింగ్ చేయడానికి చాలా డిమాండ్ ఉంది. ఎక్కువ. వీటి కోసం వారాంతాల్లో కార్పొరేట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి’ అని చెప్పారు. (చదవండి: వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..)
ఈ ఏడాది హెల్త్‌కేర్ ట్రెండ్స్ ఇవి..!
వైద్యరంగంలో ఏడాదికేడాదీ చాలా అభివృద్ధులను నమోదు చేస్తోంది. కొత్త కొత్త సాంకేతిక పరిణామాలను, సరికొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించుకుంటోంది. కొన్ని పరిణామాలైతే మొత్తం హెల్త్ కేర్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక జబ్బుకు అందరికీ ఒకే రకరమైన స్టాండర్డ్ చికిత్స నుంచి... మెల్లగా ఆయా వ్యక్తుల తాలూకు జన్యుస్వభావాలను బట్టి వ్యక్తిగతమైన (పర్సనలైజ్డ్) చికిత్స వరకు ఇలా రకరకాల మార్పులను నమోదు చేసుకుంటోంది. కొద్దిరోజుల్లోనే 2025 వెళ్లిపోయి... మనమంతా 2026లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హెల్త్ కేర్ రంగంలో నమోదైన కొన్ని మార్పులను పరిశీలిద్దాం...పర్సనల్ కేర్ కొల్హాపూర్ టు హిందుస్థాన్ యూనిలీవర్ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లగ్జరీ హౌజ్‌కు నాయకత్వం వహించడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఆ ఘనత సాధించి సత్తా చాటిన మహిళ...లీనా నాయర్. కొల్హాపూర్ నుండి లగ్జరీ హౌజ్ ‘చానల్’ నాయకత్వ బా«ధ్యతల వరకు లీనా నాయర్ ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది. ఇంజినీర్ నుండి హెచ్ఆర్ ప్రొషనల్‌గా మారింది. హిందుస్థాన్ యూనిలీవర్లో ఎన్నో అడ్డంకులు బద్దలు కొట్టి ఆ ప్రసిద్ధ సంస్థలో మొదటి మహిళా చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ అయింది. ‘ఛానల్’ గ్లోబల్ సీయివోగా లీనా నాయర్ 36,000 మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తోంది. తన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఈ సంవత్సరం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(సిబిఇ) అవార్డ్ అందుకుంది.కోట్లాది హృదయాలను గెలిచిన... హార్ట్ ల్యాంప్తన కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’తో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది బాను ముస్తాక్. ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి కన్నడ రచయిత్రిగా చరిత్ర సృష్టించింది. 1990–2023 మధ్య ముస్తాక్ రాసిన ఈ కథలు దక్షిణ భారత ముస్లింల కష్టాలను హృద్యంగా ఆవిష్కరిస్తాయి. ప్రాంతీయ కథలకు విశ్వజనీనత ఉంటుంది’ అనే ముస్తాక్ నమ్మకాన్ని ‘హార్ట్ ల్యాంప్’ నిజం చేసింది.ముస్తాక్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదేళ్ల వయసులో ఆమెను ఒక కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు. అక్కడ బోధనా మాధ్యమం రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ. కన్నడ భాషలో అనర్ఘళంగా మాట్లాడడానికి ముస్తాక్ చాలా కష్టపడింది. ఆ అపరిచిత భాషనే తన సాహిత్య వ్యక్తీకరణగా చేసుకుంది.అత్యంత నిశితమైన వైద్య చికిత్సలు (ప్రెసిషన్ మెడిసిన్)...ఒక జబ్బుకు అందరికీ టోకుగా ఒకేలాంటి చికిత్స అందించడానికి బదులుగా ఆయా వ్యక్తి భౌలిక, మానసిక, జన్యుపరమైన స్వరూప స్వభావాలను బట్టి అతడికి మాత్రమే ఉద్దేశించిన చికిత్స అందించడాన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్‌గా చెప్పవచ్చు. అది ఆ వ్యక్తి జబ్బును బట్టి, దాని తీవ్రత ను బట్టి అలాగే అతడి జెనెటిక్స్, అతడుండే వాతావరణం (ఎన్విరాన్మెంట్), అతడి జీవనశైలి... ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికే పూర్తిగా సరిపడేలా చికిత్స అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే అత్యంత నిశితమైన వైద్య చికిత్స అంటూ ద రాయల్ సొసైటీ ఆఫ్ థాయిల్యాండ్ పేర్కొంటోంది. ఈ రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.టెలీహెల్త్...నిజానికి టెలీహెల్త్ అనే కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే మునుపు దీని పరిధి చాలా తక్కువ. ఉదాహరణకు హైదరాబాద్‌లో అత్యంత నిపుణులైన, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండవచ్చు. కానీ ఎక్కడో అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెలో ఒక తీవ్రమైన జబ్బు ఉన్న వ్యక్తికి అతడి సేవలు అవసరం. కేవలం టెలీహెల్త్ అనే కాన్సప్ట్‌లో మునుపు కేవలం బాధితులను టీవీ ద్వారా / తమ మొబైల్ ఫోన్లద్వారా లేదా పర్సనల్ కంప్యూటర్లకు అమర్చిన కెమెరాల ద్వారా చూడటం, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సకు అవసరమైన మందులను సూచించడం మాత్రమే జరిగేది. కోవిడ్–19 నేపథ్యంలో నేరుగా బాధితులను తాకడానికీ / లేదా వాళ్లను తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ తరహా టెలీమెడిసిన్ చికిత్సలు ఊపందుకున్నాయి. అటు తర్వాత ఇలా రిమోట్‌గా ఉన్నవారికి సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు... పెద్ద పెద్ద నగరాల్లోని నిపుణులైన సర్జన్లు ఎక్కడో సుదూరంగా ఉన్న చిన్న పట్టణాల్లోని పేషెంట్లకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్జరీలు విజయవంతంగా చేయడం సాధ్యమైంది. అందునా ఇటీవల భారతదేశంలో రోబోటిక్ సర్జరీ సహాయాలతో ఇలాంటి సర్జరీలు చేయడం మొదలైంది. ఇదెంత వరప్రదయని అంటే... ఏవైనా కారణాల వల్ల ఒక చిన్న పట్టణంలోకి పేషెంట్‌ను సుదూరంలోని పెద్ద నగరానికి తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో నగరాల్లోని అత్యంత నిపుణులైన డాక్టర్లూ తమ శస్త్రచికిత్స నైపుణ్యాలను అంతదూరంలోని పేషెంట్లకు అందజేయడానికి ఇప్పుడు వీలవుతోంది.ఉంగరాల్లాంటి ఉపకరణాలతో స్వీయ పరిశీలన...స్మార్ట్ వాచీల సహాయంతో తమ గుండె స్పందనలూ, రక్త΄ోటూ, ఎంతసేపు నిద్ర΄ోయామనే సమాచారం, తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ మేరకు నిద్రలోపించిందీ లేదా ఎక్కువ సేపు నిద్ర΄ోయారా అన్న విషయాలూ... ఇలాంటి స్వీయ ఆరోగ్య విషయాలను తెలుసుకునే ‘ఫిట్నెస్ ట్రాకర్లు’ వచ్చాయి. ఈ ఏడాది ఇది మరింత ముందుకు వెళ్లి... చిన్న ఉంగరంలాంటిది తొడగడం ద్వారా తమ రక్తంలోని చక్కెర మోతాదులు మొదలుకొని అనేక విషయాల్లో ఆరోగ్యసమాచారాలు తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడుతోంది. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యస్పృహ బాగా పెరిగిన ఈ రోజుల్లో ట్రెండీగా ఉన్న ఈ ఉంగరాలను తొడగడం మామూలైంది. ఇవి... ఒకపక్క ఫ్యాషనబుల్‌గా ఉండటంతో పాటు ఇటు ఆరోగ్య సమాచారాలూ తెలుస్తుండటంతో ΄ాటు ఇంచుమించూ బంగారు ఉంగరం ధరతో సమానంగా ఉండటంతో ఇటీవల వీటిని ధరించి తమ ఆరోగ్య సమాచారాన్ని తామే తెలుసుకోవడం, అవసరమైనప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం వంటి సౌకర్యం ఉండటంతో వీటికి ప్రాచుర్యమూ పెరుగుతోంది.కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌తో వ్యాధి నిర్ధారణలు, చికిత్సలు...ఒక డాక్టర్ తన జీవితకాలంలో ఓ లక్ష కేసులు చూడగలడని అనుకుందాం. అంటే ఒక లక్షమంది పేషెంట్లను చూసిన చరిత్ర / దాఖలాను బట్టి అతడి అనుభవం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి లక్షమంది అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుభవాలన్నీ క్రోడీకరించి... ఆ అనుభవ సారాన్ని కృత్రిమమేధస్సుకు ఆపాదిస్తే? అలాగే ఆ అనుభవసారంతో విశ్లేషించాల్సిన విషయాలను ఓ యంత్రానికి (మెషిన్ లెర్నింగ్) నేర్పితే? ఇందువల్ల కోటానుకోట్ల కేసులను చూసిన అనుభవం ఒక యంత్రంలో నిక్షిప్తమై ఉంటుందనీ, దానివల్ల చాలా సంక్లిష్టమైన కేసులనూ సులువుగా విశ్లేషించగలగడం వల్ల పేషెంట్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందంటూ కొన్ని ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. అయితే దీనికి చాలా పరిమితులు ఉంటాయనీ, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ఎప్పటికీ మానవ మేధస్సు తాలూకు విశ్లేషణలను సాధించలేదనేది చాలామంది అనుభవజ్ఞులైన డాక్టర్ల మాట. అయినప్పటికీ చాలాకేసుల్లో ఇప్పుడు పేషెంట్ తాలూకు ఆరోగ్య చర్రిత, రకరకాల రక్తపరీక్షలూ, మెడికల్ ఇమేజింగ్ పరిశీలనల ఆధారంగా రోగుల పరిస్థితిపై ఇప్పుడు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో విశ్లేషణలు జరిపాక దాన్ని నిపుణులైన డాక్టర్లు తమ అనుభవంతో సరిపోల్చుకుని (కో రిలేట్ చేసుకుని) అత్యంత నిశితంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రక్రియల నిర్ధారణ జరుపుతున్నారు.హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ అప్రోచ్... ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చిందనుకుందాం. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. ఇటు రక్తప్రసరణ వ్యవస్థలోనూ, అటు ఊపిరితిత్తుల విషయంలోనూ... ఈ రెండే కాకుండా బ్రెయిన్‌కు సరఫరా అయ్యే రక్తం కారణంగా మెదడును ఇలా రకరకాల వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు. అందుకే ఇటీవల వైద్య చికిత్సలు చేస్తున్న వివిధ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు... అంటే కార్డియాలజీ, పల్మునాలజీ, న్యూరాలజీ... ఇలాంటి నిపుణలంతా సంయుక్తంగా తాము నిర్వహించాల్సిన చికిత్సలను సమన్వయ పరచాల్సి ఉంటుంది. ఇలా వివిధ ఆరోగ్య వ్యవస్థలకే కాకుండా ఇటు శరీరక ఆరోగ్యం, అటు మానసిక ఆరోగ్యం, మరో వైపున ఆధ్యాత్మిక ఆరోగ్యం... ఇలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటేనే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చె΄్పాలనేది డబ్ల్యూహెచ్ఓ నిర్వచనం. అందువల్ల ఓ వ్యక్తి తాలూకు పూర్తి ఆరోగ్య పరిస్థితిని నిర్వహితమయ్యేలా చూడటమనే అంశం కూడా ఈ ఏడాది ప్రయత్నాల్లో ఒకటి.అడ్వాన్స్డ్ జీనోమిక్ రీసెర్చ్...ఒక వ్యక్తి తాలూకు జన్యుపరమైన అనారోగ్యాలకు అతడి జన్యువులు కూడా కారణమవుతాయి. కొందరిలో ఈ జన్యువుల్లో ఏదైనా తేడాలుంటే... చికిత్సకు సాధ్యం కాని సమస్యలూ, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ (కంజెనిటల్ డిసీజెస్), వైకల్యాలూ రావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకు చెడి΄ోయిన ఓ జన్యువు కారణమైనప్పుడు... నేరుగా ఆ జన్యువుకే చికిత్స అందించడం ద్వారా ఆ వైకల్యాన్ని తప్పించడం / నివారించడమనే అంశంపైన చికిత్స అందించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ముందుగా పేర్కొన్న టోకు చికిత్స కాకుండా... వ్యక్తిగత (పర్సనలైజ్డ్) చికిత్సకూ ఈ అడ్వాన్స్డ్ జీనోమిక్ చికిత్సలు తోడ్పడతాయి. ఈ రంగంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి విజయవంతమైతే గతంలో నిర్వహణ (మేనేజ్మెంట్) తప్ప చికిత్స లేని చాలా జబ్బులకు విజయవంతమైన పూర్తి చికిత్స అందే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. పురోగతి కూడా చాలావరకు కనిపించింది.నైతికాంశాలు, సదస్సులు...ఈ ఏడాది చోటు చేసుకున్న విప్లవాత్మకమైన పరిశోధనలూ, వైద్య చికిత్సలో, అందులోని పురోగతితో వాస్తవంగా పేషెంట్ ఎలాంటి చికిత్సలు ఎంతవరకు అవసరమో అంతే అందేలా, పేషెంట్ తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా... అలాగే అతడు సమాచార లోపానికీ, ఆర్థికంగా దోపిడికి గురికాకుండా చూసే నైతికాంశాలపై అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహితమయ్యాయి. ఈ పురోగతి పేషెంట్‌కు భారం కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలను ప్రస్తావిస్తూ... ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా నైతికవేత్తలు అనేకానేక ప్రస్తావనలూ, ప్రతిపాదనలూ తీసుకువస్తున్నారు. స్థూలంగా... ఈ ఏడాది 2025లో వైద్యరంగంలో చోటుచేసుకున్న పురోగతి, ఇంకా ఓ అసిధారావ్రతంలా కొనసాగుతున్న పరిశోధనల , సంక్షిప్త వివరాలివి.డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..)
అంతర్జాతీయం
మా విమానాలు కొంటే భారత్‌లో తయారీ
మారియెటా (యూఎస్): సైనిక రవాణా అవసరాల నిమిత్తం 80 భారీ విమానాల కొనుగోలుకు మోదీ సర్కార్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వందల కోట్ల డాలర్ల విలువైన ఆ కాంట్రాక్టు కోసం అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టీన్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి బిడ్ వేయడం విశేషం. తమ సీ–130జే సూపర్ హెర్క్యులెస్ భారీ విమానాలు భారత అవసరాలకు సరిగ్గా సరిపోతాయని ఈ అమెరికా దిగ్గజం తాజాగా పేర్కొంది. ఈ భారీ కాంట్రాక్టు లభిస్తే విమానాల తయారీకి భారత్‌లోనే మెగా హబ్ ఏర్పాటు చేస్తామని భారీ ఆఫర్ ప్రకటించింది. అమెరికా బయట తాము ఇలాంటి ప్లాంటు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అవుతుందని గుర్తుచేసింది. సీ–130జే సిరీస్‌లో లాక్‌హీడ్ ఇప్పటిదాకా 560కి పైగా విమానాలను సరఫరా చేసింది. అవి 23 దేశాల్లో సేవలందిస్తున్నాయి. మన వాయుసేవ వద్ద ప్రస్తుతం ఈ శ్రేణికి చెందిన 12 విమానాలున్నాయి. రవాణా అవసరాలతో పాటు నిఘా, ఎల్రక్టానిక్ వార్ఫేర్, గాలింపు, రెస్క్యూ మిషన్ల వంటి అవసరాల నిమిత్తం సీ–130జే శ్రేణిలో ప్రత్యేక కని్ఫగరేషన్లను సంస్థ అమరుస్తుంటుంది. ప్రస్తుతం డి్రస్టిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ తదితరాలతో వాటిని మరింత ఆధునీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఆ్రస్టేలియాతో పాటు జపాన్ కూడా సీ–130జే రవాణా విమానాల కొనుగోలు యోచనలో ఉన్నాయి. భారత వాయుసేన ప్రస్తుతం రవాణా అవసరాలకు సోవియెట్ కాలం నాటి ఏఎన్–32, ఐఎల్–76 రకం విమానాలపై ఆధారపడుతోంది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ పిలుపు
వాష్టింగన్: కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు.
‘నేను నీ బానిసనా?’.. మేనేజర్‌కి బుద్ది చెప్పిన ఉద్యోగి!
లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్లో మేనజర్‌గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్‌కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్‌లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్‌పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్‌కు అందించాడు. ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్‌కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF— Elon Musk (@elonmusk) December 26, 2025
జాతీయం
ప్రజలు కోరింది ఇవ్వకుంటే ఓట్లెలా వేస్తారు?
అహ్మదాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు ఓట్లెలా వేస్తారని రాహుల్‌ను ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ను రాహుల్‌కు అర్థమయ్యేలా చెప్పడం తనవల్ల కానిపని అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలే ఆయనకు ఈ విషయం చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి అమిత్ షా ఆదివారం అహ్మదాబాద్ నగర సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓ విషయం నన్నడిగారు..ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెసే ఎందుకు ఓటమిపాలవు తోంది అని. ప్రజలను అడగటానికి బదులుగా రాహుల్ ఈ ప్రశ్న నన్నడిగారు. రాహుల్ బాబా..! నేను ఇక్కడ ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలను అర్థం చేసుకుంటే, నీకు సమాధానం దొరుకుతుంది’అని అమిత్ షా అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలోనే కాదు, 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమిపాలవుతుంది. మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందని రాహుల్ తెలుసుకుంటారని ఆయన అన్నారు. ‘మా సిద్ధాంతాలతో ప్రజలు మమేకమ య్యారు. ‘అయోధ్యలో ఆలయాన్ని, ఉగ్రవాదు లపై సర్జికల్ స్ట్రయిక్స్‌ను, ఆర్టికల్ 370 రద్దును, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని, బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెళ్లగొట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇలా ప్రజలు కోరుకునే వాటిని వ్యతిరేకిస్తూ పోతే ఆ పార్టీకి ప్రజలు ఓట్లెలా వేస్తారు’అని అమిత్ షా పేర్కొన్నారు.
వినియోగదారులకు ‘హెల్ప్‌లైన్’ భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: వస్తువు కొని మోసపోయామనో, నాణ్యమైన సేవలు అందలేదనో వినియోగదారులు ఇకపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్’ (ఎన్సీహెచ్) వినియోగదారుల పక్షాన నిలుస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. గత ఎనిమిది నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా బాధితులకు ఏకంగా రూ.45 కోట్ల రీఫండ్‌ను ఇప్పించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ 25– డిసెంబర్ 26 మధ్య కాలంలో 31 వేర్వేరు రంగాలకు సంబంధించి వచ్చిన 67,265 ఫిర్యాదులను ఎన్సీహెచ్ పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఖర్చు లేకుండా ’ప్రీ–లిటిగేషన్’ (కేసు వేయక ముందే) దశలోనే సమస్యలను పరిష్కరిస్తుండటం వల్ల వినియోగదారుల కమిషన్లపై భారం తగ్గడంతో పాటు సామాన్యులకు త్వరితగతిన న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ మోసాలే దేశంలో అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రీఫండ్స్లో సింహభాగం ఈ–కామర్స్ రంగానిదే కావడం గమనార్హం. ఈ 8 నెలల్లో ఈ–కామర్స్ రంగానికి సంబంధించి 39,965 ఫిర్యాదులు పరిష్కారం కాగా, బాధితులకు రూ.32 కోట్లు తిరిగి వెనక్కి వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో ట్రావెల్ అండ్ టూరిజం రంగం ఉంది. ఈ రంగంలో 4,050 ఫిర్యాదులకు గాను రూ.3.5 కోట్లు రీఫండ్ అయ్యాయి. మొత్తం రీఫండ్స్లో 85 శాతానికి పైగా వాటా ఈ–కామర్స్, ట్రావెల్, ఏజెన్సీ సర్వీసులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్స్ రంగాల నుంచే ఉండటం గమనార్హం. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు బాధితులు ఈ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయిస్తూ తమ సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. హెల్ప్‌లైన్ కోసం 1915 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు, వాట్సాప్ (8800001915), ఎన్సీహెచ్ యాప్, ఉమంగ్ యాప్, వెబ్సైట్ ద్వారా 17 భాషల్లో ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంది.
భారతీయ వారసత్వ విశ్వరూపం
ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు. వందేమాతరం @ 150 1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్‌కాంగ్‌లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు. జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం సెపె్టంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది. దీపావళికి విశ్వ కిరీటం భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.మరాఠా కోటల ప్రపంచ రికార్డు జూలైలో పారిస్‌లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్‌గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం. మహనీయుల స్మరణఅహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సుయునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’! – సాక్షి, నేషనల్ డెస్క్
ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడాన్ని బాధితురాలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, పటిష్ట భద్రత కలి్పంచాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి విన్నవించారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష తగ్గించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమ బంధువులపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, జైలుపాలు చేశారని తెలిపారు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ధర్నాకు అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించాయి.
ఎన్ఆర్ఐ
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు
ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం
భారతదేశం, శ్రీలంక, అండోరా, మెక్సికో, నేపాల్ దేశాల శాశ్వత ప్రతినిధులతో పాటు ఇతర సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒకచోట చేరి ప్రాచీన ధ్యాన సాధనను జరుపుకున్నాయి. ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు దీని ప్రాధాన్యతను పంచుకున్నాయి.ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక రాజనీతితో సమ్మిళితం చేసిన ఒక విశేష క్షణంలో, రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గుర్తుచేసేందుకు సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యాయి. ప్రపంచ శాంతి, మానసిక శ్రేయస్సు మరియు నాయకత్వానికి ధ్యానం ఎంతగా ప్రాసంగికమవుతోందో ఈ సమావేశం మరొకసారి స్పష్టం చేసింది.“ప్రపంచ శాంతి సమరసత కోసం ధ్యానం” అనే శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేయడంతో పాటు మార్గనిర్దేశిత ధ్యానాన్ని కూడా నిర్వహించారు. భారతీయ నాగరిక వారసత్వంలో పుట్టిన ఈ సాధనను ప్రపంచంలోని అత్యంత కీలకమైన దౌత్య వేదిక కేంద్రానికి తీసుకువచ్చిన ఘట్టమిది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వక్తలు ఇదే భావనలను ప్రతిధ్వనించారు. అండోరా రాయబారి జోన్ ఫోర్నర్ రోవిరా, తన దేశ విద్యా వ్యవస్థలో ధ్యానాన్ని సమీకరించడం వల్ల విద్యార్థుల దృష్టి సామర్థ్యం భావోద్వేగ నియంత్రణ మెరుగుపడిందని తెలిపారు. మెక్సికో ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి అలీసియా గ్వాడలూపే బుయెన్‌రోస్త్రో మాసియూ, దీర్ఘకాలిక ప్రపంచ సమరసతకు అంతర్గత శాంతే పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు.నేపాల్ రాయబారి లోక్ బహాదూర్ థాపా, హిమాలయ ప్రాంతంలో ధ్యానానికి ఉన్న లోతైన నాగరిక మూలాలను ప్రస్తావిస్తూ, వాతావరణ మార్పు నుంచి తప్పుడు సమాచారం వరకు పరస్పరంగా ముడిపడిన ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనేందులో ధ్యానం పోషించే పాత్రను వివరించారు.ఈ కార్యక్రమంలో హాజరైన ఇతర ప్రముఖులు: మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. రాబర్ట్ ష్నైడర్; యోగమాత ఫౌండేషన్‌కు చెందిన యోగమాత కేకో ఐకావా;బ్రహ్మ కుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ పరిపాలనా ఆధ్యాత్మిక అధిపతి బీకే మోహిని పంజాబీ; జీవన్ విజ్ఞాన్ ఫౌండేషన్ నేపాల్‌కు చెందిన ఎల్. పి. భాను శర్మ, రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన డా. లసంత చంద్రన గూనెతిల్లేకె; భౌతిక శాస్త్రవేత్త, శాంతి కోసం శాస్త్రవేత్తల గ్లోబల్ యూనియన్ అధ్యక్షుడు మరియు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉద్యమ నాయకుడు డా. జాన్ హాగెలిన్.ఈ కార్యక్రమం ముగింపులో, గురుదేవ్ రాయబారులు, ప్రతినిధులను 20 నిమిషాల మార్గనిర్దేశిత ధ్యానంలో నడిపించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అరుదైన నిశ్శబ్ద క్షణాన్ని సృష్టిస్తూ, ప్రాచీన సంప్రదాయాల్లో పుట్టిన సాధనలు నేటి ప్రపంచ వేదికపై కూడా ఎలా కొత్త ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయో గుర్తు చేశారు.డిసెంబర్ 21న జరగనున్న ప్రపంచ ధ్యాన దినోత్సవం వైపు ప్రపంచం ముందుకు సాగుతున్న వేళ, ఈ ఉద్యమం ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పరిధిని దాటి శీర్షికల్లో నిలుస్తోంది. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ “World Meditates with Gurudev” అని ప్రకటించే బిల్లుబోర్డులతో వెలిగిపోతోంది ప్రపంచ వేదికపై ఒక భారతీయ ఆధ్యాత్మిక నాయకుడి నేతృత్వంలో జరుగుతున్న అరుదైన గ్లోబల్ ఘట్టానికి ఇది సంకేతం. న్యూయార్క్ నుంచే గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ధ్యానంలో పాల్గొంటారు.
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
క్రైమ్
వ్యభిచారం కేసులో మహిళ అరెస్ట్
గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్‌కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు.
యువతి శవంతో ప్రియుడి ఇంటిముందు ఆందోళన
నారాయణఖేడ్: తమ కూతురు మృతికి ప్రేమికుడే కారణమంటూ యువతి శవంతో ప్రేమికుడి ఇంటి ముందు ఆమె కుటుంబీకులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లి మాణిక్ నాయక్ తండాలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం కడ్పల్ విఠల్ నాయక్ తండాకు చెందిన వడిత్య కావేరి (23), నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండాకు చెందిన సభావత్ శ్రీకాంత్ (24)లు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించడంతో వారు నిరాకరించారు. దీంతో ప్రేమికులు హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబా ద్ శివార్లలోని బాలాపూర్ ప్రాంతంలో కావేరి తాము నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి తమ కూతురు మృతికి ప్రేమికుడు శ్రీకాంతే కారణమంటూ మాణిక్ తండాలోని అతని ఇంటి ముందు కావేరి మృతదేహంతో ఆందోళనకు దిగారు.ఆదివారం ఉదయం వరకు వారు అక్కడే బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకుని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రెండు తండాలకు చెందిన పెద్దలు, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కావేరి అంత్యక్రియలను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు నిర్వహించేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించారు.
ప్రాణాలు తీసిన సరదా
కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్ కాలుజారి కుంటలో పడిపోయాడు. కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేకపోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు. ఇంటర్ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్ మర్రిగూడెం హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
నేరాలపై ఉక్కుపాదం: కోరుట్ల పోలీసుల ఏడాది రికార్డు
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు ప్రజల ప్రశంసలు పొందారు. అలాగే 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. వాటిలో రూ.1.72 కోట్ల నగదు తిరిగి బాధితులకు అందజేశారు. న్యాయ నిరూపణ ద్వారా ఈ సంవత్సరం 100 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయి. అలాగే ఐదు విడతల లోక్ అదాలత్‌ల ద్వారా 9,595 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో 11 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నిర్వహణ విధుల నిర్వహించి రాష్ట్రంలోనే జగిత్యాల రెండో జిల్లాగా నిలిచింది. జగిత్యాలక్రైం: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే 5.05శాతం నేరాలు తగ్గాయి. 2024లో 5,620 నేరాలు నమోదు కాగా.. 2025లో 5,919 నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి 229 కేసులు, (5.05 శాతం) తగ్గాయి. ఇందులో అత్యధికంగా జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 770 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా బుగ్గారం పోలీస్‌స్టేషన్‌లో 135 నమోదయ్యాయి. ఈ ఏడాది మొత్తం 29 హత్య కేసులు నమోదు కాగా.. వీటిలో కలహాలు, ఆస్తి వివాదాలు, వరకట్న హత్యలు, చిన్నచిన్న గొడవలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.381 దొంగతనాలు381 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా.. వాటిలో 187 కేసులను చేధించి రూ.22,92,37,439 విలువైన ఆస్తి (69.85 శాతం)ని రికవరీ చేశారు. 104 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయి. జిల్లాలో 19 పీడీఎస్ రైస్ కేసులు నమోదు చేసి 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులను, 260 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.30,62,036 నగదు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9,290 కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినప్పటికీ.. మృతుల సంఖ్య తగ్గింది. మాదక ద్రవ్యాలపై 86 కేసులుమాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2025లో ఇప్పటివరకు 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 86 కేసుల్లో 203 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మాదకద్రవ్యాల నివారనే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. 75 హిస్టరీ, 33 రౌడీషీట్ కేసులుతరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్న వారిపై 75 హిస్టరీ షీట్లు ఓపెన్ చేశా రు. హత్య కేసుల్లో పాల్గొన్న వారిపై 33 రౌడీ షీట్లు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. డయల్ 100కు 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసుల్లో 54 మందిని అరెస్ట్ చేశారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 11లో భాగంగా 11 కార్యక్రమాలు నిర్వహించి 76 మంది పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎన్నికల్లో 21 కేసులుఇటీవల జిల్లాలో రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశారు. 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 34 కేసులు నమోదు చేసి 34 మంది నిందితుల నుంచి రూ.180,800 విలువైన 199.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలుహన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న సోదాలు చేపట్టారు. శ్రీనివాస్‌పై ఆదాయానికి మించి ఆస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 6న జిల్లా రవాణా శాఖ అధికారి బానోవత్ భద్రునాయక్, ఆయన డ్రైవర్ అరవింద్ జేసీబీ వాహనానికి పొల్యుషన్, ఇన్సూరెన్స్ లేదని యజమానిని బెదిరించి రూ.40 వేలు డిమాండ్ చేశారు. సదరు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వీడియోలు
Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్
రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు
ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం
తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు
రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్
ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

