సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్‌లను పునర్ వ్యవస్థీకరించి నాలుగు కమిషనరేట్‌లుగా విస్తరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (రాచకొండ కమిషనరేట్ స్థానంలో) , ఫ్యూచర్ సిటీ ఇలా నాలుగు ప్రాంతాల్లో నాలుగు కమిషనరేట్లను ప్రభుత్వం విస్తరించనుంది. ఈ మేరకు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్‌లను బదిలీ చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కమిషనరేట్‌ల పరిధులు
-హైదరాబాద్ కమిషనరేట్: అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలు.
- సైబరాబాద్ కమిషనరేట్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్‌పూర్ వంటి ఐటీ , పారిశ్రామిక ప్రాంతాలు.
- మల్కాజిగిరి కమిషనరేట్: కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు.
- ఫ్యూచర్ సిటీ కమిషనరేట్: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు.
కొత్త నియామకాలు
1. సుధీర్ బాబు, ఐపీఎస్: రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీరిని, కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ (Future City) పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
2. అవినాష్ మొహంతి, ఐపీఎస్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అవినాష్ మొహంతిను రాచకొండ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
3. డా. ఎం. రమేష్, ఐపీఎస్: ఐజీపీ (ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్) గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ రమేష్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
4. అక్షంష్ యాదవ్, ఐపీఎస్: యాదాద్రి భువనగిరి డీసీపీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అక్షంష్‌ను నూతనంగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా (SP) నియమించారు.
నాలుగు కమిషనరేట్‌లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి-భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.


