Warangal
-
పది రోజులుగా టెంట్‌కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. చివరికి అనారోగ్యంతో చనిపోగా, ఇంటి యజమాని ఒప్పుకోకపోవడం, పది రోజుల కార్యక్రమాలయ్యే వరకు రావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖాళీ ప్లాట్‌లో టెంట్‌వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజులుగా అదే టెంట్లో కాలం గడుపుతున్నారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండల కేంద్రం, చుట్ట పక్కల గ్రామాల్లో ఒకప్పుడు ఎల్ఎన్ టైలర్‌గా దార్ల లక్ష్మీనారాయణ ఓ వెలుగు వెలిగాడు. డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యోగా గురువుగా ఎంతోమంది కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. పది రోజులక్రితం అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. మృతదేహం ఉంచేందుకు ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో వారికున్న ఖాళీ స్థలంలో(ప్లాట్)లో టెంట్ వేసి దహనసంస్కారాలు నిర్వహించారు. పది రోజుల వరకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ టెంట్‌కు చుట్టూ పరదాలు కట్టుకొని కాలం వెళ్లదీస్తూ మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వర్షం పడుతున్నా టెంట్‌కిందనే జీవనం సాగిస్తున్న దైన్యం. దశదిన కర్మ కార్యక్రమానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారని ఆశగా చూస్తున్నట్లు కుమారుడు దార్ల ఉపేందర్ తెలిపాడు. -
మహిళా కానిస్టేబుల్‌కు సీపీ అభినందన
వరంగల్ క్రైం: ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ స్పందనను సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం అభినందించారు. వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ వి భాగంలో మహిళా కానిస్టేబుల్ స్పందన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గత నెల పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో నిర్వహించిన మొదటి ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఫెన్సింగ్ క్రీడలో సీనియర్ ఉమెన్స్ టీం ఫాయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే పోలీస్ సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి, ఏఆర్ ఏసీపీ అంతయ్య పాల్గొన్నారు. ఎంసీఏ పరీక్షలు షురూ..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్యాంపస్‌లోని ఎకనామిక్స్ విభాగంలో ఏర్పా టు చేసిన ఎంసీఏ పరీక్ష కేంద్రాన్ని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం పరిశీలించారు. కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల వివిధ సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. బెస్ట్ ప్రాక్టీసెస్ నమోదు గడువు పెంపువిద్యారణ్యపురి: ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తమ పాఠశాలల్లో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువును ఎస్సీఈఆర్టీ పెంచినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి బుధవారం తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీల, తెలంగాణ మోడల్ పాఠశాలలు, తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఈనెల 22వ తేదీ వరకు ఎస్సీఈ ఆర్టీవెబ్సైట్లో, హెచ్‌టీటీపీఎస్//ఎస్సీఈఆర్టీ.తెలంగాణ.గౌట్.ఇన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సందేహాలుంటే డి.మధుసూదన్‌రెడ్డి 97058 06579 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని బీసీ కులానికి చెందిన శిక్షణలో ఉన్న అడ్వకేట్ విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి బీసీ అడ్వకేట్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి..విద్యారణ్యపురి: పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన విషయాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. బుధవారం జిల్లాలోని భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని డీఈఓ వాసంతి సందర్శించి హెచ్ఎంలను ఉద్దేశించి మాట్లాడారు. వృత్తిపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకోవాలన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ మార్గాలను అనుసరించాలని హెచ్ఎంలకు డీఈఓ సూచించారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, రిసోర్స్పర్సన్లు రామకృష్ణ, వేణు ఆనంద్, మనోహర్‌నాయక్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్లా.. మజాకా ● ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం పట్టు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025– 8లోuహన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీలు.. వాటివెనుకున్న రాజకీయ ప్రమేయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి తహసీల్దార్లు వచ్చారు. ఇక్కడి వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. తాజాగా ప్రభుత్వం తహసీల్దార్ల అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపింది. దీంతో జిల్లాకు వచ్చినవారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్ పోస్టులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమకు ప్రాధాన్యం ఉన్న మండలాల్లో పోస్టు కావాలని ఉన్నతాధికారులపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జిల్లాలోని 14 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ముఖ్యంగా హసన్‌పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, ఎల్కతుర్తి, కాజీపేట మండలాల విషయంలో అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అటు అధికారులను, ఇటు ప్రజాప్రతిధులను సమన్వయ పరుస్తూ జిల్లా ఉన్నతాధికారులు పోస్టింగ్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని మండలాల తహసీల్దార్లు తమ సీటుకు ఎసరు వస్తుందని ముందే పసిగట్టి స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా స్థానచలనం కలగకుండా చూడాలని చివరి దాకా ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈక్రమంలో తమకేం కాదని, తమ మండలాలకు ఎవరూ రారులే అనుకుని ఉన్నవారికి మాత్రం ఊహించని రీతిలో బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ప్రస్తుత బదిలీల్లో భీమదేవరపల్లి, నడికూడ, పరకాల, వేలేరు తహసీల్దార్ పోస్టులతోపాటు పరకాల డీఏఓ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పోస్టులకు కేటాయించారు. వారిలో కొందరికి మంచి పోస్టులే వచ్చినా.. తాము అనుకున్న స్థాయి పోస్టులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బదిలీల్లో వేలేరు తహసీల్దార్ కోమిని కలెక్టరేట్‌కు, కలెక్ట్టరేట్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ను వేలేరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వాటిని బుధవారం మళ్లీ మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేసిన తహసీల్దార్ కోమిని వేలేరులోనే ఉండేలా, ప్రసాద్ కలెక్టరేట్లో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా చాలాకాలం తర్వాత జరిగిన తహసీల్దార్ల బదిలీలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. త్వరలో జిల్లాకు మరో ఇద్దరు తహసీల్దార్లు వస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో వారి రాక ఎవరి సీటుకు ఎసరుతెస్తుందోనని గుసగుసలు మొదలయ్యాయి. న్యూస్రీల్అయినా అసంతృప్తి.. కలెక్టరేట్లో ఉండేందుకు ససేమిరా... వేలేరు తహసీల్దార్ రిటెన్షన్ కొందరికి ప్రజాప్రతినిధుల భరోసా హనుమకొండ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర చర్చ -
ఘనంగా సైలానీ బాబా గంధం జాతర
దామెర: మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని సైలానీబాబా దర్గా గంధం ఉర్సు ఉత్సవాలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం సమర్పణ కార్యక్రమం కనులపండువగా సాగింది. ఈసందర్భంగా ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పరకాల ఆర్డీఓ కె.నారాయణ, ఏసీపీ సతీశ్‌బాబు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, సీఐ రంజిత్‌రావు, ఎస్సై అశోక్ విద్యుత్ ఏఈ రమేశ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చాదర్లను తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఒంటెలపై గంధం తీసుకొచ్చే తంతు కనులపండువగా సాగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన డప్పు కళాకారుల నృత్యాలు, ఫకీర్ల విన్యాసాలు ప్రదర్శిస్తుంటే దర్గా ప్రధాన ద్వారం నుంచి దర్గా వరకు ఊరేగింపుగా వచ్చి గంధం సమర్పించారు. దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్(సైలానీబాబా) ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున హాజరైన ముస్లింలు -
ఉనికిచర్లకు పట్టణ రూపు తీసుకొస్తా..
ధర్మసాగర్: ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు తీసుకొస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధి ఉనికిచర్లలో రూ.1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, వరద కాలువల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఉనికిచర్ల గ్రామాభివృద్ధికి ‘కుడా’ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత స్వయంగా గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉనికిచర్ల నుంచి రాపాకపల్లి రోడ్డుకు రూ.41 లక్షలు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఉనికిచర్లకు 24 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, త్వరలో మరో 24 మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రంలో రూ.59 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను, ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మసాగర్ గ్రామానికి 68 ఇల్లు మంజూరు అయ్యాయని, ఇల్లు మంజూరు అయిన వారంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గొప్ప ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పోరేటర్ ఆవాల రాధికా రెడ్డి, గ్రేటర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంతోశ్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సీడీపీఓ విశ్వజ, పీఆర్ డీఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఏఈ నిఖిల్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, బల్దియా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆత్మకూరు: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వివరాలు, సిబ్బంది హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మండలంలోని తిరుమలగిరిలో నిర్మించిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్ని పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూలీలకు రూ.307 వచ్చేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. ఐకేపీలో యూనిఫామ్ కుడుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గుడెప్పాడ్‌లో ఈజీఎస్‌లో సాగుచేస్తున్న అజోల్లా సాగును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఈజీఎస్ పనుల్ని రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్సీ సిబ్బంది రోగులకు అవసరమైన సేవలను జాప్యం లేకుండా అందించాలన్నారు. గ్రామాల్లో చెత్తసేకరణను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మహిళలు కుట్టు పనిపై శ్రద్ధ వహించాలని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ, ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ స్వాతి, ఏపీఓ రాజిరెడ్డి, డీపీఎం ప్రకాశ్, ఏపీఎం లలిత తదితరులు పాల్గొన్నారు. అర్హుల ఎంపిక త్వరగా పూర్తి చేయండి.. హన్మకొండ అర్బన్: రాజీవ్ యువ వికాస ం పథకం అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం, ఉపాధి హామీ పథకాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 10,565 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి తుది జాబితా అందించాలన్నారు. ఉపాధిపథకం ద్వారా 7,675 పని దినాలకు ఇప్పటి వరకు 3,645 పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ డీడీ రవీందర్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎల్డీఎం శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అంగన్వాడీల్లో చేపట్టిన పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి పథకం ద్వారా 24 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పీఆర్ ఈఈ ఆత్మరావు, ఈఈ నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
హన్మకొండ: తమకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే పనులు చేయడం సాధ్యపడుతుందని విద్యుత్ కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఈక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ పరిధిలో సబ్ డివిజన్ల వారీగా విద్యుత్ సంబంధ పనులు పూర్తి చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు పిలిచారు. ఈనెల 22న టెండర్లు వేయాల్సి ఉంది. దీనికిగాను షెడ్యూల్ తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. గడువులోగా ఒక్క కాంట్రాక్టర్ కూడా షెడ్యూల్ తీసుకోలేదు. దీంతో గురువారం టెండర్లు వేసే అవకాశం లేదు. కాంట్రాక్టర్లు హనుమకొండ సర్కిల్ కార్యాలయానికి వచ్చినా షెడ్యూల్ మాత్రం తీసుకోలేదు. వచ్చిన వారు కూడా ఇతరులెవరైనా టెండర్ల షెడ్యూల్ తీసుకుంటారేమోనని జాగ్రత్తగా గమనిస్తూ కార్యాలయం ఆవరణలోనే కాపుకాశారు. కాంట్రాక్టర్లంతా సమష్టిగా టెండర్లు వేయడానికి ముందుకు రావట్లేదు. వారు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఆరేళ్ల క్రితం స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్లు పెంచలేదని, ప్రతీ మెటీరియల్ రేట్ రెట్టింపు స్థాయిని మించి పెరిగాయని, ఈరేట్లతో పనులు చేస్తే గిట్టుబాటు ఏమో కానీ.. అప్పుల పాలు కావాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. రెండేళ్ల క్రితం తాము సమ్మెకు వెళ్లగా.. నెలన్నర రోజుల్లో పెంచుతామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాము హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ముగిసిన కాల పరిమితి సబ్ డివిజన్ పరిధిలో రూ.20 లక్షల్లోపు విద్యుత్ అభివృద్ధి పనులు చేసేందుకు ఏడాది కాల పరిమితితో కాంట్రాక్టర్లను నియమిస్తారు. ఈకాంట్రాక్టర్ల నియామకానికి ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టెండర్లు పిలుస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖరారు చేసిన కాంట్రాక్టర్ల నియామక కాల పరిమితి ముగిసింది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్ల నిరాకరణ ఎదురైంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లపై పూర్తి అసంతృప్తితో ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ఏ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరు. రేట్ల ఖరారుపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై కాంట్రాక్టర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆరేళ్లుగా పెంచని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు రేట్లు పెంచితేనే టెండర్లకు వస్తామంటున్న కాంట్రాక్టర్లు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నెక్కొండ: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విత్తన టాస్క్‌ఫోర్స్ బృందం ఏడీఏ దా మోదర్‌రెడ్డి, నెక్కొండ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల షాపులను వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విత్తన స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్స్, విత్తన నిల్వలు, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసా య, పోలీసు శాఖ సమన్వయంతో నకిలీ విత్తనాలను అరికట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతుకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత మ నందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సై మహేందర్, వ్యవసాయ అధికారులు టి.కృష్ణ, సీహెచ్ గోపాల్‌రెడ్డి, నాగరాజు, షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణతో మెరుగైన బోధనఖానాపురం: మెళకువలతో విద్యార్థులకు బోధించాలని శిక్షణ కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ బొమ్మెర కుమారస్వామి అన్నారు. బుధరావుపేట మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో వినియోగించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. శిక్షణ ద్వారా విద్యార్థులకు మెరుగైన, సులభమైన విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, ఆర్పీలు వాగ్యా, కిరణ్, భిక్షపతి, శ్రీనివాస్, చంద్రమౌళి, సారయ్య, ఎమ్మార్సీ సిబ్బంది శశిధర్, రాజేందర్, మహేందర్, రజిని, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలువర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేటలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..తొర్రూరుకు చెందిన ఎర్ర అశోక్ తన స్విఫ్ట్ కారులో రాయపర్తి వైపు నుంచి వర్ధన్నపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వర్ధన్నపేట ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాల సమీపంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి వద్ద కారు ముందు టైరు పగిలిపోయింది. దీంతో అదుపు తప్పి రాయపర్తి వైపు వెళ్తున్న ఆటోతోపాటు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన రామారపు రాములు,వర్ధన్నపేటలోని నీలగిరి స్వామి తండాకు చెందిన బానోత్ పద్మ, ఏఎన్ఎం వజ్జాల మంగతాయారు, బైక్‌లు నడుపుతున్న డీసీ తండాకు చెందిన బానోత్ నరేశ్, సపావట్ దశరథం, పెద్దవంగరకు చెందిన మార్గం సతీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురితోపాటు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి● స్ఫూర్తి కార్యక్రమంలో డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ విద్యారణ్యపురి: ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ కోరారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాల విద్యార్థులకు మట్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలా చదివి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కావాలో ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీజీ కె.అరుణ, స్ఫూర్తి కార్యక్రమం ఇన్చార్జ్ మల్లారెడ్డి, ఎంఈఓ గంప అశోక్‌కుమార్, హెచ్ఎం వెంకన్న, ఉపాధ్యాయుడు దేవులపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేసవి శిబిరం పరిశీలన పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ పరిశీలించారు. 15 రోజులుగా నిర్వహిస్తున్న శిబిరం బుధవారం ముగిసింది. విద్యార్థులకు క్రీడాపోటీలు, యోగా, నృత్యం తదితర అంశాల్లో వలంటీర్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. వలంటీర్ యాకూబ్, భరతనాట్యం గురువు శశాంక్, జూడో కోచ్ వీరస్వామి, ఆర్ట్ క్రాఫ్ట్ వలంటీర్ సర్వత్బేగం, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● కలెక్టర్ సత్యశారదపర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండలంలోని కొంకపాక, చౌటపల్లి, జమాల్‌పురం గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీల ద్వారా దిగుమతి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. తడిసిన ధా న్యాన్ని వెంటనే ఎండబెట్టి, ఆరిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ నీరజ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, రైస్‌మిల్లర్లు, పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి
నర్సంపేట: పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వెంకట్‌రెడ్డి సూచించారు. చెన్నారావుపేట రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సాగు ఖర్చులు, రసాయన ఎరువుల వినియోగం ఎలా తగ్గించుకోవాలి, సాగునీరు ఆదా, పంట మార్పిడి ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, విత్తన రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. సూక్ష్మశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస సుస్థిర వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి, చెన్నారావుపేట మండల వ్యవసాయ అధికారి గోపాల్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడిదుగ్గొండి: పంట మార్పిడి పద్ధతితో అధిక దిగుబడి సాధించవచ్చని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి ప్రధాన శాస్త్రవేత్త వీరన్న అన్నారు. మండలంలోని లక్ష్మీపురం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటలకు అధికంగా యూరియా వాడటం అనర్థమని, పచ్చిరొట్ట పైరుతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కీటక శాస్త్రవేత్త శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాలని కోరారు. వరిసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఎస్ఎం ప్రతినిధి సారంగం, ఏఓ మాధవి, ఏఈఓ విజయ్‌నాయక్, రైతులు పాల్గొన్నారు. -
పుష్కరిణీ.. ప్రణామం!
ఆకాశం అక్షింతలేసినట్లుగా చిరు చినుకులు.. నిశ్శబ్దంగా నది పరుగులు.. కాళేశ్వరం వైపు భక్తుల అడుగులు. వెరసి త్రివేణి సంగమం భక్త జన సందోహమైంది. ఏడో రోజు బుధవారం సైతం భక్తుల ప్రవాహం కొనసాగింది. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అంతర్వాహిని సరస్వతి నదికి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్షమందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోuఏడో రోజు కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తజనం సరస్వతి ఘాట్‌లో స్నానాలు.. ముక్తీశ్వరుడి దర్శనం -
ఆధునిక హంగులు.. అమృత్ వెలుగులు
సాక్షి, వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.25.41 కోట్ల అమృత్ నిధులతో కాకతీయుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్‌ను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్‌ఫాంలు, ట్రాక్‌లు, సౌకర్యాల కల్పనతోపాటు అనేక విస్తరణలు, ఆధునికీకరణ పనులు చేశారు. ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఏమేం పనులు చేశారంటే.. కాకతీయ కళాతోరణం ఉండేలా స్టేషన్ ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతోపాటు మూడు లిఫ్ట్‌లు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫాం విస్తీర్ణం పెంపు, ప్లాట్‌ఫాంపై అదనపు కప్పు, దివ్యాంగులకు కొత్త టాయిలెట్ బ్లాకులు నిర్మించారు. వెయిటింగ్ హాల్ అభివృద్ధి, ఆహ్లాదం కోసం స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా స్టేషన్ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేశారు. కళలు, సంస్కృతికి సంబంధించిన చిత్రాలు వేశారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు అమర్చారు. రోజుకు 31,887 మంది రాకపోకలు.. ● కాజీపేట, విజయవాడ సెక్షన్లో ఉన్న ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ● ఈ స్టేషన్లో దాదాపు 137రైళ్లు ఆగుతాయి. న్యూ ఢిల్లీ, హౌరా, చైన్నె, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఇక్కడా హాల్టింగ్ ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్‌కు నూతన సొబగులు రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రయాణికులకు సకల సౌకర్యాలు వర్చువల్‌గా నేడు ప్రారంభించినున్న ప్రధాని మోదీ -
పరీక్షల బోర్డు నిబంధనలు పాటించాలి
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో స్క్వాడ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ పాల్గొని మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా స్క్వాడ్ల బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్లు వివరించారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 5,200 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. -
కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్‌ను మోటార్ ఆన్చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్తీగలను సాకెట్లో పెడుతుండగా షాక్‌గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చనిపోయే ముందు ఉప్మా అందించాడు..రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
దొడ్డుగా సాగు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగు విషయంలో దొడ్డు రకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. సన్న రకాలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500ల బోనస్ ప్రకటించినప్పటికీ..ఎప్పటిలా దొడ్డు రకాల కంటే తక్కువే సాగయ్యాయి. ఈ యాసంగిలో తెలంగాణ వ్యాప్తంగా 63,54,286 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా పంట విస్తీర్ణం ఏకంగా 79,99,834 (126 శాతం) ఎకరాలకు పెరిగింది. వరి 47,27,000 ఎకరాల్లో సాగవుతుందని అనుకుంటే.. ఏకంగా 59.86 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో 65 శాతానికి పైగా దొడ్డురకాలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే సన్నాల సాగు పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు కేంద్రాలకూ ఎక్కువగా దొడ్డురకాలే.. వరి సాగు విస్తీర్ణం పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాసంగిలో 71,03,283 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ 8,412 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినా.. చివరకు 8,353 కేంద్రాలను తెరిచింది. వీటి ద్వారా ఈ నెల 20వ తేదీ నాటికి 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 37.50 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు కాగా, సన్న రకం కేవలం 18.47 లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం.సన్నాలకు ఎన్ని సమస్యలో.. సన్న రకం వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. నీటి వసతి ఎక్కువగా ఉండాలి. చీడపీడల బెడద అధికం. పంట కాలం సైతం నెల రోజులు ఎక్కువగా ఉంటుంది. అకాల వర్షాలతో నష్టపోయే అవకాశం ఉంటుంది. పైగా యాసంగిలో వాతావరణం దృష్ట్యా దిగుబడి తక్కువగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలను చూస్తే.. తెలంగాణ సోనా ఎకరాకు 20 నుంచి 23 క్వింటాళ్లు, బీపీటీ 20 క్వింటాళ్ల వరకు, జై శ్రీరాం 18 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదే దొడ్డు రకం వరి అయితే 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే దొడ్డు సాగువైపు మొగ్గు చూపామని వివరిస్తున్నారు.యాసంగి సాగు, కొనుగోళ్ల లెక్కలివీ..71,03,283 మెట్రిక్ టన్నులు యాసంగి 2024–25 ధాన్యం కొనుగోలు లక్ష్యం..55.97 లక్షల మె.టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసినవి (20.05.2025) 37.50 లక్షల మె.టన్నులు ఇందులో దొడ్డు రకం ధాన్యం18.47 లక్షల మె.టన్నులు సన్న రకం ధాన్యం 8,412ప్రతిపాదించిన కొనుగోలు కేంద్రాలు8,353ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలురూ.12,974.10 కోట్లు కొనుగోలు చేసిన ధాన్యం విలువరూ.9,632.66 కోట్లు ఎంపీఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులుఎక్కువ దిగుబడి కోసమే దొడ్డు రకం.. సన్న రకం అయితే పంట కాలం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే దొడ్డు రకం వేసిన. పైగా దొడ్డు రకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. అందుకే తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడి వచ్చే దొడ్డు రకం (1010) సాగు చేశా. సన్నాలకు బోనస్ ఉన్నా.. దిగుబడి తగ్గితే లాభం ఉండదని అనుకున్నం. – కొండమీది భిక్షపతి, కమలాపూర్, హనుమకొండ జిల్లా సాగు నిబంధనలు ఏమీ లేవు.. వరి విషయంలో రైతులు పలాన రకాలే సాగు చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా రైతులు తమకు నచి్చన వెరైటీలను వేసుకున్నారు. వ్యవసాయశాఖ తరఫున పంటల సాగుకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేశాం. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో దొడ్డురకాలే నయమన్న ధోరణితో చాలామంది అటువైపు మొగ్గు చూపినట్లు ఉంది. – కేతిరి దామోదర్‌రెడ్డి, ఏడీఏ, వరంగల్ జిల్లా -
విత్తనాల కోసం క్యూలైన్లో చెప్పులు
కమలాపూర్: కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం జీలుగ విత్తనాల కోసం రైతులు ఎగబడ్డారు. ఆలస్యమైతే దొరుకుతాయో లేదోనని ఎండకు నిల్చోలేక తమ చెప్పులను క్యూలైన్లో ఉంచారు. మండలానికి ఇటీవల 500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయి. కమలాపూర్ పీఏసీఎస్‌లో 400 క్వింటాళ్లు, అంబాలలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 100 క్వింటాళ్ల చొప్పున తరలించి మంగళవారం నుంచి రైతులకు పంపిణీ చేశారు. విత్తనాల్ని పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు ఉదయం 7 గంటలకే పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులుదీరి ఎండ తీవ్రతను భరించలేక క్యూలైన్లో చెప్పులను ఉంచారు. విత్తన పంపిణీ సమయంలో రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచి ఎగబడడాన్ని గమనించిన అధికారులు క్యూలైన్లో రావాలని చెప్పడంతో మళ్లీ క్యూ కట్టారు. పోలీసు పహారాలో కమలాపూర్‌లో 250 క్వింటాళ్లు, అంబాలలో 100 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో సుమారు రూ.1,100 వరకు ఉన్నవి ప్రస్తుతం రూ.2,140కి పెరిగినా రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఎగబడుతుండడం గమనార్హం. -
సీఐ వెంకటరత్నంపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్స్పెక్టర్ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల్లో భయం.. భయం వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్‌కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్‌పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబు ల్‌పై వేటు వేయడం కమిషనరేట్‌లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ సస్పెండ్ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్లో మరణించిన వ్యక్తి పేరు నమోదు సమగ్ర వివరాలతో కథనం ప్రచురించిన ‘సాక్షి’ మర్డర్ కేసులోని నిందితురాలిపై మిల్స్‌కాలనీ సీఐ లైంగిక వేధింపులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు అవినీతి అధికారుల్లో భయం.. భయం లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు.. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్‌తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్‌కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్‌ప్రీత్‌సింగ్.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు తరుణ్‌తేజ
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన విద్యార్థి అట్ల తరుణ్‌తేజ ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అలాగే ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో అఖిలభారత స్థాయిలో 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్‌తేజ ఐఐటీ ముంబాయి నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశారు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషివిద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం మండల స్థాయిలో ఐదు రోజులపాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణను హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లోని డీపీఎస్ స్కూల్లో ప్రారంభించి ఆమె మాట్లాడారు. తెలుగు, ఆంగ్ల, గణితం సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ఐదు రోజులపాటు రిసోర్స్పర్సన్లు ఇస్తున్న శిక్షణ వినియోగించుకుని ఇందులో నేర్చుకున్న అంశాలతో విద్యను బోధించాలన్నారు. శిక్షణలో హనుమకొండ ఎంఈఓ జి.నెహ్రూ, రిసోర్స్పర్సన్లు శ్రీపాల్‌రెడ్డి, ఎం.శ్రీధర్, పృధ్వీరాజ్, శివకోటి, అశోక్, ఎ.శ్రీధర్, మధు, జ్యోతి, రాజ్‌కుమార్, మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. ప్రతీ రోజు రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 33 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 12,063 మంది, సెకండియర్‌లో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌బీఐఈ.సీజీజీ. గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
పార్టీని బలోపేతం చేయండి
హసన్‌పర్తి: ‘రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో ముందుకు వెళ్తోంది.. ప్రచారంలో మాత్రం మనమంతా వెనుకబడి ఉన్నాం’ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలే ఇందుకు కారణమన్నారు. గోపాలపురంలోని ఓ బాంక్వెట్ హాల్లో మంగళవారం హసన్‌పర్తి, ఐనవోలుతో పాటు 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ ఇగో వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని.. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆయా పదవులకు పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, గడ్డం శివరాం, కార్పొరేటర్లు సునీల్‌కుమార్, జక్కుల రజిత, అరుణకుమారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకోవాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో వివిధ బ్యాంకులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం, అందించిన రుణాలు, చేరాల్సిన లక్ష్యాల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంప్రదింపుల కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పురోభివృద్ధి సాధించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలన్నారు. అలాగే దామెర మండలానికి సంబంధించిన బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవికుమార్, ఆర్బీఐ అధికారి తానియా, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మురళీధర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ బ్యాంకుల, శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనూ... ● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు. ● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్‌గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై వేటుతో చర్చ గతంలోనూ భూవివాదాల్లో కొందరు అధికారులు సస్పెండ్, అటాచ్డ్లతో ఉన్నతాధికారుల చర్యలు -
లండన్‌లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్‌లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్‌దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్‌లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజీ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేశ్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
సీఐ వెంకటరత్నంపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్స్పెక్టర్ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు.. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్‌కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్‌పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబు ల్‌పై వేటు వేయడం కమిషనరేట్‌లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ సస్పెండ్ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్లో మరణించిన వ్యక్తి పేరు నమోదు సమగ్ర వివరాలతో కథనం ప్రచురించిన ‘సాక్షి’ మర్డర్ కేసులోని నిందితురాలిపై మిల్స్‌కాలనీ సీఐ లైంగిక వేధింపులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు అవినీతి అధికారుల్లో భయం.. భయం లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు.. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్‌తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్‌కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్‌ప్రీత్‌సింగ్.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. -
కోళ్లఫాం పనులు నిలిపివేయాలి
దుగ్గొండి: తమ ఆరోగ్యాలకు పెను ప్రమాదంగా మారే కోళ్లఫాంను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనిచ్చేది లేదని తొగర్రాయి గ్రామస్తులు శపథం చేశారు. గ్రామ సమీపంలో ఉన్న పౌల్ట్రీఫాంలో నూతనంగా మరో భారీ కోళ్లఫాం నిర్మాణం కోసం సదరు వ్యాపారవేత్త ముగ్గు పోసి పిల్లర్ గుంతలు తీయించాడు. దీంతో గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున మంగళవారం పౌల్ట్రీపాంలోకి వెళ్లి పిల్లర్ గుంతలను పూడ్చి వేశారు. అక్కడే ఉన్న పొక్లెయిన్‌ను బయటికి పంపించారు. ఇసుక, కంకర, సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చిన ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడారు. గ్రామ సమీపంలో కోళ్లఫాం నుంచి వెలువడే దుర్వాసనతో ఇప్పటికే వ్యాధుల బారినపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ విస్తరిస్తే ఇంకా ఎక్కువ వాసనతో తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులు ఆపకుంటే ఎంతటి పోరాటాలకై నా సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాస చేరాలు, యార శ్రీనివాస్, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఎస్సీ కాలనీవాసులు పాల్గొన్నారు. -
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనూ... ● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు. ● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్‌గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై వేటుతో చర్చ గతంలోనూ భూవివాదాల్లో కొందరు అధికారులు సస్పెండ్, అటాచ్డ్తో ఉన్నతాధికారుల చర్యలు -
లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి
నల్లబెల్లి: గొట్టపు పురుగుల నివారణ కోసం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మండలంలోని రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను విరివిగా వినియోగించాలని రైతులకు సూచించారు. రసంపీల్చు పురుగుల ఉధృతి నివారించడానికి ఎర పంటలను వేసుకోవాలని కోరారు. శాస్త్రవేత్త యశస్విని మాట్లాడుతూ తృణ ధాన్యాలు, అపరాలు పండించాలని రైతులకు సూచించారుఎ. అనంతరం నల్లబెల్లి రైతువేదికలో నిర్వహించిన ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తన డీలర్ల సమావేశంలో నర్సంపేట వ్యవసాయ సంచాలకులు కె.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలు సబ్సిడీపై త్వరలోనే రానున్నాయని వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు విక్రయించినప్పుడు రైతులకు కచ్చితంగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ఈఓపీఎస్ మిషన్లతోనే విక్రయాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఓ రజిత, ఏఈఓ శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్, పంచాయతీ కార్యదర్శి రామారావు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ రంగాపురంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం -
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ కార్యవర్గం
గీసుకొండ: టీఎన్జీవోస్ అ నుబంధ అంగన్వాడీ టీచ ర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నికలు మంగళవారం వరంగల్ నగరంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలిగా గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లకు చెందిన మేక అని తాకుమారి ఎన్నికయ్యారు. సహ అధ్యక్షురాలి గా కె.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా కుంట లలి త,టి.శోభారాణి, ఎన్.రమ, కార్యదర్శిగా వి.భవాని, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ రమ, సీహెచ్ సునీత, ఎం.స్వరూప, ఆర్గనైజింగ్ కా ర్యదర్శులుగా రాణి, బి.సునీత, ప్రచార కార్యదర్శులుగా బి.భవాని,కె.ఉమాదేవి,కోశాధికారి గా పి.హైమావతి, కార్యవర్గ సభ్యులుగా ఆర్. ఎస్తేర, రాజసులోచన, ఎండీ నస్రీన్ ఎన్నికై న ట్లు ప్రకటించారు. కాగా, నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి సదా నందం అభినందించారు. అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పాకాలలో రేపు నేచర్వాక్ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఈనెల 22న నేచర్‌వాక్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఔల్స్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీశాఖ సహకారంతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు సమావేశం, 6.30 గంటలకు నేచర్‌వాక్, 10.15 గంటలకు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంపై అవగాహన సదస్సు, 11 గంటలకు బటర్ ఫ్లైగార్డెన్ సందర్శన, 11.30 గంటలకు బోటింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రకృతి, వనప్రేమికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగేశ్వర్రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతినర్సంపేట: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..చెన్నారావుపేట గ్రామానికి చెందిన మర్రి రాములు(65) సైకిల్‌పై మంగళవారం ఉదయం రోజు మాదిరిగానే పాల బాటి ల్ ఇవ్వడానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ప్రధాన సెంటర్ వద్దకు వచ్చి తన ఇంటి వైపు వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. నర్సంపేట నుంచి నెక్కొండ వైపు వెళ్తున్న టాటాఏస్ వా హనం వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు,కూతురు ఉన్నారు.మృతుడి కుమారు డు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహా న్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు..గీసుకొండ: ధర్మారం–స్తంభంపల్లి మార్గంలోని కోళ్లఫాం దగ్గర ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన చిట్టిమల్ల మనోహర్ (71) మంగళవారం కోళ్లఫాం దగ్గర చనిపోయి ఉన్నాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు చేయగా అనుమాన్పాద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. -
స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలి
న్యూశాయంపేట: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. డీపీఆర్ఓ ఆధ్వర్యంలో కళాబృందాలతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పీసీపీ ఎన్టీడీ యాక్ట్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకోర్టు చీఫ్ ఏఓ కోట్ల రాధాదేవి మాట్లాడుతూ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని శిక్షించడానికి కోర్టులు సహకరిస్తాయని తెలిపారు. డీసీపీ అంకిత్‌కుమార్ సంకాల్వే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మామునూరు ఏసీపీ తిరుపతి, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, పీపీ సంతోషి, ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సీఐ వెంకన్న, ఎన్జీఓ ప్రతినిధి పరశురాములు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధంసమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరి గింది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచార కేసుల పరిహారం చెల్లింపు, ఇతర సమస్యలపై కలెక్టర్ సత్యశారద సమీక్షించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ కార్పొరేషన్ అఽభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓలు ఉమారాణి, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, రవీందర్‌రెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి, కమిటీ సభ్యులు బిర్రు మహేందర్, మహంకాళి యాదగిరి, పాలకుర్తి విజయ్‌కుమార్, భూక్యా హుస్సేన్‌నాయక్ పాల్గొన్నారు. రక్తనిధి నిర్మాణానికి హామీగవర్నర్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు (రక్తనిధి) నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వం, సొసైటీ ఎన్నికల నిర్వహణ, రక్తనిధి కేంద్రం నిర్మాణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సభ్యత్వం, యూత్ రెడ్‌క్రాస్, జూనియర్ రెడ్‌క్రాస్ కార్యకలాపాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
లండన్‌లో చదువుకున్నా.. మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్‌లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డెపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
ఘనంగా తిరంగా యాత్ర
హన్మకొండ: ఆపరేషన్ సిందూర్ విజయంతో సైన్యానికి సంఘీభావంగా తిరంగా యాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు భారత్ సరైన జవాబు చెప్పిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు కాకతీయ వారసుడి రాక
హన్మకొండ: కాకతీయ 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మంగళవారం వరంగల్ పర్యటనకు వస్తున్నారని టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కోర్సు పీహెచ్డీ తరగతుల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్డీ కోర్సు వర్క్‌లో భాగంగా క్యాంపస్‌లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగం అధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్పీ.రాజ్‌కుమార్ ఉన్నారు. జీఎంహెచ్‌లో ప్రత్యేక విభాగంహన్మకొండ చౌరస్తా/ఎంజీఎం: గర్బిణుల నమోదు, ప్రసవాల శాతం పెంచేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, జీఎంహెచ్ సిబ్బంది వైద్యులకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేక సెల్ ఉంటుందని చెప్పారు. అందుకు ముగ్గురు మహిళా పబ్లిక్ హెల్త్ అధికారులను డిప్యుటేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ గర్భిణికి మొదటి రెండు చెకప్‌లు పీహెచ్సీ డాక్టర్ వద్ద, మూడు, నాలుగు చెకప్‌లకు హనుమకొండలోని జీఎంహెచ్ తప్పనిసరి వచ్చేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, పీహెచ్ఎన్లు లీల, సుందరి, హెచ్ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 23న జాబ్ మేళా హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అట్రాసిటి కేసు విచారణ అధికారిగా ఏసీపీ తిరుపతిఖిలా వరంగల్ : వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‌పై ఆదివారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచారయత్నం కేసు విచారణ అధికారిగా మామునూరు ఏసీపీ తిరుపతిని నియమిస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును సమగ్రంగా, పాదర్శకంగా విచారించాలని ఆదేశించారు. ‘భద్రకాళి’ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాన తన కుటుంబ సమేతంగా అమ్మవారిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని మేడ్చ ల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వేయిస్తంభాల ఆలయంలో.. వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. -
‘పీఎం కుసుం’పై విచారణ
చెల్లించిన ఈఎండీలు 162లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీ జారీ 141 ముందుకు రాని రైతులు 520 మందిఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 682సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ఇంటిలిజెన్స్ వివరాల సేకరణ ● 100కు పైగా ప్రశ్నలతో దరఖాస్తుదారుల వద్దకు.. ● అంతర్యమేమిటని సందేహిస్తున్న రైతులు ● భారీ పెట్టుబడి కావడంతో పథకంపై పలువురి అనాసక్తి -
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
● సమగ్ర శిక్ష రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజీవ్కమలాపూర్: విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 15 రోజులుగా జిల్లాలోని 9 కేజీబీవీలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థినులు వేసవి శిబిరంలో పాల్గొని స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ మ్యా థ్స్, క్రాఫ్ట్, పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, గేమ్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ మేర కు సోమవారం నిర్వహించిన వేసవి శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి శిబిరంలో నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థుల కు నేర్పించడంతో పాటు భవిష్యత్‌లో మరింత నైపుణ్యం సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన క్రాఫ్ట్ మెటీరియల్‌తో పాటు సంగీతం, నృత్య ప్రదర్శనలకు తిలకించారు. ముగింపు సమావేశంలో జిల్లా జీసీఈఓ సునీత, ఎంఈఓ కె.శ్రీధర్, శిబిరం సమన్వయకర్త అర్చన, పలు కేజీబీవీల ఎస్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు వృత్తిపరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రాన్ని రాజీవ్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం వెంకటేశ్వర్రావు, కోర్సు కోఆర్డినేటర్ చలమల నాగేశ్వర్రావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన వినతులను ఆయా శాఖ అధికారులు త్వరగా ప రిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వి విధ సమస్యలపై మొత్తం 86 వినతులు వచ్చినట్లు చెప్పారు. వాటిని ఆయా శాఖ అధికారులకు కే టాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పరకాల ఆర్డీఓ నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు ప్రావీణ్య -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
వివరాల సేకరణ ఇలా..
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రైతుకు ఆర్థిక స్థోమత ఉందా? డెవలప్మెంట్కు ఇచ్చారా..? రైతు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాడా..? భారీ పెట్టుబడి కావడంతో రైతుల వెనుక ఎవరైనా ఉన్నారా..? రైతులకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేంద పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది..? డెవలప్మెంట్కు ఇస్తే ఏ విధానంలో ఇచ్చారు..? రైతుకు ఎంత భూమి ఉంది.. ఎన్ని మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.. ఈ భూమి పంటకు అనుకూలమా కాదా.. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారా.. రైతు వాటాగా భరించే స్థాయి ఉందా.. ఉంటే ఆ సొమ్ము ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు.. పెట్టుబడి వచ్చే మార్గాలు ఏమిటీ.. తదితర వివరాలు అడుగుతున్నారని రైతులు తెలిపారు. -
బయో గ్యాస్ ప్లాంట్‌కు చొరవ తీసుకోవాలి
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్‌గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్‌ను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి -
– సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్
కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం. సరిపడేంత స్థలం లేని మెట్లు. కనిపించని వెంటిలేషన్. ఇదీ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్‌తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్‌లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి. గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమా దం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్బౌళి, మండిబజార్, పోచమ్మమైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహల్, గోపాలస్వామి గుడి, ఎల్బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్‌కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాల కు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మేల్కొనాల్సిందే.. భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనా లు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది. నిబంధనలు పాటిస్తేనే.. నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనా లు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్య ల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం జరిగినా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాల కు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కావా లి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)యథేచ్ఛగా అనుమతులు.. బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికై నా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా మాల్లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటిలేషన్ లేకుండా నిర్మించిన భవనాలు అనేకం అగ్ని ప్రమాదం జరిగితే పొగతో ఉక్కిరిబిక్కిరే.. నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగిస్తే మంచిది హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనతోనైనా మేల్కొనాలిసంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి2022 68 28,30,55,000 2,94,15,000 2023 67 2,04,21,000 8,07,70,000 2024 63 4,05,62,250 26,54,40,000 2025 50 51,43,000 1,87,63,000 -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
న్యూశాయంపేట/విద్యారణ్యపురి: ఇంటర్, పదోతరగతి సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 28 వరకు ఇంటర్ సప్లమెంటరీ, జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించే పదోతరగతి పరీక్షలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో 16 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 5,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనునున్నట్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్ స్క్వాడ్, సీఎస్డీఓలను 16మంది చొప్పున నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ శ్రీధర్ సుమన్, డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తి న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే 163–జి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయ్యిందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. హైవేలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం నెక్కొండ, పత్తిపాక, వెంకటాపూర్, ఆలంఖాన్‌పేట, చంద్రుగొండ, తోపనపల్లి, అప్పలరావుపేట, గ్రామాల రైతులతో సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఆర్డీఓ ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ హైవే టీం లీడర్ సంపత్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు పాటిస్తే బిల్లులు చెల్లిస్తాం..దుగ్గొండి: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు మంజూరైన వారు నిబంధనల మేరకు వేగంగా ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు చెల్లిస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని రేకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సోమవారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇంటిని నిర్మించుకుంటున్న రంపీస అశ్విని, రంపీస కళావతితో మాట్లాడారు. బేస్మెంట్కు రూ. లక్ష, రూఫ్ లెవెల్‌కు రూ.లక్ష చెల్లించి నిర్మాణం పూర్తి చేశాక మిగతావి చెల్లించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, హౌసింగ్ పీడీ గణపతి, డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
ఇరుకు గల్లీలు.. చిన్న మెట్లు
గ్రేటర్ వరంగల్‌లోని గల్లీల్లో వేలాది భవనాలు.. అగ్గి రాజుకుంటే అంతే సంగతి! కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం.. సరిపడేంత స్థలం లేని మెట్లు.. కనిపించని వెంటిలేషన్.. ఇది ఆదివారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్‌తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్‌లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి. – సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్ యథేచ్ఛగా అనుమతులు.. బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికైనా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా మాల్లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్బౌళి, మండిబజార్, పోచమ్మ మైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహేల్, గోపాల స్వామి గుడి, ఎల్బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్‌కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాలకు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మేల్కోవాలి.. భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది. నిబంధనలు పాటిస్తేనే.. నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్యల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీ ప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాలకు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కావాలి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)సంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి2022 68 28,30,55,000 2,94,15,000 2023 67 2,04,21,000 8,07,70,000 2024 63 4,05,62,250 26,54,40,000 2025 50 51,43,000 1,87,63,000 వెంటిలేషన్ లేకుండా నిర్మించిన భవనాలు అనేకం అగ్ని ప్రమాదం జరిగితే పొగతో ఉక్కిరిబిక్కిరే.. నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగిస్తే మంచిది హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనతోనైనా మేల్కొనాలి -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
సబ్‌స్టేషన్.. రైతులకు ఉపయోగం
రాయపర్తి: సబ్‌స్టేషన్ నిర్మాణం చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతగానో ఉపయోగమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని జగన్నాథపల్లిలో సుమారు రూ.2.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు అధికారులు, మండల నాయకుడు నంగునూరి అశోక్, శారద దంపతులు, ప్రజలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్‌స్టేషన్ మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ గుగులోతు కిషన్‌నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, విద్యుత్ ఏఈ రవళి, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
అర్జీలను వెంటనే పరిష్కరించండి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణిలో మొత్తం 128 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూ 54, హౌసింగ్ మున్సిపాలిటీ 7, మిగతా శాఖలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తాగునీటి సమస్య తదితర అంశాలపై యంత్రాంగం నిబద్ధతతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, వరంగల్ తహసీల్దార్ ఎక్బాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్టేషనరీ షాపు ఇప్పించండి.. నర్సంపేటలోని నర్సింగ్ కళాశాల ఆవరణలో స్టేషనరీ, జిరాక్స్ షాప్ పెట్టుకుని జీవించేందుకు అనుమతి ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నా. – దివ్యాంగుడు సుమన్, కొత్తపేట, ఏనుమాముల కలెక్టర్ సత్యశారద గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ -
బయో గ్యాస్ ప్లాంట్‌కు చొరవ తీసుకోవాలి
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్‌గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్‌ను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీసీలో పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి -
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు వృత్తిపరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా శిక్షణ కేంద్రాన్ని రాజీవ్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం వెంకటేశ్వర్రావు, కోర్సు కో–ఆర్డినేటర్ చలమల నాగేశ్వర్రావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. రైలు కింద పడి ఒకరి మృతినెక్కొండ: మండలంలోని రెడ్లవాడకు చెందిన కర్నెకంటి మహేశ్(19) నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి సోమవారం మృతి చెందాడు. వరంగల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్ తల్లిదండ్రులు ఐలయ్య–పద్మ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. మహేశ్ హైదరాబాద్‌లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. కాగా.. మృతుడి తాత యాదగిరి మూడు రోజుల క్రితం మృతి చెందగా.. ఐలయ్య కుటుంబం రెడ్లవాడకు వచ్చింది. ఉదయం హైదరాబాద్‌కు వెళ్లేందుకు వచ్చి పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్ తల పగిలి, కాళ్లు, చేతులు విరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సుదర్శన్ తెలిపారు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముగిసిన వేసవి శిక్షణ శిబిరంగీసుకొండ: మండలంలోని వంచనగిరిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వివిధ అంశాల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వేసవి శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. ఈముగింపు కార్యక్రమానికి డీఈఓ జ్ఞానేశ్వర్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలు వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. శిక్షణ శిబిరంలో జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీఓ ఫ్లారెన్సా, పాఠశాల ప్రత్యేకాధికారి హిమబిందు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. సైన్స్ కోర్సు, పీహెచ్డీ తరగతుల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్డీ కోర్సు వర్క్‌లో భాగంగా క్యాంపస్‌లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగాధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్పీ.రాజ్‌కుమార్ ఉన్నారు. 23న జాబ్ మేళా హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో శుక్రవారం ఉదయం ములుగు రోడ్డు ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
కానిస్టేబుల్‌కు అభినందనలు
రామన్నపేట: వృత్తి ధర్మంలో భాగంగా మానవత్వం చాటుకున్న ఓ కానిస్టేబు ల్ మంచి మనస్సును ప్రజలు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దుస్తులు కూడా సరిగ్గా లేక ఎండవేడి తట్టుకోలేక పడిపోగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కల్యాణ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాధిత వ్యక్తికి దుస్తులు తెప్పించి తొడిగి 108 వాహనాన్ని పిలిపించి ఎంజీఎం ఆస్పత్రికి వైద్యం కోసం తరలించాడు. ఇదంతా గమనించిన స్థానికులు సదరు కానిస్టేబుల్ స్పందించి సహాయం చేసిన తీరుకు అభినందనలు తెలిపారు. -
మారిన యూనిఫామ్ డిజైన్లు
విద్యారణ్యపురి/వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లోని వి ద్యార్థులకు(2025–26) విద్యాసంవత్సరం అందిందే స్కూల్ యూనిఫామ్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. తరగతుల వారీగా బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించేందుకు ఇప్పటికే హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళ సంఘా ల సమాఖ్యలకు క్లాత్‌ను మండలాల వారీగా పాఠశాలల స్థాయిలో అందజేశారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించి టీఎల్‌ఎఫ్‌లకు అప్పగించారు. క్లాత్‌ను టిస్కో పంపిణీ చేసింది. ఈసారి స్టి చింగ్ డిజైన్‌లో మార్పులను గమనిస్తే.. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్ ఫ్రాక్‌లకు పట్టీలు, భుజాలపై క ప్స్ వంటి ప్యాచ్‌లు లేకుండా కుట్టిస్తున్నారు. స్టిచ్చింగ్ సరళంగా ఉండేందుకు స్వల్పమార్పులు చేశారు. తరగతుల వారీగా యూనిఫామ్ ఇలా.. ఒకటి నుంచి 5వ తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12వ తరగతి వరకు బాలురకు చొక్కా, పాయింట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్‌ఫ్రాక్, 4, 5 తరగతుల బాలికలకు షర్టు, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్ మోడల్లో ఉండేలా టాప్ బాటమ్ చున్నీ లేకుండా కుట్టిస్తున్నారు. ఈసారి వేసవి సెలవులకు ముందే యూనిఫాం కుట్టించేందుకు కొలతలు కూడా తీసుకున్నారు. దుస్తులు హెచ్చు తగ్గులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఒకే జతకు క్లాత్రాక యూనిఫాం స్టిచ్చింగ్ కోసం ముందుగా ఒకే జత కోసం క్లాత్‌ను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఈనెల 31 వరకు స్టిచ్చింగ్ పూర్తి చేసి అందజేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో 314 పీఎస్‌లు, 72 యూపీఎస్‌లు, 147 హైస్కూళ్లు, 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్ఎస్, 25 వరకు ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 30,922 మంది ఉండగా ఇందులో బాలురు 14,852, బాలికలు 16,070 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి రెండుజతల చొప్పున స్కూ ల్ యూనిఫామ్ అందజేస్తున్నారు. ఈసారి తొలుత ఒక జత పంపిణీ చేసేందుకు స్టిచ్చింగ్ చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్ల లకు అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రెండో జతకు క్లాత్వచ్చే అవకాశం ఉంటుంది.స్వల్పమార్పులతో స్టిచ్చింగ్ ప్రస్తుతానికి ఒకే జతకు క్లాత్ రాక కుట్టుపనికి 31వ తేదీ వరకు డెడ్‌లైన్ జిల్లాలో 30,922 మంది విద్యార్థులు రూ.75తో గిట్టుబాటు కాని కూలి.. ప్రభుత్వం ఒక జత యూనిఫామ్ స్టిచ్చింగ్కు రూ.75 చొప్పున చెల్లిస్తోంది. గతంలో ఒక్కో జతకు రూ.50 చొప్పున చెల్లించగా గత ఏడాది నుంచి రూ.25 పెంచారు. ఇందులో కుట్టు కూలికి రూ.50, కటింగ్, బటన్స్, కాజాలు, ఎంఎస్ సర్వీస్ చార్జ్ రూ.25 కలిపి రూ.75 ఇస్తున్నారు. బయట టైలర్లు ఒక్కో జత కుట్టడానికి రూ.300 నుంచి రూ.400 తీసుకుంటుండగా ప్రభుత్వం రూ.75 నిర్ణయించడంతో గిట్టుబాటు కావడం లేదని మహిళా సమాఖ్య సభ్యులు పేర్కొంటున్నారు. యూనిఫాంకు కనీసం రూ.150 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేయూ క్యాంపస్: తెలంగాణలో క్రీడా రంగాభివృద్ధి కి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుమారు డు నాయిని విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని యూనివర్సి టీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నాయిని టీ–10 లీగ్ సీజన్–2 క్రికెట్ పోటీలు ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2015లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో విశాల్‌రెడ్డి మరణించడంతో ఆయన జ్ఞాపకాలను రాజేందర్‌రెడ్డి విశాల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం -
విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలి
విద్యారణ్యపురి: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఎయిడ్స్, హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి వరకు కొవ్వొత్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్‌తో మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రజల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఎవరైతే హెచ్ఐవీతో జీవిస్తున్నారో వారికి సంఘీభావంగా ఉండేందుకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, పరకాలలోని సీఎస్సీ ఐసీటీసీ సెంటర్లుగా పని చేస్తున్నాయన్నారు. 2024–25లో 55,000ల మందిని పరీక్షించగా.. 100 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణఽ సంస్థ మేనేజర్ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, ఐసీటీసీ కౌన్సిలర్లు రాపర్త సురేశ్, రాజేందర్, సంపూర్ణ, సురక్ష కేంద్ర బృందం ఇక్బాల్, భాషా ల్యాబ్ టెక్నిషియన్లు, కరుణ మైప్రాజిటివ్ నెట్వర్క్ రవీందర్, మారి, విజయ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఽఖ అధికారి అప్పయ్య -
బాల్య వివాహం అడ్డగింత
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధి లోని న్యూశాయంపేట ప్రాంతంలో ఆదివారం ఓ కల్యాణ మండపంలో బాలికకు వివాహం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివా హం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీ యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేష న్ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూ రి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ పర్చువల్గా ప్రారంభించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్‌గౌడ్, బన్న ప్రభాకర్, ఎరుకుల రఘనారెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, గోకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. వంకాయ రైతు ఆగ్రహంపరకాల: ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలను పరకాల మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచిని పర్తి గ్రామానికి చెందిన రైతు సదయ్య వంకా యలను ఆదివారం అమ్మకానికి తెచ్చాడు. అయితే ఉదయం కిలో రూ.25 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు.. కాస్త ఆలస్యంగా వచ్చిన సదయ్య వద్ద కిలో రూ.10 చొప్పున కొంటామని చెప్పడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. మార్కెట్లో కిలో రూ.60 అమ్ముతుండగా.. వ్యాపారులు రైతుల నుంచి రూ.10కి కొంటామని చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతు మీరిచ్చే ధర కనీసం కూలీలకు కూడా సరిపోదని మండిపడుతూ మార్కెట్లో ఉన్న పశువుల మేతకు వంకాయలను పారబోశాడు. -
డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్‌కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్లు సంతకాలు చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్ -
రాష్ట్రస్థాయి పోటీలకు మొండ్రాయి విద్యార్థులు
సంగెం: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ పోటీలకు మొండ్రాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.విజయ, పీడీ ముఖర్జీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 30న ఓ సిటీలో వరంగల్ జిల్లాస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ పోటీల్లో విద్యార్థులు పి.ప్రణయ్వర్ధన్, డి.వర్షిత్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల కు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి 21వ వరకు మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరుగనున్న 11వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎస్ఎంసీ చైర్పర్సన్ శ్రీలత, పాఠశాల హెచ్ఎం విజయ, పీడీ ముఖర్జీ, ఉపాధ్యాయులు అభినందించారు. కల్లెడలో జామాయిల్ తోట దగ్ధం పర్వతగిరి: కల్లెడ గ్రామ శివారులోని కరిమిళ్ల సోమేశ్వరరావు, ఎన్నమనేని మోహన్‌రావుకు చెందిన జామాయిల్ తోట నిప్పంటుకొని ఆదివారం దగ్ధమైంది. జామాయిల్ తోట పక్కన ఉన్న పొలంలో రైతు వరి కొయ్యలను అంటు పెట్టాడు. దీంతో పక్కన ఉన్న జామాయిల్ తోటకు మంటలు వ్యాపించడంతో దగ్ధమైంది. 15 ఎకరాల్లో 12 ఎకరాల జామాయిల్ తోట పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.30 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. రేపటి నుంచి పీజీ కోర్సుల పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్( నాన్ ప్రొఫెషనల్ )రెగ్యులర్, ఎక్స్,ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సౌజన్య ఆదివారం తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాకతీయ యూని వర్సిటీలో పరిధిలో పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,300 మంది పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు. డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్‌కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అత్యాధునిక వసతులతో రైల్వేస్టేషన్
ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేషన్‌ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూరి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి గంట రవికుమార్ సందర్శించారు. ఈసందర్భంగా రూ.25.41 కోట్ల తో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పర్చువల్గా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు. రూ.25.41 కోట్లతో అభివృద్ధి పనులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ -
రైతుపై పోలీసుల జులుం!
వర్ధన్నపేట: వ్యవసాయ భూమిలో మట్టిని చదును చేస్తుండగా రైతును పోలీసులు బెదిరించిన సంఘటన ఆదివారం వర్ధన్నపేటలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన గాదె వెంకటయ్యకు శివాలయం వీధి సమీపంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వరదతో ఈ భూమి కోతకు గురైంది. ఆ భూమిలోని మట్టిని కోతకు గురైన చోటుకు తరలించడానికి జేసీబీ, ట్రాక్టర్లను అద్దెకు తీసుకొచ్చాడు. ఎలాంటి అనుమతి లేకుండా మట్టి, మొరాన్ని తరలిస్తున్నావని పోలీసులు వచ్చి రైతును బెదిరించారు. మట్టి, మొరాన్ని బయటకు తరలిస్తే నేరం అవుతుందని, తన పొలంలోని మట్టితో చదును చేసుకుంటుంటే ఎలా నేరం అవుతుందని సదరు రైతు ప్రశ్నించడంతో కంగుతిన్న పోలీసులు చేసేదేమి లేక వెనుదిరిగారు. రైతును బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు పోలీసులు ఇలా చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఎస్సై రాజును వివరణ కోరగా చెరువు నుంచి మట్టి, మొరం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించాను. పొలంలోని మట్టితోనే రైతు చదును చేసుకుంటున్నట్లు గమనించారు. కానిస్టేబుళ్లు ఎవరిని బెదిరించలేదని పేర్కొన్నారు. వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా బెదిరింపులు -
దాహం.. దాహం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025– 8లోuనర్సంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా తాగునీటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా నర్సంపేట పట్టణంలో 40 శాతం మంది ప్రజలకు కూడా స్వచ్ఛమైన నీరు అందడం లేదు. అదనపు నిధులు కేటాయించి పనులు చేయాలంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దీంతో ప్రతీ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య జఠిలంగానే మారుతోంది. నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇటీవల అదనంగా మరికొన్ని గ్రామాలు విలీనమయ్యాయి. 55 వేల నుంచి 60 వేలకు జనాభా పెరిగింది. ప్రతీ రోజు నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో సరైన ప్రణాళికలు లేక 40 శాతం ప్రజలకు రంగు నీరే సరఫరా అవుతోంది. పట్టణ శివారు కాలనీల ప్రజలు ఇప్పటికీ చేదబావుల నుంచి నీటిని తోడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందంటే అభివృద్ధిపై అధికారుల అలసత్వం కనిపిస్తోంది. ప్రతిరోజూ నీరందాలంటే.. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన ప్రతిరోజూ నీరందాలంటే అశోక్‌నగర్ గ్రామ శివారులోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టు సమస్యలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని ప్రతిపాదనలను సిద్ధం చేయించి ఉన్నతాధికారులకు పంపించారు. అయినప్పటికీ ఈ వేసవి కాలంలో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. అభివృద్ధి పనుల్లో ఆలస్యం.. తాగునీరు అందించేందుకు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 నుంచి రూ.30 కోట్ల నిధులతో సర్వాపురంలో చేపట్టిన ట్యాంకు నిర్మాణ పనులు 40 శాతమే పూర్తికావడంతో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. శాంతినగర్‌లో చేపట్టిన మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణ పనులది కూడా అదే పరిస్థితి. మరో రెండు నెలల్లో ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు. న్యూస్‌రీల్ గొంతు తడపని మిషన్ భగీరథ నర్సంపేటలో రెండు రోజులకోసారి నీటి సరఫరా వేసవిలో పట్టణ ప్రజలకు తప్పని తిప్పలు డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు డీలా.. నత్తనడకన అమృత్ పనులుపల్లెల్లోనూ ఇదే పరిస్థితి.. గ్రామపంచాయతీల పరిధిలో కూడా తాగునీటి సమస్య ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. నిధుల కొరత ఉండడంతో పంచాయతీల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామపంచాయతీ శివారులోని నర్సింగాపురం గ్రామంలో ఆదివారం మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. సీడీఎఫ్ నిధులతో వేసిన బోరును కేసింగ్ సరిగా వేయకపోవడంతో మూడు నెలలకే కూలిపోయింది. అధికారులు బోరును మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.శాశ్వత పరిష్కారం చూపాలిమిషన్ భగీరథ పైపులైన్ నీరు ప్రధాన రోడ్ల వెంట కొంత వరకే సరఫరా అవుతోంది. కాలనీ చివరి వరకు తక్కువ నీరే వస్తోంది. ప్రతీ వేసవిలో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. పేదల దాహం తీర్చేందుకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందించాలి. – జన్ను జమున, మార్క్స్ కాలనీ నర్సంపేట సమస్య పరిష్కారం కావడం లేదు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా మల్లంపల్లి రోడ్డులోని కాలనీల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నీరు కాలనీకి రావడం లేదు. ప్రజలు చేదబావి ద్వారానే ఇప్పటికీ నీటిని తోడుకొని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. – వంగల రాగసుధ, గాంధీనగర్ నర్సంపేట -
క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేయూ క్యాంపస్: తెలంగాణలో క్రీడా రంగాభివృద్ధి కి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుమారుడు నాయిని విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నాయిని టీ–10 లీగ్ సీజన్ –2 క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2015లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో విశాల్‌రెడ్డి మరణించడంతో విశాల్ జ్ఞాపకాలను రాజేందర్‌రెడ్డి తన మనసులో ఉంచుకుని విశాల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. విశాల్ ఆత్మకు శాంతిచేకూరేలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారన్నారు. విశాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం -
హేమాచలుడి సన్నిధిలో భక్తుల రద్దీ
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) ముగిసినా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఆదివారం సైతం యథావిధిగానే కొనసాగింది. ఈనెల 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం వసంతోత్సవంతో ముగిసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు రాలేకపోయిన వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు ప్రతి ఆదివారం ఆలయంలో నిర్వహించే స్వామివారి తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని సంతానం ప్రాప్తి కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. హనుమాన్ మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్‌కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట ఆలయ పూజారులు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, డీసీ ఎంలలో కుటుంబ సబ్యులతో వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లోని ఽదైత(వనదేవత) ప్రాగణం, చెట్ల కింద వంటలు చేసుకుని సాయంత్రం వర కు స్వామివారి సన్నిధిలో సంతోషంగా గడిపారు. 20న హుండీల్లోని కానుకల లెక్కింపు మల్లూరులోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 10 రోజులపాటు నిర్వహించిన స్వామి వారి బ్రహ్మోత్సవాలు(జాతర) ముగిశాయి. దీంతో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కిపు ఈనెల 20న కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
నర్సంపేట/సంగెం/నెక్కొండ: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నారావుపేట మండల కేంద్రం, మగ్ధుంపురం, పాపయ్యపేట, సంగెం మండలం కాపులకనిపర్తి, నెక్కొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండాలని, కొనుగోళ్లను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించి వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను వెంటనే ఖాళీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్.. మిల్లులోని రికార్డులు, ధాన్యం తేమ యంత్రాలు, బియ్యం పరిశీలించారు. ధాన్యం వివరాలు, మిల్లు కెపాసిటీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, నర్సంపేట, సంగెం, నెక్కొండ తహసీల్దార్లు ఫణికుమార్, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఉర్సుకు రావాలని సీఎంకు ఆహ్వానం
దామెర: ఒగ్లాపూర్ సమీపంలోని సైలానిబాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్ షామియా,ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రె డ్డితో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఆహ్వా న పత్రం అందజేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా పీఠాధిపతి సీఎంకు దట్టి కట్టారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న సైలాని బాబా గంధం ఉత్సావాలకు రావాలని సీఎంను కోరా రు.మహ్మద్ అహమ్మద్ తదితరులు ఉన్నారు. కేయూ ఎంబీఏ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ సందర్శించి, పరిశీలించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి.దూర విద్యాకేంద్రంలోని పరీక్షల కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం సందర్శించి, పరిశీలించారు. ఆయన వెంట దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ, వై.వెంకయ్య, సీతారాం ఉన్నారు. ప్రొఫెసర్లుగా పదోన్నతివిద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. సంస్కృత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇ.కృష్ణయ్య, పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ కళాశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆయా ప్రొఫెసర్లను కేడీసీ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవికుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీనాథ్, పరీక్షల నియంత్రణాధికారి శివనాగ శ్రీను, అధ్యాపకులు పాల్గొన్నారు. వరంగల్ డీసీసీబీకి ‘ఐఎస్ఓ’హన్మకొండ: వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న సేవలకు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ (ఐఎస్ఓ) సర్టిఫికెట్ జారీ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కార్యాలయంలో టెస్కాబ్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ తమ పాలకవర్గం, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తూ బ్యాంకు అభివృద్ధితో పాటు, వ్యవసాయ, రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కూలిన పాఠశాల ప్రహరీకమలాపూర్: మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అకాల వర్షం కురవడంతో పలు గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం స్వల్పంగా తడిసిపోయింది. అలాగే మండల కేంద్రంలోని టాకీస్ ఏరియా ప్రాథమిక పాఠశాల ప్రహరీ అకాల వర్షంతో కూలిపోయింది. మండల వ్యాప్తంగా 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
రారండోయ్ సర్కారు బడికి..!
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపుదలే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాటను జూన్ 6నుంచి 19వతేదీ వరకు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ బడిబాట ద్వారా చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉపాధ్యాయులు బడిబయట ఉన్న, బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ 6నుంచి ఉపాధ్యాయులు తప్పనిసరిగా తాము పనిచేస్తున్న ప్రాంతం పరిధిలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు ఇలా.. ● 6వ తేదీన గ్రామసభను నిర్వహించాల్సి ఉంటుంది. ● 7న ఇంటింటికి సందర్శంచి బడిఈడు పిల్లలను గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుంది. ● 8నుంచి 10వ తేదీవరకు ● జిల్లాల్లోని ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల పరిధిలో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించాలి. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి డ్రాపౌట్ పిల్లలను కూడా గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటే వారిని అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాల్సింటుంది. ● 11న అప్పటివరకు నిర్వహించిన బడిబాటపై సమీక్షించుకోవాలి. ● 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, స్కూల్ యూనిఫామ్స్ కూడా అందించాల్సి ఉంటుంది. ● 13న జిల్లాల్లో సామూహిక అక్షరాభ్యాసం బాలల సభను నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం నిర్వహించాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవాన్ని చేపట్టాలి. ● 18న తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి, మొక్కల పెంపకం, ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పొటీలు నిర్వహించాలి. జూన్ 6నుంచి 19వ తేదీవరకు బడిబాట షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు విద్యార్థుల నమోదు పెంపుదలే లక్ష్యం సమష్టిగా ముందుకెళ్లాలంటున్న విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 41 పాఠశాలల్లో విద్యార్థులు అసలే లేరు. వీటిలో విద్యార్థులను చేర్పించుకునేలా కృషిచేయాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాలి. – ఇటీవల సమన్వయ సమావేశంలో హనుమకొండ డీఈఓ డి.వాసంతిజిల్లాల వారీగా పాఠశాలలు.. జిల్లా పీఎస్‌లు యూపీఎస్‌లు హైస్కూళ్లు హనుమకొండ 314 72 147వరంగల్ 321 68 123 -
ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల సర్వేకు నిధులు
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు 2025–26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో కేటాయింపు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఏ ప్రాజెక్టుకు ఎంత అంటే.. ● పెండ్యాల–హసన్‌పర్తి బైపాస్‌లైన్ పైనల్ లొకేష న్ సర్వేకు రూ.64 లక్షలు, డోర్నకల్–మణుగూర్ డబ్లింగ్ 104కి.మీ థర్డ్‌లైన్ సర్వే కోసం రూ.2.08 కోట్లు, సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడో లైన్ సర్వేకు రూ.1.56 కోట్లు కేటాయించారు. ● సికింద్రాబాద్–కాజీపేట వరకు 85,48 కి.మీ డబ్లింగ్ లైన్ సర్వే కోసం రూ.1.71 కోట్లు, కాజీ పేట–విజయవాడ క్వార్డర్ అఫ్లింగ్ 220 కి.మీ సర్వేకు రూ.4.40 కోట్లు, కాజీపేట–బల్లార్షా క్వార్డర్ అప్ లింగ్ 234 కి.మీ సర్వేకు రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ క్వార్డర్ అఫ్లింగ్ 120 కి.మీ రూ.2.40 కోట్లు, భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) కొత్తలైన్ 64 కి.మీ ఫైనల్ సర్వేకు రూ.1.60 కోట్లు ఇచ్చారు. ● ఘన్పూర్–రఘునాథపల్లి 17,2 కి .మీ మూడో, నాలుగో లైన్ సర్వేకు రూ.0.34 లక్షలు, మణుగూరు–రామగుండం కొత్త లైన్ సర్వేకు రూ.5 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య 21.25 కి.మీ మూడో రైల్వే లైన్ సర్వేకు రూ.43 లక్షలు కేటాయింపులు చేశారు. ● వరంగల్ స్టేషన్ సమీపంలో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) మంజూరుకు రూ.10 లక్షలు, కాజీపేట–వరంగల్ రూట్లో బైపాస్లైన్లో రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్)కు రూ. 75లక్షలు, డోర్నకల్‌లో 15 కి.మీ. ఆర్వోఆర్ సర్వేకు రూ.30 లక్షలు మంజూరు చేశారు. ● సికింద్రాబాద్–కాజీపేట మధ్య ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 134 కి.మీ మూడో లైన్ సర్వేకు రూ.52 లక్షలు, బల్లార్షా–కాజీపేట ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ 234 కి.మీ బల్లార్షా–కాజీపేట మధ్య నాలుగో లైన్ సర్వేకు రూ.1.17 కోట్లు, కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్ 219 కి.మీ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ రూ.1.10 కోట్లు నిధులు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ● కాజీపేట రైల్వే వ్యాగన్ షెడ్‌కు సంబంఽధించిన ఈ ఏడాది కావాల్సిన నిధులు కన్సాలిడేటెడ్ బడ్జెట్ కేటాయింపుల్లో పేర్కొనలేదని అధికారులు పేర్కొన్నారు. 2025–26 కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో స్పష్టత -
గుణాత్మక విద్యపై దృష్టి సారించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు గుణాత్మక విద్య పై దృష్టి సారించాలని హనుమకొండ డీఈఓ వా సంతి సూచించారు. ఐదు రోజులుగా హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూ ల్లో నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణ కార్యక్రమం శనివా రం ముగిసింది. ఈ సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్లకు, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ కె.శ్రీని వాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, స్కిల్ స్టార్క్ విద్యాసంస్థల అధినేత అనుపురావు,రవికుమార్,రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. సమావేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఇన్స్పెక్టర్ వెంకన్న, పోక్సో చట్టం, ఉమెన్ ట్రా ఫికింగ్ పై షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత, డ్రగ్ అడిక్షన్ పై ఏసీ పీ సైదులు,సైబర్ క్రైమ్ గురించి సంబంధిత అధికా రి శివకుమార్ ఉపాధ్యాయులకు వివరించారు. అభ్యసన సామర్థ్యాలు పెంచాలి : వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధించాలని వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ ఉపాధ్యాయులను కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు నగరంలో ఐదు రోజులుగా నిర్వహిస్తుస్తున్న శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌తో పాటు కె.మల్లారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వరంగల్ నార్కొటిక్ డీసీపీ సైదులు మాట్లాడారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, నాగేశ్వర్రావు, సెంటర్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి -
‘జల్ హీ అమృత్’కు నిధులు మంజూరు
వరంగల్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ హీ అమృత్ 2.0 పథకం స్టార్ రేటింగ్ ర్యాంకింగ్‌తో వరంగల్ నగరానికి రూ.3కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా చేపడుతున్న జల్ హీ పథకం లక్ష్యాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 15 ఎంఎల్డీల ఎస్టీపీలలో ఓసీఈఎంఎస్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు 70 కిలో వాట్స్ ఉత్పతి చేసే యూనిట్‌కు 15 ఎంఎల్డీ ప్లాంటులో మురికి నీటిని శుద్ధీకరించేందుకు ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, మాధవిలత, సంతోష్ బాబు, పీఎంసీ ఆనంద్ పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్, కౌన్సిల్ హాల్ పూర్తి చేయండి స్విమ్మింగ్ పూల్, కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. క్షేత్ర స్థా యిలో జరుగుతున్న పనులను మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి తనిఖీ చేశారు. తని ఖీల్లో అడిషనల్ కమిషనర్ జోనా, ఈఈలు, డీఈ కార్తీక్ రెడ్డి, ఏఈలు శ్రీకాంత్, నరేష్ పాల్గొన్నారు. సమీక్షలో మేయర్ సుధారాణి -
భక్తులను క్షేమంగా చేరవేయాలి
● ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులను క్షేమంగా తరలించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను సూచించారు. శనివారం హనుమకొండ బస్ స్టేషన్లో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ ఎలా ఉందని, డ్రైవర్లు వడదెబ్బకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శనివారం వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 230 బస్సులలో 15 వేల మంది సరస్వతి పుష్కరాలకు తరలివెళ్లినట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భాను కిరణ్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో సిద్ధం
ఏళ్ల నాటి కల.. నెరవేరుతున్న వేళ ● అన్ని వసతులతో రూపుదిద్దుకున్న వరంగల్ రైల్వేస్టేషన్ ● అమృత్ భారత్ రూ.25కోట్ల నిధులతో ఆధునికీకరణ ● 22వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ ● రైల్వేస్టేషన్‌ను సందర్శించిన జీఎం అరుణ్‌కుమార్ జైన్ -
రైతులకు అన్యాయం చేయొద్దు
ఖానాపురం: సొంత నిర్ణయాలతో మిల్లర్లు రైతులకు అన్యాయం చేయొద్దని జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, శ్రీనివాస రైస్‌మిల్లును శనివారం వారు తనిఖీ చేశారు. మిల్లు వద్దకు లారీలు ఎప్పుడు వచ్చాయి, దిగుమతి ఎలా చేస్తున్నారు, రైతులు, మిల్లర్ల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ధాన్యం దిగుమతుల్లో ఆలస్యం చేసి, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 93,070 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 18,716 మంది రైతుల ఖాతాల్లో రూ.105 కోట్ల నిధులు జమచేసినట్లు పేర్కొన్నారు. సన్నవడ్ల బోనస్ ఇప్పటి వరకు పడలేదని, ప్రభుత్వానికి పంపుతున్నట్లు వివరించారు. మిల్లర్లు కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోలర్ రాజయ్య, సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి, సొసైటీ సిబ్బంది మేరుగు రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఏఓ శ్రీనివాస్ మిల్లును తనిఖీ చేసి సూచనలు చేశారు. డీసీఓ నీరజ, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, జిల్లా అధికారి కిష్టయ్య ఖానాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, శ్రీనివాస రైస్‌మిల్లు తనిఖీ -
సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేయాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట రూరల్: సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. గురిజాల గ్రామ రైతువేదికలో శనివారం జరిగిన శ్రీరైతు ముగింట్లో శాస్త్రవేత్తలుశ్రీ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులతో మనకు కావాల్సిన ఆహార ధాన్యాలను పండించుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు వాడడం భూములకు మంచిదికాదన్నారు. అనంతరం రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందించారు. ఆదర్శ రైతులు కరుణాకర్, రామారావు, రవీందర్‌రెడ్డిని ఎమ్మెల్యే మాధవరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఏఓ కృష్ణకుమార్, ఏఈఓలు అశోక్, శ్యాం, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రాంపురంలో కుంట కట్ట ధ్వంసం
గీసుకొండ: మండలంలోని రాంపురం రామయ్యకుంట కట్టను కొందరు శనివారం ధ్వంసం చేసి అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నం వివాదానికి దారితీసింది. కట్టతోపాటు చెట్లను తొలగించి చదును చేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన బండారు నరేందర్, శ్రీనివాస్ కుంట కట్ట భూమిని చదును చేసి అమ్ముకుందామనే ప్రయత్నాలు చేయడంతో రైతులు తహసీల్దార్ రియాజుద్దీన్, ఐబీ ఏఈ విజయలక్ష్మికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆకట్ట పైనుంచి తాము పంటచేలకు వెళ్లే దారి ఉందని, అలాగే కట్టను తొలగిస్తే కింది భూములు ముంపునకు గురవుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 750 సంవత్సరాల నుంచి ఉన్న కుంట కట్టను ఎలాంటి హక్కులు లేని వారు తొలగించారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించిన తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ మాట్లాడుతూ కుంట కట్టను తొలగించడం చట్ట ప్రకారం నేరమన్నారు. కట్టను తొలగించిన వారిపై ఐబీ ఏఈ.. గీసుకొండ సీఐ మహేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విలేకరులు సీఐని వివరణ కోరగా విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతు రడం భరత్ మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుంచి ఉన్న కుంట కట్టను తొలగించడం సరికాదని, కట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు తహసీల్దార్, ఏఈ, సీఐకి ఫిర్యాదు -
కార్పొరేట్‌కు దీటుగా..
నెక్కొండ: కార్పొరేట్, ప్రైవేట్‌కు దీటుగా విద్యనదించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లు, కళాశాలల (ఆదర్శ పాఠశాలలు/కళాశాలలు)ను ఏర్పాటు చేసింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, నిపుణులైన అధ్యాపకులు ఉండడంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. 6 నుంచి 10వ తరగతితోపాటు ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తుడడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఆదర్శ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ప్రతీ గ్రూపులో 40 సీట్లు.. జిల్లాలో మొత్తం 6 (నెక్కొండ, సంగెం, చెన్నారావుపేట, ఖానాపురం, పర్వతగిరి, గీసుకొండ) మోడల్ స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. ప్రతీ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి. ప్రతీ గ్రూపులో 40 సీట్లు ఉన్నాయి. కళాశాలల్లో బాలికలకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అందుకు కనీసం మూడు కిలోమీటర్లు లేదా ఆపై దూరం ఉండేవారు మాత్రమే అర్హులని అధికారులు పేర్కొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ ఇలా.. ● జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు హెచ్‌టీటీపీ://183.82.97.97/ఎంఎస్టీజీలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. ● 22న దరఖాస్తుల పరిశీలనతోపాటు ఎంపికై న వారి జాబితాను సిద్ధం చేయనున్నారు. ● రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా 26న ఎంపికై న వారి జాబితాను ప్రదర్శిస్తారు. ● 27 నుంచి 31వ వరకు విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ● ప్రతి గ్రూపులో 40 సీట్ల చొప్పున నాలుగు గ్రూపుల్లో 160 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ● పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అల్పాదాయ వర్గాల వారికి ప్రాధాన్యమిస్తారు. మోడల్ స్కూళ్లు, కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలకు ఈనెల 20వ తేదీ గడువుఉత్తమ ఫలితాలు సాధించాం..మోడల్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నేను ఇంటర్ ఎంపీసీలో 974 మార్కులు సాఽ దించాను. మా కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించి ఉత్తమ ఫలితాలు సాధించాం. – మౌనిక, విద్యార్థిని, నెక్కొండ మోడల్ స్కూల్ కార్పొరేట్ తరహాలోనే.. మోడల్ స్కూల్, కళాశాలలో కార్పొరేట్, ప్రైవేట్‌కు దీటుగా తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా సంసిద్ధులను చేస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఇంటర్ చదివేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ ప్రణయ్‌కుమార్, మోడల్ స్కూల్, ప్రిన్సిపాల్ నెక్కొండ -
‘న్యాక్’కు సిద్ధం కావాలి
కేయూ క్యాంపస్: నూతన గ్రేడింగ్ సిస్టంకు అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు న్యాక్‌కు సిద్ధం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.షమిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (సీఆర్ఐఎస్పీ) స్వచ్ఛంద సంస్థ వారి సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎక్స్‌లెన్స్ (చెక్)లో భాగంగా ఓయూ, ఎస్‌యూతో కేయూ అవగా హన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఐక్యూఏసీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 22 కళాశాలల ప్రతి నిధులతోను వీసీ మాట్లాడారు. మారుతున్న సూచనలకు అనుగుణంగా కళాశాలలు డేటా బేస్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్‌లో వస్తున్న మార్పులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, అకడమిక్ మెంటార్ డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ అచ్యుతాదేవి, సీఆర్ఐఎస్పీ స్టేట్ లీడ్ డాక్టర్ కె.రమ, ఆచార్య లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ షురూవిద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి డీఈఓ వాసంతి శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు కాజీపేట మండలానికి 24,972 పాఠ్యపుస్తకాలు, కమలాపూర్ మండలానికి 15,932 పాఠ్యపుస్తకాలు అందించారు. ఆయా మండల విద్యాశాఖాఽధికారులు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల ద్వారా పంపిణీ చేశారు. మిగిలిన మండలాలకు కూడా షెడ్యూల్ ప్రకారం చేరవేస్తారు. మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు చేరాక అక్కడి నుంచి హెచ్ఎంలు తమ పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు అందజేస్తారు. హోటళ్లకు రూ.62 వేల జరిమానా వరంగల్ అర్బన్: హనుమకొండలోని పలు హోటళ్లలో బల్దియా ప్రజారోగ్య విభాగం సిబ్బంది శుక్రవారం తనిఖీలు చేశారు. అపరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని గుర్తించి రూ.62 వేల జరిమానా విధించి వసూలు చేసినట్లు సీఎంహెచ్ఓ రాజారెడ్డి తెలిపారు. 51వ డివిజన్ ఎకై ్సజ్ కాలనీలోని నాటుకోడి చిట్టి గారెలు హోటల్‌కు రూ.30 వేలు, ట్రేడ్ లైసెన్్స్ లేకుండా నిర్వహిస్తున్న హంటర్ రోడ్డులోని కడాయి రెస్టారెంట్‌కు రూ.30 వేలు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వెంకటసాయి కిరాణా షాపు యజమానికి రూ.2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బంది అనిల్‌కుమార్, సంపత్‌రెడ్డి, నిరంజన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి హన్మకొండ: వరంగల్ అర్బన్ సహకార బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి సూచించారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని వరంగల్ అర్బన్ సహకార బ్యాంకులో శుక్రవారం జరిగిన బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సభ్యుడు సామాజిక బాధ్యతతో సహకార బ్యాంకు అభివద్ధికి తోడ్పడాలన్నారు. ప్రతి సభ్యుడు పొదుపుతోపాటు వాటాదనం చెల్లించడం ద్వారా బ్యాంకు పరపతి పెరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్, బ్యాంకు మేనేజర్ సురేందర్‌రెడ్డి, హనుమకొండ బ్యాంకు మేనేజర్ ప్రసాద్, గోపాలపురం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసరావు, కృష్ణవేణి, సంధ్యారాణి, బ్యాంకు వాటాదారులు, సభ్యులు పాల్గొన్నారు. -
మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!
పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయని కామెంట్ ● ఇదీ కమీషన్ల సర్కారు అని మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ● కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి సురేఖ ● గత బీఆర్ఎస్ మంత్రులనుద్దేశించి అన్నానని స్పష్టతసాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని లేపాయి. ‘మంత్రుల వద్దకు క్లియరెన్స్ కోసం కొన్ని ఫైల్స్ వస్తాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని వాటిని క్లియరెన్్స్ చేస్తుంటారు. మేం మాత్రం మాకు నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం’ అని ఆమె వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం జరిగిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెకు థాంక్స్ అని చెప్పి, మొత్తానికి కొండా సురేఖ నిజాలు బయటపెట్టారని, కాంగ్రెస్ కమీషన్ సర్కారు నడుపుతోందని ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో మరోసారి ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ‘వరంగల్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనిచేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను మాట్లాడినా. అవి అక్షర సత్యం కూడా. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనుక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్‌ను కావాలనే హైలెట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇది’ అని ఆమె మీడియాతో మాట్లాడి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.గతంలోనూ పలు వివాదాలు.. గతంలోనూ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసి పరువు నష్టం దావాలు మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. గతేడాది దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలైన వివాదంలో ముగ్గురు కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేయగా.. మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం అప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వేములవాడ రాజన్న కోడెల విషయంలోనూ మంత్రి అనుచరుడికి అప్పనంగా కట్టబెట్టారని గీసుకొండ ఠాణాలో కేసు నమోదు కావడం కూడా గతేడాది డిసెంబర్లో వివాదమైంది. తాజాగా మంత్రులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయ్యాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
మండలాల వారీగా సాగు విస్తీర్ణం అంచనా వివరాలు (ఎకరాల్లో).. మండలం వరి మక్కజొన్న పత్తి ఆయిల్ సీడ్స్ పప్పు దినుసులు భీమదేవరపల్లి 19,100 148 1700 10 40 ధర్మసాగర్ 16,200 1200 4,000 80 270 ఎల్కతుర్తి 15,600 300 3,700 30 70 హనుమకొండ 1,100 ––– ––– –– ––– హసన్‌పర్తి 15,300 200 3,900 10 80 ఐనవోలు 11,600 800 13,600 –– 150 కమలాపూర్ 20,700 200 5,800 –– 60 కాజీపేట 6,400 200 1,300 –– 50 వేలేరు 11,500 1,700 4,300 –– 50 ఆత్మకూరు 5,400 100 9,800 10 60 దామెర 3,700 200 9,700 30 10 నడికూడ 7,300 100 7,600 10 50 పరకాల 4,500 –– 5,200 –– 20 శాయంపేట 8,400 400 7,400 10 30మండలాల వారీగా సాగు విస్తీర్ణం (ఎకరాల్లో), ఎరువుల అంచనా (మెట్రిక్ టన్నుల్లో) మండలం వ్యవసాయ ఉద్యాన యూరియా డీఏపీ ఎన్పీకే ఎంఓపీ విస్తీర్ణం విస్తీర్ణం బీమదేవరపల్లి 20,950 1,600 3,044 1,128 2,819 902 ధర్మసాగర్ 21,750 1,500 3,139 1,163 2,906 930 ఎల్కతుర్తి 19,700 950 2,788 1,033 2,581 826 హనుమకొండ 1,100 20 151 56 140 45 హసన్‌పర్తి 19,490 1,190 2,792 1,034 2,585 827 ఐనవోలు 26,150 1,500 3,733 1,383 3,456 1,106 కమలాపూర్ 26,760 950 3,741 1,386 3,464 1,108 కాజీపేట 7,950 840 1,187 440 1,099 352 వేలేరు 17,550 560 2,445 906 2,264 724 ఆత్మకూరు 15,370 950 2,203 816 2,040 653 దామెర 13,640 600 1,922 712 1,780 570 నడికూడ 15,060 2,950 2,431 901 2,251 720 పరకాల 9,720 1,790 1,554 576 1,439 460 శాయంపేట 16,240 1,600 2,408 892 2,230 714హన్మకొండ: హన్మకొండ జిల్లా సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ మేరకు వానాకాలంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు, విత్తనాలు, ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయనే అంచనాతో అధికారులు ప్రణాళిక రూపొందించారు. అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 2,31,323 ఎకరాలు కాగా ఈ వానాకాలంలో 2,31,320 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత వానాకాలంలో 2,36,691 ఎకరాలు, యాసంగిలో 1,50,660 ఎకరాల్లో సాగు చేశారు. అదేవిధంగా వానాకాలం వరి సాధారణ విస్తీర్ణం 1,46,753 ఎకరాలు కాగా.. ఈ వానాకాలంలో 1,46,800 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా. యాసంగిలో వరి 1,32,280 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి వానాకాలం సాగు సాధారణ విస్తీర్ణం 78,013 ఎకరాలు కాగా.. ఈ వానాకాలంలో 78 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత వానాకాలంలో 77,330 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5,437 ఎకరాలు కాగా.. ఈ సారి 5,400 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. నూనె గింజల సాధారణ విస్తీర్ణం 187 ఎకరాలు కాగా.. ఈ వానా కాలంలో 190 ఎకరాల్లో సాగు చేస్తారని, పప్పుదినుసుల సాధారణ విస్తీర్ణం 932 ఎకరాలు కాగా ఈసారి 930 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. వరి విత్తనాలు ఎకరాకు 25 కేజీల చొప్పున అధికారులు 36,700 క్వింటాళ్లు, మొక్కజొన్న విత్తనాలు ఎకరాకు 8 కిలోల చొప్పున 432 క్వింటాళ్లు, పత్తి ప్యాకెట్లు 1,95,000 అవసరని అధికారులు గుర్తించారు. ఆయిల్ సీడ్స్ విత్తనాలు 114 క్వింటాళ్లు, పప్పు దినుసుల విత్తనాలు 37 క్వింటాళ్లు అవసరం కానున్నాయి. అన్ని పంటలు కలిపి 2,31,320 లక్షల ఎకరాల్లో సాగు వరి 1,46,800, పత్తి 78 వేలు, మొక్కజొన్న 5,400 ఎకరాలు -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతోపాటు, పసుపు, కుంకుమ, చీర, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవతర్నమాల హారతి ఇచ్చారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట.. శుక్రవారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తరలివచ్చి న భక్తులతో గోదావరి తీరం, ఆలయం కిక్కిరిసింది. ఉదయం నుంచి 10 గంటల్లోపు భక్తులు పలు చగా ఉండగా, మధ్యాహ్నం వరకు రద్దీ పెరిగింది. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేట్ వాహనాల్లో భ క్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిట లాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్‌లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్ స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడి నుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీకెండ్లో పెరగనున్న భక్తుల తాకిడి.. శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. వీఐపీల రాక.. సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాం వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. – పుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు IIలోuపుష్కర స్నానంతో పొరపాట్లు పరిసమాప్తం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సరస్వతి నదిలో కుటుంబ సమేతంగా పుష్కరస్నానం సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు వీఐపీలు– వివరాలు IIలోu -
మాజీ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం
వేలేరు: తన భర్తపై ఎస్ఐ అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మండంలోని కమ్మరిపేట మాజీ సర్పంచ్ జోడుముంతల రమేశ్ భార్య రవళి శుక్రవారం నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ విషయంలో వేలేరు ఎస్సై తన భర్తపై అక్రమ కేసు పెట్టాడని, అప్పు ఇచ్చిన వ్యక్తికి డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా నిత్యం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సైతో తమకు ప్రాణహాని ఉందని, ఎస్సై వేధింపులు తట్టుకోలేకనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది. బాధితురాలు ప్రస్తుతం ముల్కనూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఎస్సై సురేశ్‌ను వివరణ కోరగా మాజీ సర్పంచ్ రమేశ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఆరు నెలల క్రితం ఆమె అత్తమామలు, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పిలిపించామని తెలిపారు. అప్పుడు అతడిని సదరు మహిళ కుటుంబ సభ్యులు కొట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుని కాపాడానని అన్నారు. అప్పులు ఇచ్చిన వారు ఫిర్యాదు చేస్తే పిలిచి మాట్లాడానే తప్ప వేధించలేదని తెలిపారు. శుక్రవారం రమేశ్ అతడి భార్య గొడవ పడినట్లు తన దృష్టికి వచ్చిందని, కావాలనే రమేశ్ తనపై ఆరోపణలు చేయిస్తున్నాడని అన్నారు. తన భర్తపై ఎస్ఐ అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నాడని ఆరోపణ ఎలాంటి వేధింపులు చేయడం లేదన్న ఎస్ఐ -
సైలానిబాబా ఉర్సును జయప్రదం చేయాలి
దామెర: సైలానిబాబా దర్గా ఉర్సును జయప్రదం చేయాలని ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ శుక్రవారం అన్నారు. ఓగ్లాపూర్ సమీపంలోని సైలానిబాబా దర్గాలో ఉర్సు ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన ఆర్డీఓ నారాయణ ఉత్సవాలు విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పరకాల ఏసీపీ సతీశ్‌బాబు మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహిహిస్తామని అన్నారు. జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్ షామియా (సైలాని బాబా) మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 23 వరకు ఉర్సు నిర్వహిస్తామని తెలిపారు. 21న రాత్రి గంధం కార్యక్రమం, 22న కళాకారుల ఖవ్వాలి, 23న తెహెల్ ఫాతియా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఉమ్మడి జిల్లాతోపాటు పలు రాష్ట్రాల నుంచి భారీగా హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం దర్గా పరిసర ప్రాంతాలు పరిశీలించి, ఉర్స వాల్‌పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓలు కల్పన, శ్రీనివాస్‌రెడ్డి, సీఐ సంతోష్, ఎస్సై అశోక్, మహ్మద్ రషీద్ బాబా, అమీర్‌బాబా, ఎస్కే మోయిన్సైలాని బాబా ఖాదిం పాల్గొన్నారు.పరకాల ఆర్టీఓ నారాయణ -
సాగు అధికమే..
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025– IIలోu● వానాకాలం పంటల సాగుపై అధికారుల అంచనా.. ● సన్నాలకు రూ.500 బోనస్‌తో పెరిగిన వరి సాగు ● రెండో ప్రధాన పంటగా పత్తి పంటసాక్షి, వరంగల్: D Hyé¨ Ðé¯éM>ÌS…ÌZ hÌêÏ-ÌZ Ð]lÅÐ]l-ÝëĶæ$ ç³…rÌS ÝëVýS$ ÑïÜ¢Æý‡~… ¿êÈV> ò³Æý‡$-VýS$-™èl$…§ýl° Ð]lÅÐ]l-ÝëĶæ$ A«¨M>Æý‡$-Ë$ ç³…rÌS {ç³×êãMýS¯]l$ QÆ>Æý‡$ ^ólÔ>Æý‡$. 2024ÌZ 2,74,152 GMýS-Æ>ÌZÏ ÑÑ«§ýl ç³…rË$ ÝëVýS$-M>V>.. D Hyé¨ 3,08,326 GMýS-Æ>ÌZÏ OÆð‡™èl$-Ë$ ç³…rË$ ç³…yìl-Ýë¢-Æý‡° VýS×ê…M>Ë$ Ñyýl$-§ýlÌS ^ólÔ>Æý‡$. D ÌñæMýSP¯]l HMýS…-V> 34,174 GMýS-Æ>ÌZÏ A§ýl-¯]l…-V> ç³…rÝëVýS$ M>¯]l$…¨. Ð]lÇ «§é¯]lÅ… çܯ]l²-Æý‡MýS… MìSÓ…sêMýS$ {糿¶æ$-™èlÓ… Æý‡*.500 »Z¯]l-‹Ü CÐ]lÓyýl… MýS*yé D Hyé¨ ç³…rÌS ÝëVýS$ ò³Æý‡-VýS-yé-°MìS M>Æý‡-׿…-V> ^ðlç³µ-Ð]l^èl$a. 2024ÌZ 1,30,720 GMýS-Æ>ÌZÏ Ð]lÇ ç³…yìlõÜ¢, DÝëÇ 1,43,803 GMýS-Æ>ÌZÏ ÝëVýS$ AÐ]l#-™èl$…§ýl° A«¨M>Æý‡$-Ë$ A…^èl-¯éÐól-Ô>Æý‡$. VýS™ól-yé¨ 1,20,166 GMýS-Æ>ÌZÏ ç³†¢ ÝëVýS$-M>V>.. DÝëÇ 1,26,173 GMýS-Æ>ÌS-™ø ÝëVýS$-^ól-õÜ Æð‡…yø A™èlÅ-«¨MýS ç³…rV> A…^èl-¯é ÐólÔ>Æý‡$. Ððl¬™èl¢…V> hÌêÏ-ÌZ 3,13,444 GMýS-Æ>ÌZÏ ç³…rË$ ÝëVýS$ M>¯]l$…yýl-V>, C…§ýl$MýS$ ĶæÊÇĶæ*, yîlHï³, C™èlÆý‡ M>…ò³ÏMŠSÞ GÆý‡$-Ð]l#-Ë$ MýSÍí³ Ððl¬™èl¢… 1,11,430 MìSÓ…sêâ¶æ$Ï AÐ]l-çÜÆý‡… E¯]l²r$Ï VýS$Ç¢…_¯]l A«¨M>Æý‡$-Ë$ 5,511 Ððl${sìæMŠS r¯]l$²ÌS GÆý‡$-Ð]l#-Ë$ A…§ýl$-»êr$-ÌZ E¯é²-Ķæ$° ^ðlº$™èl$-¯é²Æý‡$. నకిలీ విత్తనాల భయం ప్రస్తుతం వానాకాలం సాగు కోసం రైతులు తమ పంట పొలాలను దక్కి దున్నుకుంటున్నారు. సేంద్రియ ఎరువులు, విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. సకాలంలో వర్షాలు పడితే సాగు ఊపందుకోనుంది. ఇదే అదనుగా కొంతమంది దళారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధానంగా నకిలీ పత్తి విత్తనాలకు నకిలీ భయం పొంచిఉందనే చెప్పాలి. అయితే నకిలీ పత్తి విత్తనాలను నియంత్రించేందుకు వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే పలు చోట్ల నకిలీ విత్తనాలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లు అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. న్యూస్రీల్జిల్లాలో వివిధ పంటల సాగువివరాలు.. పంట ఎకరాలు ఎకరాలు విత్తనాలు (2024లో..) (2025లో..) (క్వింటాళ్లలో..) వరి 1,30,720 1,43,803 35,951 మొక్కజొన్న 763 9,820 982 పత్తి 1,20,166 1,26,173 2,52,346 కంది 1,074 1,180 95 మిర్చి 4,770 9,000 13.50 పసుపు 841 950 982 ఇతర పంటలు 15,818 17,400 50 2,74,152 3,08,326 29,0419.50ఎరువు మెట్రిక్ టన్నుల్లో.. యూరియా 47,000 డీఏపీ 16,805 ఎంఓపీ 14,270 ఎస్ఎస్పీ 6,615 ఎన్పీకే కాంప్లెక్స్ 26,740 1,11,430పంట మార్పిడి పాటించాలి.. జిల్లా వానాకాలం పంటల సాగుపై ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చు. డిమాండ్ ఉన్న ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టిసారించాలి. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి -
‘న్యాక్’కు సిద్ధం కావాలి
కేయూ క్యాంపస్: నూతన గ్రేడింగ్ సిస్టంకు అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు న్యాక్‌కు సిద్ధం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.షమిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (సీఆర్ఐఎస్పీ) స్వచ్ఛంద సంస్థ వారి సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎక్స్‌లెన్స్ (చెక్)లో భాగంగా ఓయూ, ఎస్‌యూతో కేయూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఐక్యూఏసీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 22 కళాశాలల ప్రతినిధులతోను వీసీ మాట్లాడారు. మారుతున్న సూచనలకు అనుగుణంగా కళాశాలలు డేటా బేస్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్‌లో వస్తున్న మార్పులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, అకడమిక్ మెంటార్ డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ అచ్యుతాదేవి, సీఆర్ఐఎస్పీ స్టేట్ లీడ్ డాక్టర్ కె.రమ, ఆచార్య లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు. వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు వరంగల్ అర్బన్: నగరంలో వీధి దీపాలు,సెంట్రల్ లైటింగ్ నిర్వహణ పక్కాగా కొనసాగాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లైటింగ్ నిర్వహణలో బ్లాక్స్పాట్ల గుర్తింపుతోపాటు అందుకు అవసరమైన సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఉన్న 83,750 వీధి దీపాలు వెలగాలని, విలీన గ్రామాల్లో అంధకారం లేకుండా పర్యవేక్షించాలన్నారు. నీటి సరఫరా తీరును సమీక్షించిన మేయర్.. ప్రతి ఇంటికి నీటి సరఫరా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టాలని పేర్కొన్నారు. నీరు అందని చివరి ఏరియాలు, నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్ బాబు, మాధవీలత, డీఈ కార్తీక్‌రెడ్డి, ఏఈ సరిత తదితరులు పాల్గొన్నారు. అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ ● అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డివర్ధన్నపేట : పట్టణ పరిధిలోని నీలగిరిస్వామి తండాకు చెందిన బానోతు రమణ అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ ఇచ్చాడని తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రమణ నివాసం వద్ద శుక్రవారం నిర్వహించిన సంస్మరణ సభలో ఉపేందర్‌రెడ్డి మాట్లాడారు. రమణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బ్రెయిన్ డెడ్ కాగా జీవన్ దాన్ వైద్యులు, సిబ్బంది సూచన మేరకు బాధిత కుటుంబీకులు రమణ అవయవదానానికి ముందుకొచ్చారని చెప్పారు. అవయవదానంపై సమాజంలోని ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకుని చైతన్యవంతం కావాలని కోరారు. రమణ తల్లిదండ్రులు బానోత్ విజయ దేవేందర్లను సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షురాలు మునగాల పద్మ, ప్రధాన కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఆర్ఎంపీ వైద్యుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కమలాపూర్: హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (కేఎల్బీ ఐఐహెచ్‌టీ) కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకుడు కె.జయరావు తెలిపారు. కేఎల్బీఐఐ హెచ్‌టీలోని డిప్లొమా కోర్సుల ఉపాధి అవకాశాలపై కమలాపూర్ చేనేత సహకార సంఘంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతోపాటు, పసుపు, కుంకుమ, చీరె, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్‌లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షెటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీఐపీల రాక.. రెండవ రోజు శుక్రవారం సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకారెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాంలు వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట..వీకెండ్స్‌లో పెరగనున్న భక్తుల తాకిడి..శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వీఐపీలుపుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు – IIలోu -
‘స్థానిక’ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
రాయపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కిష్టాపురం క్రాస్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌పార్టీ మండల స్థాయి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలాకాపాడుకుంటామని అన్నారు. ప్రతీ కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, రవిచంద్ర, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, తొర్రూరు బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యానాయక్, మండలపార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
న్యూశాయంపేట: ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లలో చేపట్టాలని జిల్లా అధికారులకు మంత్రులు సూచించారు. ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీపై శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్.చౌహాన్‌లతో కలిసి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ మహాయజ్ఞంలా చేపట్టినట్లు తెలిపారు. ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. సన్నబియ్యం పంపిణీపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 182 ధాన్యం కొనుగొలు కేంద్రాల్లో రెండు లక్షల మెట్రిక్‌టన్నుల వరిధాన్యం సేకరణ అంచనా వేయగా ఇప్పటి వరకు దాదాపు 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీసీలో డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
ఖానాపురం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్తోపాటు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద, పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులపాత్ర కీలకమైందన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టభద్రతలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు సాయిరమణ, రఘు, ఎస్సై రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ అంకిత్ -
మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని లేపాయి. ‘మంత్రుల వద్దకు క్లియరెన్‌న్స్ కోసం కొన్ని ఫైల్స్ వస్తాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని వాటిని క్లియరెన్‌న్స్ చేస్తుంటారు. మేం మాత్రం మాకు నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం’ అని ఆమె వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం జరిగిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెకు థ్యాంక్స్ అని చెప్పి, మొత్తానికి కొండా సురేఖ నిజాలు బయటపెట్టారని, కాంగ్రెస్ కమీషన్ సర్కార్ నడుపుతోందని ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో మరోసారి ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ‘వరంగల్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనిచేయడానికైనా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవార ని నేను మాట్లాడినా. అవి అక్షర సత్యం కూ డా. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనుక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్‌ను కావాలనే హైలెట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇది’ అని ఆమె మీడియాతో మాట్లాడి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. గతంలోనూ పలు వివాదాలు.. ● గతంలోనూ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసి పరువు నష్టం దావాలు మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు. ● గతేడాది దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలైన వివాదంలో ముగ్గురు కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేయగా.. మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం అప్పుడు సంచలనంగా మారింది. ● వేములవాడ రాజన్న కోడెల విషయంలోనూ మంత్రి అనుచరుడికి అప్పనంగా కట్టబెట్టారని గీసుకొండ ఠాణాలో కేసు నమోదు కావడం కూడా గతేడాది డిసెంబర్లో వివాదమైంది. ● తాజాగా మంత్రులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ అయ్యాయి. పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయని కామెంట్ ఇదీ కమీషన్ల సర్కార్ అని మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి సురేఖ గత బీఆర్ఎస్ మంత్రులనుద్దేశించి అన్నానని స్పష్టత -
పనిచేసిన వారికి ఎన్నికల్లో ప్రాధాన్యం
దుగ్గొండి/నల్లబెల్లి: కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, అధికారంలోకి రావడం కోసం నిత్యం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలలో ప్రాధాన్యత ఇస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలోని ఓ ఫంక్షన్హాల్లో, నల్లబెల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు అధికారంలో లేకున్నా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అర్హులయిన వారికి పథకాలు అందేలా కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అమీర్‌ఖాన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో నిబద్దత గల కాంగ్రెస్ నాయకుడిగా మాధవరెడ్డికి పేరుందన్నారు. నల్లబెల్లిలో నిర్వహించిన సమావేశంలో పార్టీ ఎన్నికల నామినేషన్ పత్రాలను కార్యకర్తలకు అందించారు. కార్యక్రమంలో పరిశీలకుడు రవిచంద్ర, కిసాన్ సెల్ జిల్లా బాధ్యుడు బొంపెల్లి దేవేందర్‌రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు రామానంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, శ్రీనివాసరెడ్డి, బాబు, తిరుపతిరెడ్డి, కిరణ్‌రెడ్డి, నర్సింగరా వు, రమేష్, రాజేశ్వర్‌రావు, శివాజి, భరత్‌రెడ్డి, రఘుపతిరావు, అశోక్, శేఖర్, జ్యోతి పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టాలి
ఎంజీఎం: డెంగీ నియంత్రణకు ప్రతిఒక్కరూ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు సూచించారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంజీఎం నర్సింగ్ కళాశాల నుంచి ఐఎంఏహాల్ వరకు నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం జంక్షన్లో మానవహారం నిర్వహించిన అనంతరం ఐఎంఏ హాల్లో నిర్వహించిన సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. ఈడీస్ దోమ పగటిపూట కుడితే డెంగీ వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధికారక దోమ నీటిలో వృద్ధి చెందుతుందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే 90 శాతం వ్యాధిని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి రక్త పరీక్షలు చేసి డెంగీ మరణాలను అరికట్ట వచ్చని వైద్యాధికారులు, సిబ్బందికి తెలిపారు. జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ అర్బన్ మలేరియా సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో డెంగీ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, కొమురయ్య, ప్రోగ్రాం ఆఫీసర్లు ఆచార్య పతి, అర్చన, విజయకుమార్, మెడికల్ ఆఫీసర్ యశస్విని, జిల్లా మలేరియా అధికారి రజిని, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్చార్జ్ ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, సబ్ యూ నిట్ ఆఫీసర్ నాగిరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు సదా నందం, రాజశేఖర్, నర్సమ్మ, మధుకర్, నర్సింగ్ కళాశాల ట్యూటర్ స్వర్ణలత, సీసీ నాగరాజు, వైద్య సిబ్బంది రాధాకృష్ణ, రత్నాకర్, కుమారస్వామి, చక్రపాణి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు -
‘సరస్వతి’ పునాదిగా పుష్కర వేడుకలు
కాళేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘సరస్వతి పుష్కరాలు పునాదిగా త్వరలో వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. మేడారం సమ్మక్క సారలక్క జాతరను ఘనంగా జరిపిస్తాం. తెలంగాణ ప్రభుత్వం నా హయాంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నదులను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని, అందుకే నదులను దేవతలు, దేవుళ్లుగా పూజిస్తున్నామని చెప్పారు. జేఎస్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ప్రారంభించిన సరస్వతి పుష్కర వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4.12 గంటలకు కాళేశ్వరం చేరుకున్న రేవంత్ రెడ్డికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ సరస్వతి ఘాట్‌ను ప్రజలకు అంకితం చేశారు. ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై నుంచి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన మాధవానంద సరస్వతిస్వామిజీ ప్రారంభించిన పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్లు మంథని నియోజకవర్గానికి పెద్ద చరిత్ర ఉందని, దేశ ఆర్థికాభివృద్ధికి ఆద్యుడైన పీవీ నరసింహారావు మంథని నుంచి గెలిపొందారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసిన ఆయన మంథని ప్రాంతానికి ఎంతో చేశారన్నారు. రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను తేవడంలో మంత్రి శ్రీధర్‌బాబు కృషి చాలా గొప్పదని కొనియాడారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడే శ్రీధర్ బాబును ప్రజలే కాపాడుకోవాలన్నారు. ఆయన సేవలు రాష్ట్రం యావత్తు అవసరమని, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తక్కువ సమయం కేటాయించి, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. కాళేశ్వరాన్ని గొప్పగా అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కావాలని శ్రీధర్‌బాబు అడిగారని, కానీ తాము రూ.200 కోట్లయినా వెచి్చస్తామని రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సురేఖ, ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌లను కోరుతున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి గ్రీన్ చానల్లో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. టెంట్ సిటీ వద్ద గంటసేపు.. హెలిప్యాడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీఐపీ ఘాట్ సమీపంలో భక్తులకోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీకి చేరుకున్నారు. రేవంత్ సుమారు గంటపాటు టెంట్ సిటీలో గడిపారు. పుష్కరాల ఏర్పాట్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పుష్కర ఘాట్ త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహం, రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం త్రివేణి సంగమంలో మంత్రులతో కలిసి పుష్కర పుణ్యస్నానం ఆచరించారు.తర్వాత శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, శుభానందదేవిని, ప్రౌడ సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం, మంత్రులు, వారణాసి నుంచి వచ్చిన అషుతోష్ పాండే, 8 మంది వేద పండితుల బృందం ఆధ్వర్యంలో మహా సరస్వతి నవరత్న మాలిక హారతి ఇచ్చారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎంపీని ఆహ్వనించలేదని నిరసన భూపాలపల్లి: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వనించలేదంటూ అతడి వర్గీయులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పుష్కర ఘాట్ వద్ద సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలోనే చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సభాస్థలి ఎదుట నిలబడి ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక నాయకుడిపై చేయి చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులు, మీడియా, వీఐపీలకు ఇబ్బందికరంగా మారింది. -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి శ్రీధర్‌బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
ఎల్కతుర్తి: వర్షాకాలానికి ముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య లబ్ధిదారులకు సూచించారు. మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, వీరనారాయణపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 95 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 35 ఇళ్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కొంతమంది లబ్ధిదారులకు మొదటి విడత నగదు ఇచ్చామని, ఆర్థిక సమస్యలు ఉన్నవారు సైతం త్వరగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అన్ని గ్రామాల్లో మంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయని, జిల్లాలో ఇప్పటి వరకు 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు రూ.150 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ అధికారి మహేందర్, డీసీఎస్ఓ కొమురయ్య, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఎంపీఓ రవిబాబు, ఏపీఎం రవీందర్ పాల్గొన్నారు. ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలి హసన్‌పర్తి: విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. భీమారంలోని స్కిల్ స్ట్రోక్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించారు. శిక్షణ గురించి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతిని అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన బోధనా పద్ధతులు, 21వ శతాబ్దపు శిక్షణతో బోధనలో మెళుకువలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం బైలింగ్వల్ ద్విభాష పాఠ్యపుస్తకాలు అందిస్తోందని ఆమె వివరించారు. తరగతి గది డిజిటలైజేషన్ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, నైతిక విలువలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుణాత్మక విద్య సమన్వయకులు శ్రీనివాస్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, సెంటర్ ఇన్‌చార్జ్‌లు, రిసోర్స్‌పర్సన్ తదితరులు పాల్గొన్నారు. సివిల్స్ ప్రిలిమినరీకి ఏర్పాట్లు విద్యారణ్యపురి: జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా పరిధిలో 4,141మంది అభ్యర్థులకు 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం మొదటి సెషన్ 9–30 నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అడ్మిట్ కార్డు, పెన్ను, పెన్సిల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 7 గంటల నుంచే నడుపుతారని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, డీఈఓ డివాసంతి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
ప్రతీకార దాడులకు పాల్పడొద్దు
● నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి నల్లబెల్లి: చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రతీకార దాడులకు పాల్పడితే ఎంతటివారైన చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామాన్ని నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల హత్యకు గురైన బానోత్ కొమ్మాలు కుటుంబ సభ్యులు విజయ, మోహన్, యశ్వంత్‌లను కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీకార దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్లో వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధినిర్వహణలో నిబద్దత కలిగి ఉండాలని సూచించారు. తహసీల్దార్ల బదిలీ సాక్షి, వరంగల్: జిల్లాలో గురువారం తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. నర్సంపేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న బి.రాజేష్‌ను హనుమకొండ జిల్లాకు, కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో పనిచేస్తున్న డి.మంజులను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల వేళ పరిపాలనపరమైన నిర్ణయాలతో ఇతర జిల్లాలకు బదిలీ అయిన కొందరు తహసీల్దార్లను వారి అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి కేటాయిస్తూ భూకార్యనిర్వాహక ముఖ్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలంటూ తహసీల్దార్లను ఆదేశించారు. -
కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు
వర్ధన్నపేట: కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట టౌన్, వర్ధన్నపేట, పర్వతగిరి, వరంగల్ 3, 14, 43 డివిజన్ల నా యకులతో పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశాన్ని గురువారం వర్ధన్నపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలి పించిన ప్రజలు, కార్యకర్తలను మరిచిపోనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పార్టీ పదవి అయినా, ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినా పార్టీకి ప్రజలకు సేవచేయాలని సూచించారు. 2017 ముందు నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి బ్లాక్ అధ్యక్షులు, మండల, వార్డు, గ్రామ అధ్యక్షులుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ అబ్జర్వర్ అమర్ అలీఖాన్, మేడి రవిచంద్ర, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ వెంకటయ్య, నాయకులు సత్యనారాయణ, దేవేందర్‌రావు, రాజిరెడ్డి, అనిల్‌రావు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాగరాజు -
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
ఖిలా వరంగల్: శిక్షణ శిబిరాల ద్వారా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి కొండా సురేఖ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో మాట్లాడా రు. విద్యాధానం ఎంతో గొప్పదని, ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయుల మాటలు విద్యార్థులను ప్రభావితం చేస్తాయన్నారు. విద్యార్థులకు వారికి స్థాయికి అనుగుణంగా ఆసక్తిని పెంపొందించే విధంగా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని తెలిపారు. కేవలం చదువుమాత్రమే కాకుండా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ జ్ఞానేశ్వర్, సుజన్ తేజ, నాగేశ్వర్రావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ -
డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించండి
వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో ఉన్న 350 ప్రధాన డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజా రోగ్య విభాగం, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో గురువారం వేర్వేరుగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఆమె మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొలగించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలని కోరారు. అనధికార లేఅవుట్లు గుర్తించాలని, ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేయాలని సూచించారు. ఇప్పటివరకు 30,500 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో రూ.130.50 కోట్ల ఆదాయం బల్దియాకు సమకూరిందని వివరించారు. ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఏసీపీలు రజిత, ఖలీల్, శ్రీనివాస్ రెడ్డి, ఏర్షాద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీను పాల్గొన్నారు. అమృత్ పనుల పురోగతిపై వర్చువల్ మీటింగ్ అమృత్ పనుల పురోగతి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూడీఎఫ్ఐ) ప్రతిపాదనలపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ టీకే శ్రీదేవి మున్సిపల్ అధికారులు, అర్బన్ ప్లానర్లతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో మేయర్ గుండు సుధారాణి -
వడదెబ్బతో ఇద్దరి మృతి
గీసుకొండ: మండలంలోని గంగదేవిపల్లి, కొమ్మాల గ్రామాలకు చెందిన ఇద్దరు కూలీలు వడదెబ్బతో వేర్వేరుగా మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గంగదేవిపల్లిలో వ్యవసాయ కూలీ ఇట్ట నాగరాజు(35) 15రోజుల నుంచి పసుపు ఉడకబెట్టే పనులు చేస్తున్నాడు. గురువారం వడదెబ్బతో ఇంటి వద్దనే మంచంలో కూర్చుని స్పృహ కోల్పోయి మృతి చెందాడు. అలాగే కొమ్మాలలో ఈర్ల సారయ్య(68)అనే గృహనిర్మాణ కూలీ ఎండలో పనులు చేసి వడదెబ్బతో బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
నర్సంపేట: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సివిల్ సప్లయ్, ఐకేపీ, కో ఆపరేటివ్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్లపై చర్యలు తప్పవన్నారు. సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు పంపించాలని సూచించారు. జిల్లాలో మిగతా ప్రాంతాల్లో ధాన్యం సేకరణ దాదాపు పూర్తయినందున నర్సంపేట నియోజకవర్గంపై అధికారులు పూర్తిగా శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సివిల్ సప్లయ్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యదేవి, డీసీఓ నీరజ, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
అరచేతిలో ‘మేరీ పంచాయత్’
సాక్షి, వరంగల్: పంచాయతీ ఎన్నికల వేళ.. ‘మేరీ పంచాయత్’ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా గ్రామంలో చేపట్టిన.. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను 2019లోనే రూపొందించినా సాంకేతిక సమస్యలతో ప్రజలకు కొన్ని వివరాలను అందించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అన్ని గ్రామాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌తో ఒక ఊరికి వచ్చే ఆదాయ, వ్యయాల విషయాలన్నీ తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లాలోని 323 పంచాయతీల వివరాలను ఆ యాప్‌లో పొందుపరిచే విధంగా పంచాయతీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఆ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని, తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల గ్రామంలో ఎలాంటి పనులను చేస్తున్నారో.. ప్రజలు తెలుసుకునే వీలుంటుంది. ఈ యాప్‌లో వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉండటంతో, ఒకచోట పనుల కోసం కేటాయించిన డబ్బును మరో చోట వినియోగించేందుకు వీలుండదు. పాలకులు, అధికారులు తప్పుడు రిపోర్టులు తయారుచేస్తే వాటిని ప్రజలు చూసి ప్రశ్నించేందుకు అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది. సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీల వివరాలను తెలుసుకోవచ్చు. ఏ పనికి ఎంత ఖర్చు చేశారు. అవి ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉన్నాయనే వివరాలు యాప్‌లో ఎంటర్ చేస్తారు. పంచాయతీలో నిర్వహించే గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. కార్మికులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులను కూడా ఇందులో నమోదు చేస్తారు. యాప్‌లో సమగ్ర సమాచారం గతంలో సాంకేతిక సమస్యతో ఆగిన ఈ యాప్‌ను కేంద్రం ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. పంచాయతీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యాప్‌లో వివరాలు పొందుపరచడంపై దృష్టి సారిస్తాం. జిల్లాలోని 323 పంచాయతీల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచుతాం. – కల్పన, జిల్లా పంచాయతీ అధికారియాప్ పనితీరు ఇలా.. స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి ఈ ‘మేరీ పంచాయత్’ పేరుతో సెర్చ్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు ఎంటర్ చేయాలి. సంబంధిత పంచాయతీలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు, లేదంటే పిన్‌కోడ్‌తో సంబంధిత పంచాయతీ పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. చేసిన పనులకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో పొందుపరుస్తారు. తద్వారా పంచాయతీలలో పారదర్శకతకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 2019లో ప్రత్యేక యాప్ రూపకల్పన సాంకేతిక సమస్యతో ఇబ్బందులు మళ్లీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం గ్రామాభివృద్ధి వివరాల నిక్షిప్తం జిల్లా అధికారులు దృష్టి సారిస్తే సమగ్ర సమాచారం -
తెలుగు అమ్మాయిల్లా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు ఓరుగల్లు పర్యటనలో జిగేల్మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది. సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్లో పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆతీ్మయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయ తీరుతెన్నులను తనివితీరా తిలకించి ఫిదా అయ్యారు. రామప్ప గార్డెన్లో అలేఖ్య పుంజాల శాస్త్రీయ నత్యం, రంజిత్ బృందం పేరిణి ప్రదర్శనలను వీక్షించిన అనంతరం..ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్లో డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. అతిథులకు మంత్రుల సన్మానం వరంగల్ కోటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ సుందరీమణులకు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ఓరుగల్లు నిలువెత్తు నిదర్శనమన్నారు. రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ సాంస్కృతిక చారిత్రక కట్టడాలకు నిలయం ములుగు ప్రాంతమని, ఇక్కడకు సుందరీమణులు రావడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ పర్యటన ఎప్పటికీ గుర్తుంటుంది చారిత్రక సంపదకు నెలవైన వరంగల్ పర్యటన మాకు జీవితాంతం గుర్తుండే అనుభూతి. కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట అద్భుతంగా ఉంది. మాటల్లో దీన్ని వర్ణించలేం. రాణిరుద్రమదేవి గొప్పతనం ఇక్కడ కళ్లకు కట్టినట్టు కనిపించింది. కాకతీయుల పాలన గురించి తెలిపే సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన మాకెంతో అవగాహన కలిగించింది. ఇక్కడి ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోంది. చేనేత కలంకారి డ్రెస్ చూస్తే ఇక్కడి గొప్పతనం తెలుస్తోంది. చపాట మిర్చి చూసేందుకు బాగా ఉంది. ఇంకా టేస్ట్ కూడా ఆ రేంజ్‌లోనే ఉందనుకుంటున్నాం. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని మా దేశంలో వినిపిస్తాం. –మిస్ వరల్డ్ పోటీదారులు -
వృత్తి వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకోవాలి
పర్వతగిరి: పర్వతగిరి గ్రామపంచాయతీ పరిధిలో వృత్తి వ్యాపారం చేసుకొనే వారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన సూచించారు. ఈ మేరకు వృత్తి వ్యాపారం చేసే దుకాణాలను బుధవారం సందర్శించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తాగునీటి సరఫరా, నర్సరీ మొక్కలు వర్మీకంపోస్టు తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట డివిజన్ పంచాయతీ అధికారి వేదవతి, పంచాయతీ కార్యదర్శి రఘు, సిబ్బంది ఉన్నారు.దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నిట్ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పీజీ కోర్సుల్లో ఎంటెక్, ఎమ్మెస్సీల్లో ప్రవేశానికి గాను జూన్ 4వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ccmt2025helpdesk@nitw లేదా ccmn2025helpdesk@nitw లో సంప్రదించాలని పేర్కొన్నారు.పోలీసుల అత్యుత్సాహంహన్మకొండ : మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సుందరీమణుల రాకతో జిల్లా యంత్రాగం మహిళా ఉద్యోగులకు హరిత కాకతీయ హోటల్లో డ్యూటీలు వేశారు. రెవెన్యూ, పౌర సరఫరాల, జిల్లా పౌర సంబంధాల శాఖతో పాటు ఇతర విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులకు హరిత కాకతీయ హోటల్లో విధులు నిర్వహించేందుకు వచ్చారు. అయితే పోలీసులు మీరు ఇక్కడ ఉండొద్దని మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా తిప్పి పంపారు. దీంతో తమకు తమ అధికారులు డ్యూటీలు వేస్తే పోలీసులు అవమాన పరిచేలా వ్యవహరించి వెళ్లగొట్టారని తెలిపారు.ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనఐనవోలు: ఐలోని మల్లికార్జునస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని కోమల్లపల్లి సంపత్‌కుమార్ రుత్విక్ బృందం ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా ప్రతిష్ఠించారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, శాంతి కల్యాణం, ఒగ్గు పూజారులతో పెద్దపట్నం తదితర పూజలు నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీపీ మధుమతి పాల్గొన్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు నిర్మాణ దాతలు పర్ష సర్వేశ్వర్రావు యాదవ్ కుటుంబ సభ్యులకు శేషవస్త్రాలను అందజేశారు. అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.చింతామణి జలపాతం వద్ద సందడిమంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చింతామణి జలపాతం వద్ద నీటిని తాగి ఆహ్లాదంగా గడిపారు. కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. శిఖాంజనేయస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం, షాపుల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.ఆర్టీసీ బస్సు టైర్ పగిలి ముగ్గురికి గాయాలుపర్వతగిరి: ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో ముగ్గురు గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నుంచి అన్నారం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈక్రమంలో బస్సు పర్వతగిరి మండలంలోని తురుకల సోమారం వద్దకు రాగానే సాయంత్రం టైరు పగిలింది. దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిలో హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఉల్లి మాధవి, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన నూనావత్ బాలు, అన్నారం గ్రామానికి చెందిన రాజులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. టైరు పగలడంతో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తమై మిగిలిన ప్రయాణికులకు ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
కేయూ డిగ్రీ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల రెండో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకా రం జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికా రి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. హనుమకొండలో పలు పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం,పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య సందర్శించి పరిశీలించారు.చిరు వ్యాపారులను ఆగం చేయొద్దురామన్నపేట: సుందరీమణుల ఓరుగల్లు పర్యటనలో భాగంగా రోడ్ల వెంట ఉన్న చిరువ్యాపార సముదాయాలను తొలగించి ఆ వ్యాపారుల జీవితాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో పలు కూడళ్లలో చిరు వ్యాపారుల సముదాయాలను కూల్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఓరుగల్లు చరిత్రను విశ్వవ్యాప్తం చేయడంపై తాము వ్యతిరేకం కాదని, కానీ సుందరీమణులు వస్తున్నారని పండ్ల వ్యాపారులు, చిన్నచిన్న ఉపాధి దుకాణాలు తొలగించి వారి జీవితా ల ను రోడ్డునపడేయడం దుర్మార్గమన్నారు. అ నంతరం ఎంజీఎం కూడలిలో నాయకులు మా నవహారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రే టర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, సిద్ధం రాజు, మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇమ్మడి లోహిత రాజు, నాగేశ్వర్రావు, నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.నాణ్యమైన విద్య బోధించాలిమామునూరు: ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన చేయాలని ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ కోలా ఆనంద కిషోర్, డీఈఓ జ్ఞానేశ్వర్ సూచించారు. ఈమేరకు వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజులు జిల్లాస్థాయి ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు డాక్టర్ కందాల రామయ్య డాక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీసీఈవి సెక్రటరీ జి.కృష్ణమూర్తి, ఎంఎంఓ సుజన్ తేజ, కోర్సు ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ తాటి పాముల రమేష్, సంపత్, అశోక్, శ్రీనివాస్, కొమురయ్య, ఆనందమోహన్ పాల్గొన్నారు.శిక్షణకు హాజరుకాని 21మంది టీచర్లకు షోకాజ్ నోటీసువిద్యారణ్యపురి: ఖిలావరంగల్ మండలంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదు రోజులపాటు జరిగే శిక్షణకు హాజరుకాని 21 మంది ఉపాధ్యాయులకు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ షోకా జ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 596మంది ఉ పాధ్యాయులు శిక్షణకు హాజరుకావాల్సిఉంది. అందులో 21మంది టీచర్లు శిక్షణకు హాజరు కాలేదని గుర్తించారు. వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సృజన్‌తేజ బుఽ దవారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో ఒక్కరోజులో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. -
సమీకృతం సాకారమయ్యేనా..?
నర్సంపేట: నర్సంపేటలోని జిల్లాస్థాయి కూరగాయల మార్కెట్, వారంతపు సంతకు ప్రాధాన్యత ఉంది. చాలా ఏళ్లుగా మార్కెట్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. రూ.2 కోట్ల వ్యయంతో పట్టణంలోని అంగడి ఆవరణలో నిర్మించిన సమీకృత మోడల్ కూరగాయల భవనాన్ని 2021 మే 28న ప్రారంభించారు. కానీ, నాటి నుంచి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నాలుగేళ్లుగా భవనం వినియోగంలోకి రాలేదు. చిరు వ్యాపారస్తులు కూరగాయల విక్రయాలను అంగడి గ్రౌండ్‌లోనే కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే గ్రౌండ్ అంతా తడిసి బురదమయం కావడంతో వ్యాపారస్తులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు అంగడి సమీపంలోనే చిరు వ్యాపారుల కోసం రూ.7లక్షల 50వేలతో నిర్మించిన రేకుల షెడ్డును కూడా వ్యాపారస్తులకు కేటాయించకపోవడంతో వృథాగా మారింది. జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నర్సంపేట వారంతపు సంతను ప్రధాన రహదారిపై నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లపైనే వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకుంటుండడంతో భద్రాచలం, మహబూబాబాద్, వరంగల్‌కు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడుతుంది. వినియోగంలోకి వచ్చేనా.. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవనం నిరుపయోగంగా ఉండడాన్ని గ్రహించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం భవనాన్ని పరిశీలించి ఇబ్బందులను తెలుసుకున్నారు. చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేందుకు చేపట్టాల్సిన పనులను ఇంజనీరింగ్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. దీంతోపాటు చిరు వ్యాపారస్తుల సంఘం నాయకులతో చర్చించి ఏ విధమైన అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయంపై చర్చించారు. దీంతో బుధవారం సంబంధిత అధికారులతోపాటు కాంట్రాక్టర్లు భవనం వద్దకు వెళ్లి కార్యచరణపై పరిశీలించారు. ఇప్పటికై నా మార్కెట్ భవనం వినియోగంలోకి తెచ్చి తమకు కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు. రూ.2కోట్లతో మోడల్ మార్కెట్ భవన నిర్మాణం నాలుగేళ్లుగా నిరుపయోగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు ఎమ్మెల్యే చొరవతో అధికారుల్లో చలనం -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యులు పాల్గొననున్నారు. – కాళేశ్వరం నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ ● సరస్వతిఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించ నున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం– వివరాలు 8లోu -
గెలుపు గుర్రాలకే ఎన్నికల్లో చాన్స్
పరకాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో ఆదరణ ఉండడంతోపాటు కచ్చితంగా గెలిచే వారికే పోటీచేసే అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ అబ్జర్వర్ మక్సుద్ అహ్మద్ స్పష్టం చేశారు. బుధవారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణంలో పరకాల, నడికూడ మండలాల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మక్సుద్ అహ్మద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కేడర్ బాగుంటే పార్టీ బాగుంటుందని అని చెప్పడానికి పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నిదర్శనమని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పరకాల, నడికూడ మండలాల అధ్యక్షులు కట్కూరి దేవేందర్‌రెడ్డి, బుర్ర దేవేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
నాణ్యమైన విద్య బోధించాలి
మామునూరు: ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెస ర్ కోలా ఆనంద కిషోర్, డీఈఓ జ్ఞానేశ్వర్ సూచించా రు. ఈమేరకు వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల జిల్లాస్థాయి ఉపాధ్యా య శిక్షణ శిబిరాన్ని బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు డాక్టర్ కందాల రామయ్య, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీసీ ఈవీ సెక్రటరీ కృష్ణమూర్తి, ఎంఎంఓ సుజన్ తేజ, కోర్సు ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ తాటిపాముల రమేష్, సంపత్, అశోక్, శ్రీని వాస్, కొమురయ్య, ఆనందమోహన్ పాల్గొన్నారు. 21మంది టీచర్లకు షోకాజ్ నోటీసు విద్యారణ్యపురి : ఖిలావరంగల్ మండలంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదు రోజులపాటు జరిగే శిక్షణకు హాజరుకాని 21 మంది ఉపాధ్యాయులకు డీఈఓ జ్ఞానేశ్వర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 596 మంది ఉపాధ్యాయులు శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. అందులో 21 మంది టీచర్లు శిక్షణకు హాజరుకాలేదని గుర్తించి, డీఈఓ షోకాజ్ నోటీసులు జారీచేశారని జిల్లా క్వాలి టీ కోఆర్డినేటర్ సృజన్‌తేజ బుధవారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో ఒక్కరోజులో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆనంద కిషోర్, వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ -
జగ్గారెడ్డి బట్టలు ఊడగొట్టడం ఖాయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డిహన్మకొండ: ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు జారీ మాట్లాడితే పార్టీ కార్యకర్తలు జగ్గారెడ్డి బట్టలు ఊడగొట్ట డం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల ను సంతోష్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు అన్నారు. బుధవారం హనుమకొండ దీన్‌దయాల్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. ఇటీవల సినిమా తీస్తున్న జగ్గారెడ్డికి మతి భ్రమించిందని, పూర్తిగా విలన్లా ప్రవర్తిస్తున్నాడన్నారు. గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలే ఆయనను ఓడించిందని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్‌ను విమర్శించడం అర్థరహితమన్నారు. బీజేపీ నాయకులు రావు పద్మ, వన్నాల శ్రీరాములు,డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలగొట్టడంపై నిలదీసిన ఈటల రాజేందర్‌పై జగ్గారెడ్డి నోరు పారేసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలను వారు తి ప్పికొట్టారు. సమావేశంలో నాయకులు గజ్జెల్లి శ్రీరా ములు, సండ్ర మధు, సంపత్ రెడ్డి పాల్గొన్నారు. -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధ్ధులను చేశారు. రెడ్‌కార్పెట్‌పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్‌లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్‌తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్‌లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్‌తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. – కాళేశ్వరం నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ సరస్వతిఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం– వివరాలు 8లోu -
గుర్తింపు కార్డుల కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● కలెక్టర్ సత్యశారద వర్ధన్నపేట: గుర్తింపు కార్డుల కోసం రైతులు దరఖాస్తులు అందచేసి తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించి, దరఖాస్తులను పరిశీలించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ భారతి చట్టంతో భూ సమస్యలు ఉన్న రైతుల దరఖాస్తులను పరిశీలించి అవసరమైనచోట భూముల వద్దకు అధికారులు వచ్చి సమస్యను అవగాహన చేసుకుని పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. బుధవారంతో రెవెన్యూ సదస్సులు ముగిసినట్లు తెలిపారు. ఎవరైనా రైతులు మిగిలిన వారు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు అందచేయాలని సూచించారు. రైతులు తమ వివరాలను అందచేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గుర్తింపు కార్డులు అందచేయనున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల వల్ల ప్రభుత్వం వద్ద అర్హులైన రైతులు ఎందరు ఉన్నారనే సమాచారం నిక్షిప్తమై ఉంటుందని అన్నారు. తద్వారా సబ్సిడీలు సులభంగా అందజేసే అవకాశం ఉంటుందన్నారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ విజయసాగర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
కేయూ డిగ్రీ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల రెండో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. హనుమకొండలో పలు పరీక్షా కేంద్రాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం,పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య సందర్శించి పరిశీలించారు. -
వైభవంగా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ఐనవోలు: ఐలోని మల్లికార్జునస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని కోమల్లపల్లి సంపత్‌కుమార్ రుత్విక్ బృందం ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా ప్రతిష్ఠించారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, శాంతి కల్యాణం, ఒగ్గు పూజారులతో పెద్దపట్నం తదితర పూజలు నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీపీ మధుమతి పాల్గొన్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు నిర్మాణ దాతలు పర్ష సర్వేశ్వర్రావు యాదవ్ కుటుంబ సభ్యులకు శేషవస్త్రాలను అందజేశారు. అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, ఒగ్గు పూజారులు, నాయీబ్రాహ్మణులు, రజకులు పాల్గొన్నారు. -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లాగా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశారు. రెడ్‌కార్పెట్‌పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్‌లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణుల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తుసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(కె) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. ఈ సందర్భంగా హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హరిత కాకతీయలో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. కోనేరు ముందు నుంచి వెళ్తూ తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. 44 నిమిషాల పాటు ఆలయంలో సందడి చేశారు. అనంతరం నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుని పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్‌తో సందడి చేసి, ఆ తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారికి సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్బగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశ్వీరచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా.. విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండిక్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించగా ఆసక్తిగా విన్నారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నల్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన ఆద్భుతమైన శిల్ప కళ సంపదను మరింత ఆసక్తిగా తిలకించారు. అనంతరం కాకతీయుల కళాఖండాలను తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్‌లో ప్రదర్శించగా.. కాకతీయ వంశ చరిత్ర, రాణి రుద్రమదేవి పోరాట పటిమ, వీరత్వం స్పష్టం చేయగా.. విశ్వసుందరీమణులు ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. కట్టడం విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని ఇంటాక్ నిర్వాహకులు, పర్యాటకశాఖ అధికారులు వివరించారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో విద్యుత్ వెలుగుల నడమ పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్‌తో కూడిన బహుమతులను అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుమ్మాయిల్లా ముస్తాబయ్యారు. సరస్సుకట్టపై ఫొటోలు దిగారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేష్‌లు వివరించగా శిల్పాకళాసంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ఆలయం చుట్టూ హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆలయ ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం రామప్ప గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. చివరగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు మంత్రి సీతక్క జ్ఞాపికలు అందించారు. సుందరీమణుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ‘ఆక్టోపస్’ బృందాలను రంగంలోకి దింపారు. సుందరీమణుల పర్యటన మరిన్ని ఫొటోలు – 8లో -
ఓరుగల్లుకు ప్రపంచ సుందరీమణులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రక నగరం ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణులు బుధవారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ నగరంలో నాలుగున్నర గంటలు గడపనున్నారు. రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4:35 గంటలకు 22 మంది బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 5:45 గంటలకు చారిత్రక వేయి స్తంభాల దేవాలయానికి చేరుకుని అక్కడి కార్యక్రమాల అనంతరం 6:40 గంటలకు వరంగల్ కోటకు చేరుకొని శిల్పాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకుంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రామప్పకు మరో బృందం: 35 మంది సుందరీమణుల మరో బృందం సాయంత్రం 5:15 గంటలకు ములుగు జిల్లా రామప్పకు చేరుకుని అక్కడి హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరి సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యం, కాకతీయుల చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్లు ప్రావీణ్య, సత్యశారద, సన్‌ప్రీత్‌సింగ్‌లు, వివిధ శాఖల అధికారులు వారం రోజులుగా సమీక్ష లు, ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్‌లు రామప్పలో ఏర్పాట్లు పరిశీలించారు. సుమారు మూడు వేల మంది పోలీసులు మూడంచెల బందోబస్తులో పాల్గొంటున్నారు. -
సుందరీమణుల పర్యటనకు భారీ భద్రత
వరంగల్ క్రైం: మిస్ వరల్డ్ పోటీలను పురస్కరించుకొని హెరిటేజ్ పర్యటనలో భాగంగా నేడు (బుధవారం) గ్రేటర్ వరంగల్‌లో సుందరీమణుల పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం కమిషనరేట్‌లో సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణుల భద్రతకు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీ, ఏసీపీలు–11, ఇన్స్పెక్టర్లు–32, ఎస్సైలు–81, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుల్–155, కానిస్టేబుళ్లు–325, మహిళా పోలీసులు–106, హోంగార్డ్స్ 210తో పాటు డిస్ట్రిక్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ విభాగాలకు చెందిన అధికారులు భద్రత ఏర్పాట్లలో పాల్గొనున్నట్లు వివరించారు. నగరంలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సుందరీమణుల పర్యటనలో ఎలాంటి సమస్యలు రాకుండా సెక్టార్ల వారీగా ఇన్చార్జ్ పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
‘సీబీఎస్ఈ’లో సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ఖానాపురం: సీబీఎస్ఈ ఫలితాల్లో అశోక్‌నగర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఇంటర్లో 80 మంది విద్యార్థులకు 80 మంది, పదో తరగతిలో 61 మందికి 61 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్లో గణేశ్ 442, గోపాల్ 435, ముఖేశ్ 415 సాధించారని పేర్కొన్నారు. పదో తరగతిలో రాజ్‌కుమార్ 456, నవదీప్ 452, గణేశ్ 448 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. విద్యార్థులను డైరెక్టర్ శ్రీనివాసస్వామి అభినందించారు. -
మార్కెట్ భవనాన్ని వినియోగంలోకి తేవాలి
నర్సంపేట: కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కూరగాయల మార్కెట్ భవనాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పట్టణంలోని అంగడి ఆవరణలో ఉన్న కూరగాయల మార్కెట్ భవనం, పరిసర ప్రాంతాలను మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలోపు భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్యగౌడ్, ఏఈ, డీఈ, ఇంజనీర్లు, కూరగాయల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలినర్సంపేట పట్టణంలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాలుగో వార్డులోని సర్వాపురం, ఇందిరమ్మ కాలనీల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఏఈ రాజేశ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్యగౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
సివిల్ ఇంజనీరింగ్ బీఓఎస్‌గా శ్రీకాంత్
కేయూ క్యాంపస్: కాకతీయ యూ నివర్సిటీ సివిల్ ఇంజ నీరింగ్ విభా గం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా కాకతీయ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్),వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శ్రీకాంత్‌ను నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన కేయూ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫె సర్ డాక్టర్ సీహెచ్ రాధిక నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.వీసీ కె.ప్రతాప్‌రెడ్డి.. శ్రీకాంత్‌కు ఉత్తర్వులు అందజేశారు. -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
మహిళా డెయిరీ ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి
ఎల్కతుర్తి: పరకాల నియోజకవర్గం దామెర మండలంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కొత్తగా మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా సొసైటీలో పరకాల నియోజకవర్గంలోని మహిళా రైతులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి మంగళవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ముల్కనూర్ సొసైటీ ద్వారా పాడి రంగంలో మహిళలు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులకు అందజేస్తున్న శిక్షణ కార్యక్రమాలను నిర్వాహకులు ఎమ్మెల్యే రేవూరికి, కలెక్టర్లకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని ఆరు మండల్లాల్లో మహిళా రైతులతో డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 53 కోఆపరేటివ్ సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించామని వెల్లడించారు. డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు ముల్కనూర్ డెయిరీ ద్వారా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దామెర మండలంలో డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు, దీంతో మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందుకోసం ఆరు మండలాల్లో పాడి పశువులు, పాల దిగుబడుల సర్వే పూర్తయినట్లు వివరించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్యదేవి, మహిళా డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, డెయిరీ జీఎం భాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులు, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ముల్కనూర్ డెయిరీని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్లు -
వైద్య కళాశాలలో సమస్యలు పరిష్కరిస్తా
నర్సంపేట రూరల్: నర్సంపేట వైద్య కళాశాలలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించడానికి కృషిచేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. వైద్య కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. కళాశాల అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు హుస్సేన్‌నాయక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహారాములు పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, నాయకులు కంభంపాటి పుల్లారావు, ఠాకూర్ రవీందర్‌సింగ్, గడ్డం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సైనిక్ స్కూల్ సందర్శన.. మండలంలోని అశోక్‌నగర్ గిరిజన సైనిక్ స్కూల్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్‌నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గట్ల సురేందర్‌తో సైనిక్ స్కూల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య, స్కూల్, విద్యార్థుల అవసరాలపై చర్చించారు. అగ్నివీర్‌కు ఎంపికై న విద్యార్థుల సంఖ్యను వివరించారు. అనంతరం హుస్సేన్‌నాయక్ మాట్లాడుతూ దేశ రక్షణలో యువత పాత్ర కీలకమని, యువతను అగ్నివీర్‌కు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషిచేయాలని సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్ సౌజన్య, డైరెక్టర్ శ్రీనివాసస్వామి తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్‌నాయక్ -
వరంగల్
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.– 8లోuపున్నమి వెలుగుల్లో రామప్పసుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్‌మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు ● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు ● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు. ● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. ● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. ● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. ● రాత్రి 7.20 గంటలకు ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్ ప్రయాణమవుతారు. ● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. ● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. ● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. ఏయే దేశాల సుందరీమణులంటే.. ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు. ● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు. ● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. డిన్నర్లో ఇవే.. సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్‌కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్‌గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్‌గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్‌గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. న్యూస్రీల్అందాల భామలకు ఆహ్వానంరామప్ప ఆలయంలో ఇలా..4.35 గంటలకు వరంగల్‌కు.. -
కుమారుల నుంచి ఆస్తిని బదలాయించాలి
తనను పోషించలేని కుమారులనుంచి ఆస్తిని బదలాయించి, న్యాయం చేయాలని పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన గుండెబోయిన చిన్న ఐలయ్య ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరారు. గతంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారని, భూమి రద్దు చేయడం తమ పరిధిలో లేదని, కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని సూచించినట్లు చిన్న ఐలయ్య వివరించారు. రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తన సమస్య పరిష్కారం కావడం లేదని మొత్తుకున్నాడు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడని, చిన్న కుమారుడు వ్యవసాయం చేస్తాడని, ఇద్దరు తమను పట్టించుకోవడం లేదని కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. – గుండెబోయిన చిన్న ఐలయ్య, నాగారం సెకండియర్ బోధన చేయలేమంటున్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యా బోధన అందించలేమని, ఇతర కళాశాలల్లోకి వెళ్లాలని హనుమకొండ నయీంనగర్‌లోని ఆర్డీ జూనియర్ కళాశాల యాజమాన్యం తెలిపిందని ఆ కళాశాల విద్యార్థులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు వచ్చారు. ఆర్డీ కళాశాలలో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యాబోధన అందిస్తున్నారని, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావడం లేదని, ద్వితీయ సంవత్సరం ఇతర కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు చెప్పారని వివరించారు. తాము ఏ కాలేజీలో చేరాలో అర్థం కావడం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. -
సీపీని కలిసిన ఏసీపీలు
వరంగల్ క్రైం: కాజీపేట, నర్సంపేట డివిజన్ల నూతన ఏసీ పీలుగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలన్నారు. పోలీస్ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.కేయూ కామర్స్ బీఓఎస్ చైర్‌పర్సన్‌గా వరలక్ష్మికేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంటు కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా ఆ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మిని నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆమె వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి సీడీసీ డీన్‌గా, యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.నియామకంరామన్నపేట: హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ కల్పలత సూపర్ బజార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, మేనేజింగ్ డైరెక్టర్‌గా జిల్లా సహకార అడిట్ అధికారి కె.కోదండరాములు నియామకం అయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తించిన ఎ.జగన్మోహన్రావు ఇదే శాఖలో డీసీఓగా బదిలీ అయ్యారు. సూపర్ బజార్ అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్, మేనేజర్ రఘురామరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.అందాల పోటీలతో మహిళల ఆత్మగౌరవానికి భంగం● ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవిహన్మకొండ: అందాల పోటీలతో మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతోందని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి పేర్కొన్నారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. మహిళలను వ్యాపార వస్తువుగా చూసే సంస్కృతి పోవాలని, వెంటనే అందాల పోటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను పక్కనపెట్టి అందాల పోటీలు నిర్వహించడం విచారకరమన్నారు. అందాల పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు, రమాతార, సభ్యులు శ్వేత, రాధిక, సునీత, రాధ, అనిత, ఉమా, పద్మ, లచ్చమ్మ పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్‌తో సత్వర రిజిస్ట్రేషన్
కాజీపేట అర్బన్: స్లాట్ బుకింగ్ విధానంతో సత్వర రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ పేర్కొన్నారు. సోమవారం వరంగల్ ఆర్వోలో స్లాట్‌బుకింగ్ సేవలను ఫణీందర్ ప్రారంభించి దస్తావేజులను భూ క్రయదారులకు 15 నిమిషాల్లో అందజేశారు. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీరోజు 96 స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నామని, స్లాట్ బుకింగ్ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, నస్రీమా, సిబ్బంది పాల్గొన్నారు. తొలి రోజు ఇలా.. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండో దశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, జనగామ, స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేశారు. వరంగల్ ఆర్వోలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండగా 96 స్లాట్ బుకింగ్స్, మిగతా మూడు కార్యాలయాల్లో 48 స్లాట్ బుకింగ్స్‌కు అవకాశం కల్పించారు. తొలిరోజు వరంగల్ ఆర్వోలో 71, జనగామ 25, స్టేషన్ ఘన్పూర్ 22, నర్సంపేట 24 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ -
సుందరీమణుల రాకకు విస్తృత ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్: నగరంలోని వేయిస్తంభాల ఆలయంతో పాటు ఖిలా వరంగల్ కోట శిల్పాల ప్రాంగణాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్న సందర్భంగా విస్తృతమైన, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులకు సూచించారు. రేపు (బుధవారం) ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా సోమవారం రెండు జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ సన్‌ప్రిత్‌సింగ్, డీసీపీ సలీమా, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్, కుడా, దేవాదాయశాఖ, టూరిజం, పోలీస్ అధికారులు దేవాలయాన్ని, కోటను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. 14వ తేదీన సాయంత్రం 4ః30 గంటలకు హరితకాకతీయ హోటల్ నుంచి వేయిస్తంభాల గుడికి వస్తారని, దేవాలయం చుట్టూ, కల్యాణ మండపంలో గ్రీన్మ్యాట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం గర్భాలయంలో పూజలు చేస్తారని స్వామివారి దర్శనం పూజ కార్యక్రమం నిర్వహించడానికి నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మకు సూచించారు. అనంతరం ఆలయ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని వివరించాలని అన్నారు. త్రికూటాలయం చుట్టూ శిల్పకళను, నందీశ్వరుని సన్నిధిలో, కల్యాణమండపంలో 55 నిమిషాల పాటు ఫొటోషూట్ కార్యక్రమం ఉంటుందని వివరించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కేంద్రపురావస్తు శాఖ కోఆర్డినేటర్ నిరంజన్, ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌కు సూచించారు. దేవాలయం ఎదుట పచ్చదనంతో శుభ్రంగా కనిపించాలని, కుడా గార్డెన్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను పర్యాటక శాఖ ట్రయిల్ రన్ వేయగా ఆసక్తిగా తిలకించారు. సుందరీమణుల రాకతో ఓరుగల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ జిల్లా అధికారి వై.వి గణేష్, టూరిజం శాఖ అధికారులు నాథన్, శివాజీ, సూర్యకిరణ్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, నందిరామ్‌నాయక్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ సీఐ సతీష్‌కుమార్, నోడల్ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేయిస్తంభాల ఆలయం, కోట శిల్పాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు -
పంటలకు గోదావరి జలాలు అందిస్తాం..
ధర్మసాగర్: వానాకాలంలోగా ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులు పూర్తి చేసి ధర్మపురం రైతుల పంటలకు గోదావరి జలాలు అందిస్తామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురంలో ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ధర్మపురం గ్రామానికి 25 ఇళ్లు మంజూరు చేశానని, త్వరలోనే మరో 25 ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం ద్వారా నష్కల్ నుంచి వంగాలపల్లి వరకు పైపులైన్ పనులను పూర్తి చేసి వర్షాకాలం వరకు పంట పొలాలకు సాగునీరు అందిస్తామని, పైపులైన్ ఏర్పాటుకు రైతులు సహకరించాలని కోరారు. ఇప్పటికే గ్రామంలో ముదిరాజ్, యాదవ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి మంజూరు ఇచ్చానని, వాటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సీ కాలనీలో శ్మశానవాటికకు ప్రహరీ, బోర్వెల్, స్నానపు గదులను మంజూరు చేస్తానని అన్నారు. అలాగే గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 15 రోజుల్లో మంజూరు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ మునిగాల యాకూబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
కూతురు సాకడం లేదు..
కన్న కూతురు తమను సాకడం లేదని, తన ఆస్తి తనకు ఇప్పించాలని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పంజ నాగయ్య, ఎల్లవ్వ ప్రజావాణిలో కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. సర్వేనంబర్ 469లో 1.8 ఎకరాల భూమిని తన కూతురు నగరబోయిన అనిత పేరుపై పట్టా చేశానని, ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. కూతురు నుంచి తమ భూమి తమకు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రం తీసుకున్న కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. జీవితాంతం పోషిస్తానని.. జీవితాంతం పోషిస్తానని చెప్పి తన పేరుపై ఉన్న ఆస్తిని కాజేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని దామెరకు చెందిన ఎడ్ల శాంతమ్మ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. తన పేరుపై ఉన్న ఆస్తి 3.30 ఎకరాల భూమి, ఇంటి పక్కన ఉన్న 10 గుంటల జాగాను చిన్న కూతురు గాలి కల్పన రిజిస్ట్రేషన్ చేయించుకుందని, ఇప్పుడు తనను పోషించడం లేదని, చంపుతానని బెదిరిస్తోందని కలెక్టర్‌తో మొరపెట్టుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దు చేసి తన ఆస్తిని తనకు ఇప్పించాలని, చిన్న కూతురు కల్పన తన ఆస్తిని అనుభవించే హక్కు లేదని, న్యాయం చేయాలని కోరారు. -
యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపిక
కేయూ క్యాంపస్: ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. కర్ణాటకలోని మంగళూరులో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ఐకాన్ యూత్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్–2025కు కేయూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) వలంటీర్లు శ్రీజ జాదవ్, గుజ్జర వికాస్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. వలంటీర్లను బయోటెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాధిక అభినందించారు. -
ప్రొఫెసర్ మల్లారెడ్డికి ఫెల్లోషిప్ ప్రదానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్కమ్యూనికేషన్ హానరీ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పద్మ గ్రహీత డాక్టర్ దువ్వారు నాగేశ్వర్‌రెడ్డి చేతులమీదుగామల్లారెడ్డి హానరీ ఫెల్లోషిప్ అందుకున్నారు. ఈ మేరకు మల్లారెడ్డిని సోమవారం యూనివర్సిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కె.రాజేందర్, నాగరాజు, ఎల్పీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపిక
కేయూ క్యాంపస్: ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంపికయ్యారని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. కర్ణాటకలోని మంగళూరులో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ఐకాన్ యూత్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్–2025కు కేయూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) వలంటీర్లు శ్రీజ జాదవ్, గుజ్జర వికాస్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. వలంటీర్లను బయోటెక్నాల జీ విభాగం అధిపతి డాక్టర్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాధిక అభినందించారు. -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
గీసుకొండ: బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో మండలంలోని కొనాయమాకులలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో గీసుకొండ, సంగెం మండలాలతో పాటు 15,16,17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, పీసీసీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ ఎండీ అమీర్ అలీఖాన్, పీసీసీ అబ్జర్వర్ రవిచంద్ర పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, పార్టీకి అంకితమై పూర్తిస్థాయిలో పనిచేసే ఉత్సహవంతులు ము ందుకు రావాలన్నారు. 2017కు ముందు నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన వారికి బ్లాక్ అధ్యక్షులు, మండల, డివిజన్ అధ్యక్షులుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటిష్టమైన నాయకత్వంతోనే పార్టీ బలోపేతం సంగెం: పటిష్టమైన నాయకత్వంతోనే పార్టీ బలోపేతమవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం గీసుకొండ మండలం కొనాయమాకులలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో సంగెం, గీసుకొండ, 15, 16, 17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులుగా ఎమ్మెల్సీ ఎండి.అమీర్ అలీఖాన్, అబ్జర్వర్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
సుందరీమణుల రాకకు విస్తృత ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్ / ఖిలా వరంగల్ : నగరంలోని వేయిస్తంభాల ఆలయంతో పాటు ఖిలా వరంగల్ కోట శిల్పాల ప్రాంగణాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులకు సూచించారు. రేపు (బుధవారం) ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ సన్‌ప్రిత్‌సింగ్, డీసీపీ సలీమా, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్, ‘కుడా’, దేవాదాయశాఖ, టూరిజం, పోలీస్ అధికారులు వేయిస్తంభాల దేవాలయాన్ని, కోటను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. 14వ తేదీన సాయంత్రం 4ః30 గంటలకు హరితకాకతీయ హోటల్ నుంచి వేయిస్తంభాల గుడికి వస్తారని, దేవాలయం చుట్టూ,కల్యాణ మండపంలో గ్రీన్మ్యాట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం గర్భాలయంలో పూజలు చేస్తారని స్వామివారి దర్శనం, పూజ కార్యక్రమం నిర్వహించడానికి నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మకు సూచించారు. అనంతరం ఆలయ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని వివరించాలని అన్నారు. త్రికూటాలయం చుట్టూ శిల్పకళను, నందీశ్వరుడి సన్నిధిలో, కల్యాణమండపంలో 55 నిమిషాల పాటు ఫొటోషూట్ ఉంటుందని వివరించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కేంద్రపురావస్తు శాఖ కోఆర్డినేటర్ నిరంజన్, ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌కు ఆమె సూచించారు. దేవాలయం ఎదుట పచ్చదనంతో శుభ్రంగా కనిపించాలని, ‘కుడా’ గార్డెన్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను పర్యాటక శాఖ ట్రయిల్ రన్ వేయగా ఆసక్తిగా తిలకించారు. సుందరీమణుల రాకతో ఓరుగల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ జిల్లా అధికారి వై.వి గణేష్, టూరిజం శాఖ అధికారులు నాథన్, శివాజీ, సూర్యకిరణ్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, నందిరామ్‌నాయక్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ సీఐ సతీష్‌కుమార్, నోడల్ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేయిస్తంభాల ఆలయం, కోటలో శిల్పాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు -
పీడిత ప్రజల మహాశక్తి ఓంకార్
గీసుకొండ: ఓంకార్ ఓ వ్యక్తి కాదని పీడిత ప్రజల మహాశక్తి అని ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. సోమవారం మండలంలోని మచ్చాపూర్‌లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసీపీఐ వ్యవస్థాపకుడు, కమ్యూనిస్టు యోధుడు మద్దికాయల ఓంకార్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఓంకార్‌ను అసెంబ్లీ టైగర్ అనే వారని గుర్తు చేశారు. సామాజిక ఐక్యతే మార్గమన్నారు. ప్రజా గాయకుడు జయరాజ్, నాయకులు గోనె కుమారస్వామి, పలు సంఘాల జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ ఘనంగా శత జయంతి సభ -
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
వర్ధన్నపేట: రైతులు తమకున్న భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం మండలంలోని దమ్మన్నపేట, రామవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆమె పరిశీలించారు. భూసమస్యలపై వస్తున్న దరఖాస్తుల్ని, రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ పని తీరును పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. దమ్మన్నపేటలో రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. అర్హుల ఎంపికలో సమగ్ర విచారణ చేపట్టి నిజమైన వారికే అందించాలని కోరారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారినే ఎంపిక చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్శనలో తహసీల్దార్ విజయసాగర్, పర్యవేక్షకుడు రమే శ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
ప్రొఫెసర్ మల్లారెడ్డికి ఫెల్లోషిప్ ప్రదానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ హానరీ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పద్మవిభూషన్ డాక్టర్ దువ్వారు నాగేశ్వర్‌రెడ్డి ఫెల్లోషిప్ అందుకున్నారు. మల్లారెడ్డిని సోమవారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. ప్రొఫెసర్లు కె.రాజేందర్, నాగరాజు, ఎల్పీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్‌తో సత్వర రిజిస్ట్రేషన్
● జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్కాజీపేట అర్బన్: స్లాట్ బుకింగ్ విధానంతో సత్వర రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ పేర్కొన్నారు. సోమవారం వరంగల్ ఆర్వోలో స్లాట్‌బుకింగ్ సేవలను ఫణీందర్ ప్రారంభించి దస్తావేజులను భూ క్రయ, విక్రయదారులకు 15 నిమిషాల్లో అందజేశారు. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీరోజు 96 స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నామని, స్లాట్ బుకింగ్ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, నస్రీమా, సిబ్బంది పాల్గొన్నారు. తొలి రోజు ఇలా.. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండో దశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, జనగామ, స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేశారు. వరంగల్ ఆర్వోలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండగా 96 స్లాట్ బుకింగ్స్, మిగతా మూడు కార్యాలయాల్లో 48 స్లాట్ బుకింగ్స్‌కు అవకాశం కల్పించారు. తొలిరోజు వరంగల్ ఆర్వోలో 71, జనగామ 25, స్టేషన్ ఘన్పూర్ 22, నర్సంపేట 24 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. -
స్వల్పంగా తగ్గిన భూగర్భజలం
సాక్షి, వరంగల్: జిల్లాలో భూగర్భ జలమట్టం కొద్దికొద్దిగా దిగువకు వెళ్తోంది. గతేడాది ఏప్రిల్‌లో (సగటు 6.31 మిమీలు)తో పొల్చుకుంటే ఈఏడాది 6.21 మిమీలు అంటే.. మరో పది మిల్లీ మీటర్లు తక్కువగా పడిపోయింది. అదే సమయంలో ఫిబ్రవరిలో సగటు 5.66 మీటర్లుంటే మార్చిలో 6.32 మీటర్లు, ఏప్రిల్‌లో 6.21 మీటర్లుగా ఉంది. అయితే ఇప్పటికే వరి కోతలు పూర్తవడంతో, మే నెలలో సాగు నీటి వాడకం తక్కువగా ఉండడంతో తాగునీటికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని భూగర్భజల విభాగాధికారులు అంటున్నారు. ఓ వైపు సూర్యుడి ప్రతాపం 42 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదవుతుంటే, ఇంకోవైపు స్వల్పంగా భూగర్భజలమట్టం తగ్గుతోంది. వందల ఎకరాల్లో కూరగాయల సాగు మినహా పెద్దగా పంటలు లేవని అందుకే నీటి మట్టం అధిక స్థాయిలో తగ్గడం లేదని అఽధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఎస్సారెస్పీ కెనాల్ నీటి ద్వారా వందల చెరువులు, కుంటలు నింపడం వల్ల చాలాచోట్ల నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లాలో నీటికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపుగా వినియోగించాల్సిన అవసరముందని అధికారులు కోరుతున్నారు. ఎస్పారెస్పీ కాల్వల ద్వారా నీరు రావడంతో కాస్త ఊరట నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులుఆ రెండు మండలాల్లో పెరుగుదల.. మైలారం రిజర్వాయర్ నుంచి వదిలిన నీరు రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఎస్సారెస్పీ ఉపకాల్వల ద్వారా చెరువులు, కుంటలకు చేరుతోంది. దీంతో అక్కడ భూగర్భజలమట్టం పెరిగింది. రాయపర్తి మండలంలో ఫిబ్రవరిలో 8.25 మీటర్లు ఉంటే మార్చిలో 9.82 మీటర్లకు పడిపోయింది. అదే ఏప్రిల్‌లో 4.8 మీటర్లు ఎగబాకి 5.02 మీటర్లకు నీరు చేరుకుంది. పర్వతగిరిలోనూ కాల్వల ద్వారా వచ్చిన నీటితో అక్కడి ప్రధాన చెరువులు, కుంటలు నింపారు. ఫలితంగా ఫిబ్రవరిలో 11.80 మీటర్ల దిగువన నీరు ఉంటే మార్చిలో 14.74 మీటర్లకు దిగువకు చేరి ప్రమాద ఘంటికలు మోగించాయి. అయితే కాల్వ ల ద్వారా నీరు రావడంతో నీటిమట్టం 12.83 మీటర్లకు చేరుకుంది. ఇంకా మిగిలిన మండలాల్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మధ్య పాయింట్ల తేడా ఉండడం గమనార్హం. -
మధ్యాహ్న భోజన పథకాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో ‘అక్షయపాత్ర’కు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. ఆ దివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మ ధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 20 ఏళ్లుగా మధ్యాహ్నభోజన కార్మికులు బిల్లులు సకాలంలో రాకపోయినా విద్యార్థులకు వంటచేసి పెడుతున్నారని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత, బాధ్యులు కె.శాంత, సుక్కుబాయి, కె.కవిత, స్వప్న, రాణి, విజయ, శారద,వసుంధర, తస్లీమ్, సరిత పాల్గొన్నారు.‘పాలిసెట్’ ఏర్పాట్లు పూర్తిరామన్నపేట: జిల్లాలో ఈనెల 13న (మంగళవారం) నిర్వహించనున్న పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు, వ్యవసాయ, వెటర్నరీ డిప్లొ మా ప్రవేశాలకు నగరంలోని 12 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. వీటిలో 6,424 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, 11 గంటల తర్వాత అభ్యర్థులను అనుమతించరని సూచించారు.నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దువరంగల్ : బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో సోమవారం(నేడు) నిర్వహించే గ్రేటర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. నగర ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి రాకూడదని సూచించారు.సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణనయీంనగర్: సాధు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన ల క్ష్మీనారాయణ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు అంబికేశ్వరానంద భా రతి ఈమేరకు ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గో సంరక్షణ, సాధు సంరక్షణ, గీతా సంరక్షణ, వేద సంరక్షణ, సనాతన పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. -
గైర్హాజరుకు చెక్..!
నర్సంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందడం లేదు. సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ కొంతమంది వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది విధులకు సరిగా హాజరుకాకపోవడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది గమనించిన ప్రభుత్వం గతంలో ఉన్న బయోమెట్రిక్ హాజరు విధానానికి స్వస్తి పలికి.. ఫేస్ అటెండెన్స్ విధానం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక నిఘా.. జిల్లాతోపాటు డివిజన్, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. అయితే సిబ్బంది, అధికారులు పట్టణాల్లో ఉంటూ రాకపోకలు సాగిస్తూ వైద్య సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లు సమయానికి రాకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆలస్యంగా రావడం లేదా మొత్తానికే ఆరోజు రాకపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫేస్ అటెండెన్స్ ద్వారా ప్రత్యేక నిఘాతోపాటు రోగులకు జవాబుదారీగా ఉంటుంది. అలాగే, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. రోగుల అవస్థలు.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడినప్పటికీ.. మరికొన్ని సేవలు అందుబాటలో లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. దీనికి తోడు వైద్యులు, సిబ్బంది గైర్హాజరుతో నిరీక్షించి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ వేల రూపాయలు చెల్లించి వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో పేదవారిపై ఆర్థిక భారం పడుతుంది. ఫేస్ అటెండెన్స్ విధానంతో పేదల కష్టాలు తీరే అవకాశం ఉంది.అటెండెన్స్ విధాన ం ఇలా. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాకున్నా క్షేత్ర పర్యటన, సమావేశాలకు హాజరవుతున్నట్లు చెబుతూ గైర్హాజరవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ మేరకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో నూతన విధానం ద్వారా ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసేందుకు అబ్బాస్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నూతనంగా ప్రతిపాదించిన యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని.. నిత్యం ఆ యాప్ ద్వారా ఫేస్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. యాప్‌లో సంబంధిత ఉద్యోగి ఆధార్ నంబర్ అనుసంధానం చేయడం ద్వారా ముఖ గుర్తింపు ఉంటుంది. దీంతో వారు పని చేసే లొకేషన్లోనే హాజరు వేశారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. తద్వారా గైర్హాజరు కట్టడితోపాటు రోగులకు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు తెలిపారు.రోగులకు మెరుగైన సేవలు.. ఇప్పటి వరకు ఉన్న వేలిముద్ర హాజరుతో ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన, నిబంధన ఉంది. రానున్న ఫేస్ స్కానింగ్ హాజరుతో మరింత సులభంగా ఉంటుంది. దీని ఫలితంగా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయానికి అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి వెంటనే కొత్త విధానం అమలవుతుంది. – ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ●ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక ఫేస్ అటెండెన్స్ ఇప్పటివరకు ఉన్న బయోమెట్రిక్ విధానానికి స్వస్తి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో నిర్ణయంజిల్లాలో ఆస్పత్రుల వివరాలు.. నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రి : 1ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 14పట్టణ ఆరోగ్య కేంద్రాలు : 7బస్తీ దవాఖానలు : 2 -
టీచర్లకు ‘నైపుణ్య’ శిక్షణ
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల సాధనకు అన్ని కేటగిరీల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఒక్కో టీచర్‌కు ఐదురోజులు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా డిజిటల్ విద్యకు, కంప్యూటర్ ద్వారా ఏఐ ఆధారిత విద్యా బోధన, లీడర్షిప్ లక్షణాల పెంపుదల, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు వివిధ సబ్జెక్టుల విద్యాబోధనపై జీవననైపుణ్యాలపై, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డు (ఐఎఫ్బీ) వినియోగం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మూడుదశల్లో వేసవిసెలవుల్లో హనుమకొండ జిల్లాల్లోని టీచర్లకు మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు మొదటి దశ, ఈనెల 20 నుంచి 24 వరకు రెండో దశ, ఈనెల 27 నుంచి 31 వరకు మూడో దశలో టీచర్ల శిక్షణ ఉండనుంది. స్కూల్ అసిస్టెంట్లకు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు, గెజిటెడ్ హెచ్ఎంలకు, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు, ఎస్జీటీలకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎక్కడంటే.. హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొదటిదశలో ఈనెల13 నుంచి 17 వరకు వివిధ కేటగిరీల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటిదశలో స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లిష్ (100), మ్యాఽథ్స్ (100) సోషల్ స్టడీస్ (100), ఎస్జీటీ ఎంఆర్పీలు (112), స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 33 మంది, ఎస్జీటీ ఉర్దూ మీడియం కేటగిరీలో 50 మందికి హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. హాజరయ్యే టీచర్లకు మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్, తాగునీటి సదుపాయం కల్పిస్తారు. శిక్షణ ఇస్తున్న స్కూల్లో ఏసీ సదుపాయం ఉన్నందున వేసవిలో శిక్షణ పొందే ఉపాధ్యాయులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా సబ్జెక్టుల్లో శిక్షణ పొందిన డీఆర్పీల ద్వారా ఇప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. 20 నుంచి 24 వరకు ప్రాథమిక స్థాయి జిల్లాలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు ఈనెల 20 నుంచి 24 వరకు ఎంఈఓల ఆధ్వర్యంలో మండల స్థాయిలో శిక్షణ ఉంటుంది. జిల్లాలో 1,014 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలోని అన్ని కేటగిరీల టీచర్లకు ఈనెల 13నుంచి 17వరకు శిక్షణ ఇవ్వబోతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్ ఆదివారం తెలిపారు. ఈశిక్షణ ఖిలావరంగల్ మండలం ఉర్సుగుట్ట వద్ద ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మొదటి దశలో వనంగల్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు గణితం (224), ఇంగ్లిష్(179), సోషల్ స్టడీస్ (205) మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే మండల రిసోర్స్పర్సన్లకు 104 మందికి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు 34 మందికి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్సపర్సన్లు కలిపి మొత్తంగా 596 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జియోటాగింగ్ ద్వారా ఆన్లైన్లో హాజరు ఉంటుందని విధిగా టీచర్లు శిక్షకు హాజరుకావాల్సిందేనన్నారు. టీచర్లు విధిగా హాజరుకావాల్సిందే.. జిల్లాలో ఈనెల 13 నుంచి నిర్వహించనున్న టీచర్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావా లి. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలి. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధన, నాణ్యమైన విద్య నైపుణ్యాల పెంపుదల ముఖ్యమైన అంశాలపై ఒక్కో టీచర్‌కు ఐదురోజులు శిఽక్షణ ఉంటుంది. – వాసంతి, డీఈఓ సమయపాలన పాటించాలి..ఉపాధ్యాయులు సమయపాలన పాటించాల్సిందే. ప్రతీ సబ్జెక్టుకు కాంప్లెక్స్ హెచ్ఎంలను సెంటర్ ఇన్చార్జులుగా నియమించాం. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉపాధ్యాయులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉపాధ్యాయులందరికీ ప్రీటెస్టు, అంతిమ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. హాజరు కూడా ఆన్లైన్ ద్వారా ఉదయం శిక్షణా కేంద్రానికి 9:30 గంటల్లోపు వచ్చిన వారిని నమోదు చేస్తారు. జియో కార్డినల్ ద్వారా తమ మొబైల్ నుంచి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన అనంతరం ఆన్లైన్ ద్వారానే వారి మొబైల్‌కు పార్టిసిఫేషన్ సర్టిఫికెట్ అందుతుంది. – శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ రేపటి నుంచి 17 వరకు మొదటి దశ ఒక్కో టీచర్‌కు ఐదురోజులపాటు.. మరో రెండు విడతలు కూడా.. ఇప్పటికే డీఆర్పీలకు శిక్షణ పూర్తి -
మధ్యాహ్నభోజన పథకాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో ‘అక్షయపాత్ర’కు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించడాన్ని వెనక్కితీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. ఆ దివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజన పథకం కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 20ఏళ్లుగా మ ధ్యాహ్నభోజన కార్మికులు బిలులు సకాలంలో రాకపోయినా విద్యార్థులకు వంటచేసి పెడుతున్నారని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14న లెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
దుగ్గొండి: గిర్నిబావి– దుగ్గొండి ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే వారు సబ్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగిన సమయంలో కొంతమంది ద్విచక్ర వాహనాలు సమీపంలో ఉన్నాయి. యువకులు చాకచక్యంగా వాహనాలను బయటికి తెచ్చారు. దీంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఏఈ ప్రత్యూషను వివరణ కోరగా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇన్స్‌లేటర్ పగిలిపోవడంతో మంటలు అంటుకున్నాయని, మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఆదివారం తెలిపారు. -
కళల విశిష్టతను నలువైపులా చాటాలి
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతి, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకా డమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళావికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సూ త్రపు అభిషేక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో వంద మందికిపైగా కళాకా రులు పాల్గొన్నారు. -
వీర జవాన్లకు ఘన నివాళి
వర్ధన్నపేట: ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన జవాన్లు మురళీనాయక్, సచిన్యాదవ్కు వర్ధన్నపేటలో బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి వివేకానంద విగ్రహం వరకు వీరజవాన్ల ఫొటోలతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులు, జాతీయ జెండాలను పట్టుకుని బీజేపీ నాయకులు, యువకులు వేర్వేరుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ పహల్గామ్ దాడికి దీటుగా జవాబిచ్చిన భారత్ సత్తా ఏమిటో ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, ఇందుకు ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇవ్వడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. పాకిస్థాన్ కుట్రలు ప్రపంచ దేశాలకు అర్థమయ్యాయని వివరించారు. కొండేటి అనిత, కొండేటి సత్యం, రాయపురం కుమారస్వామి, శ్రవణ్, కర్ర సోమిరెడ్డి, బొంపెల్లి దేవేందర్‌రావు, వడ్లకొండ సందీప్, నాంపల్లి యాకయ్య, గిరిప్రసాద్, కొండేటి బాబు, మల్లెపాక అనిల్, ఎలిషా, రాకేష్, మహాంత్, వినోద్, సంపత్, సుభాష్, శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్ రోడ్లకు మహర్దశ
స్పెషల్ రిపేర్స్, బీటీ, నిర్మాణాలకు పెద్దపీట ● మరమ్మతులు, కొత్త రోడ్లపై తారుకు నిధులు ● ఐదు జిల్లాల్లో 62రోడ్లకు రూ.69.33 కోట్లు... ● ఆన్లైన్లో టెండర్లు పిలిచిన పంచాయతీరాజ్ శాఖ ● ఈనెల 17తో ముగియనున్న ప్రక్రియసాక్షిప్రతినిధి, వరంగల్ : ● వరంగల్ జిల్లా గీసుకొండ నుంచి మొగిలిచర్ల ఎక్స్‌రోడ్డు వరకు రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం రూ.1.57 కోట్లతో అంచనా వేశారు. రూ.1,22,93,509లకు ఆన్లైన్ టెండర్ పిలువగా ఈనెల 17న గడువు ముగుస్తుంది. ● హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం జెడ్పీ రోడ్డు నుంచి అలియాబాద్ ద్వారా కామారెడ్డిపల్లి వరకు రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు రూ.2 కోట్లతో అంచనాలు పంపారు. ప్రభుత్వం రూ.158,09,702లకు పరిపాలన అనుమతి ఇవ్వగా ఆన్లైన్ టెండర్ ద్వారా ఈనెల 17 తర్వాత పనులు ఖరారు చేయనున్నారు. ● మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ నుంచి బెరువాడ పీఆర్ రోడ్డు (మంచతండా) వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1,25,48,271లతో టెండర్లు పిలువగా, ఈనెల 15 వరకు ఆన్లైన్లో దాఖలుకు అవకాశం ఉంది. .. ఇలా ఉమ్మడి వరంగల్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు జిల్లాల్లో పాత రోడ్లకు స్పెషల్ రిపేర్స్, అత్యవసర మరమ్మతులు, మట్టి రోడ్లపై తారు వేయడంతో పాటు రోడ్డులేని గ్రామం లేకుండా కొత్తరోడ్లు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.69.33 కోట్లతో 62 రోడ్లకు గత నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు పంచాయతీరాజ్ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం నుంచి టెండర్లు పిలిచారు. ఈనెల 8 నుంచి 17 తేదీ వరకు టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు. మానుకోటకు పెద్దపీట గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు పలు ప్రాంతాల్లో మరమ్మతులకు నోచుకోకపోగా.. మళ్లీ వర్షాకాలం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు స్పిల్ఓవర్ పనులకు ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. 62 రోడ్లపై సుమారు రూ.75 కోట్ల మేరకు అవసరం ఉంటుందని ఎస్టిమేట్స్ రూపొందించగా, రూ.69.33 కోట్లు విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో 15 రోడ్లకు రూ.5.92 కోట్లు కేటాయించగా, ములుగు 11 రోడ్లకు రూ.17.10 కోట్లు, జేఎస్ భూపాలపల్లికి ఐదు రోడ్లకు రూ.7.61 కోట్లు, వరంగల్ 10 రోడ్లకు రూ.9.20 కోట్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 21 రోడ్లకు రూ.27.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా విడుదలైన సుమారు రూ.69.33 కోట్లలో మానుకోటకు పెద్దపీట లభించింది. -
కళల విశిష్టతను నలువైపులా చాటాలి
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతిని, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సూ త్రపు అభిషేక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో నగరానికి చెందిన కళాకారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వందకుపైగా కళాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ప్రదర్శించిన సంగీత, నృత్యాలు అలరించాయి. అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ -
రైతులకు వెంటనే పరిహారం అందించాలి
న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూములు అందించిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి భూములు అందించిన రైతులకు పరిహారం చెల్లింపు, పురోగతి, దామెర చెరువు సుందరీకరణ, పైడిపల్లిలో స్పోర్ట్‌సిటీ ఏర్పాటు, నర్సంపేట ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి శంకర్ ఆస్పత్రి పర్యవేక్షకులు మోహన్‌దాస్ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈవీఎం గోదాంల పరిశీలనవరంగల్: ఏనుమాముల వ్యవసాయమార్కెట్ యార్డులో భద్రపర్చిన ఈవీఎంల గోదాంలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి శనివారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం రికార్డులు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, నాయబ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు.నర్సంపేట ఏసీపీగా రవీందర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణనర్సంపేట: నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏసీపీగా పనిచేసిన కిరణ్‌కుమార్ డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా.. ఖమ్మం సీసీఆర్బీలో ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్‌రెడ్డికి నర్సంపేట పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ప్రజావాణి రద్దున్యూశాయంపేట: కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనాపరమైన కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు, ఈవిషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె కోరారు.పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతిరాయపర్తి: పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలుకపల్లి యాకయ్య కొట్టం పక్కనే దుక్కిటెద్దును కట్టేశాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వర్షంతో కూడిన పిడుగు పడి రూ.65 వేల విలువైన దుక్కిటెద్దు మృతి చెందింది.నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులకు అవార్డులునర్సంపేట: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రీజియన్ మేనేజర్ విజయభాను ఆధ్వర్యంలో నాలుగో త్రైమాసిక ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవాన్ని శనివారం తొర్రూరు డిపోలో నిర్వహించారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన ఉద్యోగులు హరిసింగ్, ఎన్ఎన్.రావు, ఎస్ఎస్.పాణి, పీవీ రావు, మహేశ్ అవార్డులు అందుకున్నారు. ఇంధన పొదుపు, డిపో ఆదాయం పెంచినందుకు జ్ఞాపికలు, క్యాష్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి అవార్డులు అందుకున్న ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మిగతా ఉద్యోగులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, మహేశ్‌కుమార్, నర్సంపేట డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతోష్, ఎంఎఫ్ ప్రభాకర్, సేఫ్టీ వార్డెన్బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయు రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తరువాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్‌కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అందాలభామలను అబ్బురపరిచేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
ఆశయానికి ‘అమ్మ’ అండ..
ఎవరెస్టు కన్నా ఎత్తయినవి ఆమె ఊహా శిఖరాలు. సిందూరంకన్నా ఎరుపెక్కినవి ఆమె హృదయ జ్వాలలు. తనువును మోస్తున్న నేలకు, ఊపిరిలూదిన గాలికీ.. స్వేచ్ఛావాయువుల్నిచ్చిన భరత భూమికి సేవ చేయాలన్నదే ఆ తల్లుల సంకల్పం. అందుకనుగుణంగా వారి బిడ్డలను తీర్చిదిద్దారు. నిలువెల్లా దేశభక్తిని నూరిపోశారు. దేశసేవ కోసం సైన్యంలోకి పంపించిన ఓరుగల్లు మాతృమూర్తులే ఒక సైన్యం. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా దేశ సేవకు బిడ్డలను పంపిన పలువురు తల్లులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి ..స్టేషన్‌ఘన్‌పూర్ : ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి కోరిక మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది.ఆశయానికి ‘అమ్మ’ అండ..జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్ (వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సిందూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నొదుటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు.పుష్కరాలకు పోలీసు సైన్యం..ఈ నెల 15 నుంచి జరగనున్న సరస్వతి నది పుష్కరాల్లో 1,678 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. -
బిడ్డకు ఆశీర్వాదం
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తుంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టాలి’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్‌రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్‌రెడ్డి.. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా కశ్మీర్‌కు బయలు దేరాడు. 2005లో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్‌కు ఎంపికై న వెంకట్‌రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్‌లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభాగంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అసోంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్‌తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుక్కు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భాష్పాలతో నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. -
నెరవేరనున్న దశాబ్దాల కల
నర్సంపేట: రైతుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరనుంది. చెన్నారావుపేట గ్రామ శివారులోని పాకాల వాగుపై చెక్‌డ్యాం, వంతెన, రోడ్డు మంజూరయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురం గ్రామానికి చెందిన ఏ–వన్ కాంట్రాక్టర్ సుధీర్‌రెడ్డి టెండర్లో దక్కించుకున్నారు. శనివారం పాకాల వాగు పరిసరాలను ఇటాచీ సాయంతో శుభ్రం చేయించారు. కొద్ది రోజుల్లోనే ఈ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. సమీప గ్రామాల ప్రజ లు పాకాల వాగు దాటి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందులను ఎదుర్కొనే వారు. వర్షాకాలంలో ఈ వాగు దాటుకుంటూ వెళ్లిన పలువురు కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటనలు సైతం ఉన్నాయి. పాకాల వాగుపై వంతెన నిర్మించాలని రైతులు, గ్రామస్తులు అనేక పోరాటాలు సైతం చేపట్టారు. చెక్ డ్యాం, వంతెన, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్న విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు, గ్రామస్తులు, హర్షం వ్యక్తం చేశారు. పాకాల వాగుపై చెక్‌డ్యాం, వంతెన, రోడ్డు మంజూరు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పనులు ప్రారంభించనున్న కాంట్రాక్టర్ -
ఆర్మీలో ఉద్యోగం నా కల
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకాశ్మీర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట