కళల విశిష్టతను నలువైపులా చాటాలి
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతిని, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో సూ త్రపు అభిషేక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో నగరానికి చెందిన కళాకారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వందకుపైగా కళాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ప్రదర్శించిన సంగీత, నృత్యాలు అలరించాయి.
అన్నమాచార్య అకాడమీ
వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్


