నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు
హనుమకొండ కలెక్టరేట్‌లో..
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రామన్నపేట: కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన బలభక్తుల శ్రీహరి మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాశ్వత ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్‌గౌడ్, ట్రెజరర్ లక్ష్మి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. బలభక్తుల శ్రీహరి ప్రస్తుతం బాలసముద్రంలోని ఎల్‌ఐసీ డివిజనల్ ఆఫీస్‌లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్‌ఐసీ జోనల్, ఆలిండియా పోటీలలో కూడా శ్రీహరి అనేక పతకాలు సాధించారు.
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ ఆదివారం ముగిసిందని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో (శని, ఆదివారం) శిబిరం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 200 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్


