
బాల్య వివాహం అడ్డగింత
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధి లోని న్యూశాయంపేట ప్రాంతంలో ఆదివారం ఓ కల్యాణ మండపంలో బాలికకు వివాహం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివా హం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
అత్యాధునిక వసతులతో
రైల్వే స్టేషన్
ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయడం అభినందనీ యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేష న్‌ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూ రి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్‌ను ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ పర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్‌గౌడ్, బన్న ప్రభాకర్, ఎరుకుల రఘనారెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, గోకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
వంకాయ రైతు ఆగ్రహం
పరకాల: ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలను పరకాల మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచిని పర్తి గ్రామానికి చెందిన రైతు సదయ్య వంకా యలను ఆదివారం అమ్మకానికి తెచ్చాడు. అయితే ఉదయం కిలో రూ.25 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు.. కాస్త ఆలస్యంగా వచ్చిన సదయ్య వద్ద కిలో రూ.10 చొప్పున కొంటామని చెప్పడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. మార్కెట్‌లో కిలో రూ.60 అమ్ముతుండగా.. వ్యాపారులు రైతుల నుంచి రూ.10కి కొంటామని చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతు మీరిచ్చే ధర కనీసం కూలీలకు కూడా సరిపోదని మండిపడుతూ మార్కెట్‌లో ఉన్న పశువుల మేతకు వంకాయలను పారబోశాడు.

బాల్య వివాహం అడ్డగింత

బాల్య వివాహం అడ్డగింత