నేడు కాకతీయ వారసుడి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కాకతీయ వారసుడి రాక

May 20 2025 12:59 AM | Updated on May 20 2025 12:59 AM

నేడు

నేడు కాకతీయ వారసుడి రాక

హన్మకొండ: కాకతీయ 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ మంగళవారం వరంగల్‌ పర్యటనకు వస్తున్నారని టార్చ్‌ కార్యదర్శి అరవింద్‌ ఆర్య తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగట్టలోని టూరిజం హోటల్‌ హరిత కాకతీయలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సైన్స్‌ కోర్సు పీహెచ్‌డీ

తరగతుల పరిశీలన

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్‌ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్‌డీ కోర్సు వర్క్‌లో భాగంగా క్యాంపస్‌లోని గణితశాస్త్ర విభాగం సెమినార్‌ హాల్‌లో నిర్వహిస్తున్న కామన్‌ టాపిక్స్‌ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్‌ మెట్రిక్స్‌, ప్లగరిజం, టెక్నికల్‌ రిపోర్ట్‌ రైటింగ్‌ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగం అధిపతి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్‌ వెంట ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్‌ ఎల్‌పీ.రాజ్‌కుమార్‌ ఉన్నారు.

జీఎంహెచ్‌లో ప్రత్యేక విభాగం

హన్మకొండ చౌరస్తా/ఎంజీఎం: గర్బిణుల నమోదు, ప్రసవాల శాతం పెంచేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, జీఎంహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్‌ చాంబర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, జీఎంహెచ్‌ సిబ్బంది వైద్యులకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేక సెల్‌ ఉంటుందని చెప్పారు. అందుకు ముగ్గురు మహిళా పబ్లిక్‌ హెల్త్‌ అధికారులను డిప్యుటేషన్‌ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ గర్భిణికి మొదటి రెండు చెకప్‌లు పీహెచ్‌సీ డాక్టర్‌ వద్ద, మూడు, నాలుగు చెకప్‌లకు హనుమకొండలోని జీఎంహెచ్‌ తప్పనిసరి వచ్చేలా కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మంజుల, పీహెచ్‌ఎన్‌లు లీల, సుందరి, హెచ్‌ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

23న జాబ్‌ మేళా

హన్మకొండ అర్బన్‌: నిరుద్యోగులకు ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో వరంగల్‌, హనుమకొండలో సేల్స్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

అట్రాసిటి కేసు విచారణ

అధికారిగా ఏసీపీ తిరుపతి

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌పై ఆదివారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచారయత్నం కేసు విచారణ అధికారిగా మామునూరు ఏసీపీ తిరుపతిని నియమిస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును సమగ్రంగా, పాదర్శకంగా విచారించాలని ఆదేశించారు.

‘భద్రకాళి’ని దర్శించుకున్న

హైకోర్టు జడ్జి

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాన తన కుటుంబ సమేతంగా అమ్మవారిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని మేడ్చ ల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

వేయిస్తంభాల ఆలయంలో..

వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నందికొండ నర్సింగరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు.

నేడు కాకతీయ వారసుడి రాక1
1/1

నేడు కాకతీయ వారసుడి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement