
– సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్
కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం. సరిపడేంత స్థలం లేని మెట్లు. కనిపించని వెంటిలేషన్. ఇదీ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్‌తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్‌వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్‌లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి.
గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమా దం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్‌బౌళి, మండిబజార్, పోచమ్మమైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహల్, గోపాలస్వామి గుడి, ఎల్‌బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్‌కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాల కు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికై నా మేల్కొనాల్సిందే..
భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనా లు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది.
నిబంధనలు పాటిస్తేనే..
నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవనా లు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్య ల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం జరిగినా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాల కు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ కావా లి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్‌ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది.
నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)
యథేచ్ఛగా అనుమతులు..
బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్‌ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికై నా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా మాల్‌లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వెంటిలేషన్ లేకుండా
నిర్మించిన భవనాలు అనేకం
అగ్ని ప్రమాదం జరిగితే
పొగతో ఉక్కిరిబిక్కిరే..
నాణ్యమైన విద్యుత్ పరికరాలు
వినియోగిస్తే మంచిది
హైదరాబాద్ గుల్జార్ హౌస్
ఘటనతోనైనా మేల్కొనాలి
సంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి
2022 68 28,30,55,000 2,94,15,000
2023 67 2,04,21,000 8,07,70,000
2024 63 4,05,62,250 26,54,40,000
2025 50 51,43,000 1,87,63,000

– సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్