సీఐ వెంకటరత్నంపై వేటు | - | Sakshi
Sakshi News home page

సీఐ వెంకటరత్నంపై వేటు

May 21 2025 1:04 AM | Updated on May 21 2025 1:04 AM

సీఐ వ

సీఐ వెంకటరత్నంపై వేటు

వరంగల్‌ క్రైం: వరంగల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సస్పెన్షన్‌ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్‌ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్‌ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్‌స్పెక్టర్‌ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అధికారుల్లో భయం.. భయం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్‌ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్‌కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్‌పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబు ల్‌పై వేటు వేయడం కమిషనరేట్‌లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో

ప్రచురితమైన కథనం క్లిప్పింగ్‌

సస్పెండ్‌ చేస్తూ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ

భూ వివాదం కేసులో ఎఫ్‌ఐఆర్‌లో మరణించిన వ్యక్తి పేరు నమోదు

సమగ్ర వివరాలతో కథనం

ప్రచురించిన ‘సాక్షి’

మర్డర్‌ కేసులోని నిందితురాలిపై మిల్స్‌కాలనీ సీఐ లైంగిక వేధింపులు

సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు

అవినీతి అధికారుల్లో భయం.. భయం

లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు..

మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్‌ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్‌స్పెక్టర్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్‌కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌.. సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

సీఐ వెంకటరత్నంపై వేటు1
1/2

సీఐ వెంకటరత్నంపై వేటు

సీఐ వెంకటరత్నంపై వేటు2
2/2

సీఐ వెంకటరత్నంపై వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement