‘న్యాక్’కు సిద్ధం కావాలి
కేయూ క్యాంపస్: నూతన గ్రేడింగ్ సిస్టంకు అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు న్యాక్‌కు సిద్ధం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.షమిత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (సీఆర్‌ఐఎస్‌పీ) స్వచ్ఛంద సంస్థ వారి సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అప్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎక్స్‌లెన్స్ (చెక్)లో భాగంగా ఓయూ, ఎస్‌యూతో కేయూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఐక్యూఏసీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 22 కళాశాలల ప్రతినిధులతోను వీసీ మాట్లాడారు. మారుతున్న సూచనలకు అనుగుణంగా కళాశాలలు డేటా బేస్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్‌లో వస్తున్న మార్పులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, అకడమిక్ మెంటార్ డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ అచ్యుతాదేవి, సీఆర్‌ఐఎస్‌పీ స్టేట్ లీడ్ డాక్టర్ కె.రమ, ఆచార్య లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు.
వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
వరంగల్ అర్బన్: నగరంలో వీధి దీపాలు,సెంట్రల్ లైటింగ్ నిర్వహణ పక్కాగా కొనసాగాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లైటింగ్ నిర్వహణలో బ్లాక్‌స్పాట్ల గుర్తింపుతోపాటు అందుకు అవసరమైన సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఉన్న 83,750 వీధి దీపాలు వెలగాలని, విలీన గ్రామాల్లో అంధకారం లేకుండా పర్యవేక్షించాలన్నారు. నీటి సరఫరా తీరును సమీక్షించిన మేయర్.. ప్రతి ఇంటికి నీటి సరఫరా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టాలని పేర్కొన్నారు. నీరు అందని చివరి ఏరియాలు, నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్ బాబు, మాధవీలత, డీఈ కార్తీక్‌రెడ్డి, ఏఈ సరిత తదితరులు పాల్గొన్నారు.
అవయవదానంతో
ఆరుగురికి పునర్జన్మ
● అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి
వర్ధన్నపేట : పట్టణ పరిధిలోని నీలగిరిస్వామి తండాకు చెందిన బానోతు రమణ అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ ఇచ్చాడని తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రమణ నివాసం వద్ద శుక్రవారం నిర్వహించిన సంస్మరణ సభలో ఉపేందర్‌రెడ్డి మాట్లాడారు. రమణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బ్రెయిన్ డెడ్ కాగా జీవన్ దాన్ వైద్యులు, సిబ్బంది సూచన మేరకు బాధిత కుటుంబీకులు రమణ అవయవదానానికి ముందుకొచ్చారని చెప్పారు. అవయవదానంపై సమాజంలోని ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకుని చైతన్యవంతం కావాలని కోరారు. రమణ తల్లిదండ్రులు బానోత్ విజయ దేవేందర్‌లను సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షురాలు మునగాల పద్మ, ప్రధాన కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఆర్‌ఎంపీ వైద్యుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కమలాపూర్: హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (కేఎల్‌బీ ఐఐహెచ్‌టీ) కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకుడు కె.జయరావు తెలిపారు. కేఎల్‌బీఐఐ హెచ్‌టీలోని డిప్లొమా కోర్సుల ఉపాధి అవకాశాలపై కమలాపూర్ చేనేత సహకార సంఘంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘న్యాక్’కు సిద్ధం కావాలి


