
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నెక్కొండ: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విత్తన టాస్క్‌ఫోర్స్ బృందం ఏడీఏ దా మోదర్‌రెడ్డి, నెక్కొండ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల షాపులను వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విత్తన స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్స్, విత్తన నిల్వలు, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసా య, పోలీసు శాఖ సమన్వయంతో నకిలీ విత్తనాలను అరికట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతుకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత మ నందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సై మహేందర్, వ్యవసాయ అధికారులు టి.కృష్ణ, సీహెచ్ గోపాల్‌రెడ్డి, నాగరాజు, షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
శిక్షణతో మెరుగైన బోధన
ఖానాపురం: మెళకువలతో విద్యార్థులకు బోధించాలని శిక్షణ కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ బొమ్మెర కుమారస్వామి అన్నారు. బుధరావుపేట మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో వినియోగించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. శిక్షణ ద్వారా విద్యార్థులకు మెరుగైన, సులభమైన విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, ఆర్పీలు వాగ్యా, కిరణ్, భిక్షపతి, శ్రీనివాస్, చంద్రమౌళి, సారయ్య, ఎమ్మార్సీ సిబ్బంది శశిధర్, రాజేందర్, మహేందర్, రజిని, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఆరుగురికి తీవ్ర గాయాలు
వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేటలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..తొర్రూరుకు చెందిన ఎర్ర అశోక్ తన స్విఫ్ట్ కారులో రాయపర్తి వైపు నుంచి వర్ధన్నపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వర్ధన్నపేట ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాల సమీపంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి వద్ద కారు ముందు టైరు పగిలిపోయింది. దీంతో అదుపు తప్పి రాయపర్తి వైపు వెళ్తున్న ఆటోతోపాటు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన రామారపు రాములు,వర్ధన్నపేటలోని నీలగిరి స్వామి తండాకు చెందిన బానోత్ పద్మ, ఏఎన్‌ఎం వజ్జాల మంగతాయారు, బైక్‌లు నడుపుతున్న డీసీ తండాకు చెందిన బానోత్ నరేశ్, సపావట్ దశరథం, పెద్దవంగరకు చెందిన మార్గం సతీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురితోపాటు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఒత్తిడికి గురికాకుండా
పరీక్షలు రాయాలి
● స్ఫూర్తి కార్యక్రమంలో డీఈఓ
మామిడి జ్ఞానేశ్వర్
విద్యారణ్యపురి: ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ కోరారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాల విద్యార్థులకు మట్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలా చదివి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కావాలో ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీజీ కె.అరుణ, స్ఫూర్తి కార్యక్రమం ఇన్‌చార్జ్ మల్లారెడ్డి, ఎంఈఓ గంప అశోక్‌కుమార్, హెచ్‌ఎం వెంకన్న, ఉపాధ్యాయుడు దేవులపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిబిరం పరిశీలన
పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ పరిశీలించారు. 15 రోజులుగా నిర్వహిస్తున్న శిబిరం బుధవారం ముగిసింది. విద్యార్థులకు క్రీడాపోటీలు, యోగా, నృత్యం తదితర అంశాల్లో వలంటీర్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. వలంటీర్ యాకూబ్, భరతనాట్యం గురువు శశాంక్, జూడో కోచ్ వీరస్వామి, ఆర్ట్ క్రాఫ్ట్ వలంటీర్ సర్వత్‌బేగం, విద్యార్థులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు