
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆత్మకూరు: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వివరాలు, సిబ్బంది హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మండలంలోని తిరుమలగిరిలో నిర్మించిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్ని పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూలీలకు రూ.307 వచ్చేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. ఐకేపీలో యూనిఫామ్ కుడుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గుడెప్పాడ్‌లో ఈజీఎస్‌లో సాగుచేస్తున్న అజోల్లా సాగును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఈజీఎస్ పనుల్ని రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్‌సీ సిబ్బంది రోగులకు అవసరమైన సేవలను జాప్యం లేకుండా అందించాలన్నారు. గ్రామాల్లో చెత్తసేకరణను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మహిళలు కుట్టు పనిపై శ్రద్ధ వహించాలని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ, ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ స్వాతి, ఏపీఓ రాజిరెడ్డి, డీపీఎం ప్రకాశ్, ఏపీఎం లలిత తదితరులు పాల్గొన్నారు.
అర్హుల ఎంపిక త్వరగా పూర్తి చేయండి..
హన్మకొండ అర్బన్: రాజీవ్ యువ వికాస ం పథకం అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజీవ్ యువ వికాసం, ఉపాధి హామీ పథకాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 10,565 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి తుది జాబితా అందించాలన్నారు. ఉపాధిపథకం ద్వారా 7,675 పని దినాలకు ఇప్పటి వరకు 3,645 పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ డీడీ రవీందర్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎల్‌డీఎం శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అంగన్‌వాడీల్లో చేపట్టిన పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి పథకం ద్వారా 24 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పీఆర్ ఈఈ ఆత్మరావు, ఈఈ నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య