
సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేయాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట రూరల్: సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. గురిజాల గ్రామ రైతువేదికలో శనివారం జరిగిన శ్రీరైతు ముగింట్లో శాస్త్రవేత్తలుశ్రీ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులతో మనకు కావాల్సిన ఆహార ధాన్యాలను పండించుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు వాడడం భూములకు మంచిదికాదన్నారు. అనంతరం రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు అందించారు. ఆదర్శ రైతులు కరుణాకర్, రామారావు, రవీందర్‌రెడ్డిని ఎమ్మెల్యే మాధవరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఏఓ కృష్ణకుమార్, ఏఈఓలు అశోక్, శ్యాం, రైతులు తదితరులు పాల్గొన్నారు.