
దాహం.. దాహం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
నర్సంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా తాగునీటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా నర్సంపేట పట్టణంలో 40 శాతం మంది ప్రజలకు కూడా స్వచ్ఛమైన నీరు అందడం లేదు. అదనపు నిధులు కేటాయించి పనులు చేయాలంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దీంతో ప్రతీ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య జఠిలంగానే మారుతోంది. నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇటీవల అదనంగా మరికొన్ని గ్రామాలు విలీనమయ్యాయి. 55 వేల నుంచి 60 వేలకు జనాభా పెరిగింది. ప్రతీ రోజు నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో సరైన ప్రణాళికలు లేక 40 శాతం ప్రజలకు రంగు నీరే సరఫరా అవుతోంది. పట్టణ శివారు కాలనీల ప్రజలు ఇప్పటికీ చేదబావుల నుంచి నీటిని తోడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందంటే అభివృద్ధిపై అధికారుల అలసత్వం కనిపిస్తోంది.
ప్రతిరోజూ నీరందాలంటే..
పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన ప్రతిరోజూ నీరందాలంటే అశోక్‌నగర్ గ్రామ శివారులోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టు సమస్యలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి పట్టణ ప్రజలకు తాగునీరు అందించాలని ప్రతిపాదనలను సిద్ధం చేయించి ఉన్నతాధికారులకు పంపించారు. అయినప్పటికీ ఈ వేసవి కాలంలో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు.
అభివృద్ధి పనుల్లో ఆలస్యం..
తాగునీరు అందించేందుకు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 నుంచి రూ.30 కోట్ల నిధులతో సర్వాపురంలో చేపట్టిన ట్యాంకు నిర్మాణ పనులు 40 శాతమే పూర్తికావడంతో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. శాంతినగర్‌లో చేపట్టిన మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణ పనులది కూడా అదే పరిస్థితి. మరో రెండు నెలల్లో ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
న్యూస్‌రీల్
గొంతు తడపని మిషన్ భగీరథ
నర్సంపేటలో రెండు రోజులకోసారి నీటి సరఫరా
వేసవిలో పట్టణ ప్రజలకు తప్పని తిప్పలు
డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు డీలా..
నత్తనడకన అమృత్ పనులు
పల్లెల్లోనూ ఇదే పరిస్థితి..
గ్రామపంచాయతీల పరిధిలో కూడా తాగునీటి సమస్య ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. నిధుల కొరత ఉండడంతో పంచాయతీల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామపంచాయతీ శివారులోని నర్సింగాపురం గ్రామంలో ఆదివారం మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. సీడీఎఫ్ నిధులతో వేసిన బోరును కేసింగ్ సరిగా వేయకపోవడంతో మూడు నెలలకే కూలిపోయింది. అధికారులు బోరును మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
మిషన్ భగీరథ పైపులైన్ నీరు ప్రధాన రోడ్ల వెంట కొంత వరకే సరఫరా అవుతోంది. కాలనీ చివరి వరకు తక్కువ నీరే వస్తోంది. ప్రతీ వేసవిలో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. పేదల దాహం తీర్చేందుకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందించాలి.
– జన్ను జమున, మార్క్స్ కాలనీ నర్సంపేట
సమస్య పరిష్కారం కావడం లేదు
తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా మల్లంపల్లి రోడ్డులోని కాలనీల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నీరు కాలనీకి రావడం లేదు. ప్రజలు చేదబావి ద్వారానే ఇప్పటికీ నీటిని తోడుకొని తాగాల్సిన పరిస్థితి నెలకొంది.
– వంగల రాగసుధ, గాంధీనగర్ నర్సంపేట

దాహం.. దాహం

దాహం.. దాహం

దాహం.. దాహం

దాహం.. దాహం

దాహం.. దాహం

దాహం.. దాహం

దాహం.. దాహం