
అర్జీలను వెంటనే పరిష్కరించండి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణిలో మొత్తం 128 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూ 54, హౌసింగ్ మున్సిపాలిటీ 7, మిగతా శాఖలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తాగునీటి సమస్య తదితర అంశాలపై యంత్రాంగం నిబద్ధతతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, వరంగల్ తహసీల్దార్ ఎక్బాల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్టేషనరీ షాపు ఇప్పించండి..
నర్సంపేటలోని నర్సింగ్ కళాశాల ఆవరణలో స్టేషనరీ, జిరాక్స్ షాప్ పెట్టుకుని జీవించేందుకు అనుమతి ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నా.
– దివ్యాంగుడు సుమన్, కొత్తపేట, ఏనుమాముల
కలెక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ

అర్జీలను వెంటనే పరిష్కరించండి