
వీర జవాన్లకు ఘన నివాళి
వర్ధన్నపేట: ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన జవాన్లు మురళీనాయక్, సచిన్‌యాదవ్‌కు వర్ధన్నపేటలో బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి వివేకానంద విగ్రహం వరకు వీరజవాన్ల ఫొటోలతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులు, జాతీయ జెండాలను పట్టుకుని బీజేపీ నాయకులు, యువకులు వేర్వేరుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ పహల్గామ్ దాడికి దీటుగా జవాబిచ్చిన భారత్ సత్తా ఏమిటో ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, ఇందుకు ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇవ్వడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. పాకిస్థాన్ కుట్రలు ప్రపంచ దేశాలకు అర్థమయ్యాయని వివరించారు. కొండేటి అనిత, కొండేటి సత్యం, రాయపురం కుమారస్వామి, శ్రవణ్, కర్ర సోమిరెడ్డి, బొంపెల్లి దేవేందర్‌రావు, వడ్లకొండ సందీప్, నాంపల్లి యాకయ్య, గిరిప్రసాద్, కొండేటి బాబు, మల్లెపాక అనిల్, ఎలిషా, రాకేష్, మహాంత్, వినోద్, సంపత్, సుభాష్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.