వడదెబ్బతో ఇద్దరి మృతి
గీసుకొండ: మండలంలోని గంగదేవిపల్లి, కొమ్మాల గ్రామాలకు చెందిన ఇద్దరు కూలీలు వడదెబ్బతో వేర్వేరుగా మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గంగదేవిపల్లిలో వ్యవసాయ కూలీ ఇట్ట నాగరాజు(35) 15రోజుల నుంచి పసుపు ఉడకబెట్టే పనులు చేస్తున్నాడు. గురువారం వడదెబ్బతో ఇంటి వద్దనే మంచంలో కూర్చుని స్పృహ కోల్పోయి మృతి చెందాడు. అలాగే కొమ్మాలలో ఈర్ల సారయ్య(68)అనే గృహనిర్మాణ కూలీ ఎండలో పనులు చేసి వడదెబ్బతో బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
వడదెబ్బతో ఇద్దరి మృతి


