వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు
● ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం దరఖాస్తులు 151 వచ్చాయి. వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 82, జీడబ్ల్యూఎంసీకి 30, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్‌డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అక్రమ పట్టాను రద్దు చేయాలి
మా కోడలు మా భూమిని అక్రమంగా పట్టా చేసుకుంది. దాన్ని రద్దు చేయాలి. మా కుమారుడు చనిపోవడంతో ఆయన ఉద్యోగాన్ని అనుభవిస్తూ మా బాగోగులు చూసుకోకుండా మా భూమిని పట్టా చేసుకుంది.
– అయిలయ్య దంపతులు, గుండ్రపల్లి, నెక్కొండ
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు


