ఆగుతూ.. సాగుతూ
సాక్షిప్రతినిధి, వరంగల్ :
రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్‌ది ప్రత్యేక స్థానం. హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన మహానగరమిది. ఈ జిల్లాలో గడిచిన ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయి.. వస్తున్నాయి. వచ్చినవాటిలో కొన్ని ఆగగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. మరింత ముందడుగు పడి.. పనుల్లో వేగం, పారదర్శకత పెరిగితే 2026లో ఓరుగల్లు తెలంగాణ సిగలో మెరవనుంది.
‘గ్రేటర్’లో పనుల సందడి
హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది ఒకేసారి రూ.4,962.47 కోట్లు కేటాయించింది. ఇందులో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ (రూ. 4,170 కోట్లు), మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ (రూ. 205 కోట్లు) వంటివి ఉన్నాయి. పద్మాక్షిగుట్ట, ఎన్జీఓస్ కాలనీల్లో లైటింగ్, గ్రీనరీ, డ్రెయినేజీ పనులు ఉన్నాయి, ముఖ్యంగా గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయ అభివృద్ధికి దశల వారీగా సుమారు రూ.40 కోట్ల వరకు కేటాయించారు. భద్రకాళి ఆలయానికి కొత్తశోభ వచ్చేలా మధురై తరహాలో మాఢవీధుల నిర్మాణం పనులకు డిజైన్ చేశారు.
డీపీఆర్ దశలో యూజీడీ
వరంగల్ నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటు కీలక ప్రాజెక్ట్. ప్రభుత్వం ఇప్పటికే రూ.4,170 కోట్ల నిధులను కేటాయించగా, పనులకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. యూజీడీ పూర్తయితే నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం, వరద నియంత్రణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది. దీనికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతుండగా.. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రజాప్రతినిధులు అంటున్నారు.
ఊసే లేని మెట్రో రైలు...
2025లో ఓరుగల్లు మెట్రోరైలు ఊసే రాలేదు. కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ మహానగరంలో మెట్రో నియోరైలు తీసుక రావడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కూడా 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరింది. ఏటా బడ్జెట్ సమయంలో తెరమీదకు వచ్చే ఈ ప్రాజెక్టు పేరు ఈ ఏడాది అసలే లేదు.
ఔటర్ రింగ్‌రోడ్డు త్వరలోనే....
వరంగల్ నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంది. దీనికి రూ. 669 కోట్లను మంజూరు చేశారు. ఔటర్ రింగు రోడ్డు పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. టెక్స్‌టైల్ పార్కు స్థలంలోనే ఈ శిలాఫలకం కూడా వేశారు. ఆ తర్వాత చాలాకాలం పనులు నిలిచిపోగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై మళ్లీ దృష్టి సారించింది.
ఐటీలో అనుకున్నంత లేని ఊపు..
2016లో ఐటీ పార్కును మడికొండ (రాంపూర్)లో ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. సయాంట్, జెన్‌ప్యాక్ట్, క్వాడ్రంట్ రిసోర్సెస్‌తో పాటు సాఫ్ట్‌పాత్ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ సిఫీతో పాటు మరో రెండు.. ఏడాది క్రితం ఎంఓయూ కుదుర్చుకున్నా.. గతంలో తెరిచిన సంస్థలు తప్ప కొత్తగా వచ్చింది లేదు.
హనుమకొండ జిల్లాలో అభివృద్ధి పనులు..
హనుమకొండ జిల్లాలో రైల్వే లైన్ విస్తరణ, స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి. అనేక కొత్త ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.
● ముఖ్యంగా హసన్‌పర్తి–వరంగల్ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, వరంగల్ ట్రై సిటీ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
● కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
● కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)
ఆధ్వర్యంలో భూముల వేలం, రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకం, జంక్షన్లు, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
● భీమదేవరపల్లి మండలం వంగరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు వేగంగా నడుస్తున్నాయి.
● దామెర మండలం ఊరుగొండ మీదుగా హనుమకొండ జిల్లాలో ఎన్‌హెచ్ 163ఎలో 4–లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి.
మడికొండలోని
ఐటీ హబ్
ఇంటర్నల్
రింగ్ రోడ్డు
కొనసాగుతున్న
వరంగల్ నూతన బస్టాండ్ పనులు
ఏడాదికాలంలో తడబడుతూ.. పరిగెడుతూ..
‘గ్రేటర్’ అభివృద్ధికి ప్రత్యేక నిధులు..
‘స్మార్ట్‌సిటీ’, ‘అమృత్’తో పనులు
సుందరనగరం కోసం పరుగులు..
‘కుడా’, జీడబ్ల్యూఎంసీ నిధులు
డీపీఆర్ దశలో యూజీడీ..
‘ఔటర్’ పూర్తయితే మహర్దశ
పారదర్శకత, పనుల్లో వేగం పెరిగితే 2026లో మరింత పురోగతి
ఆగుతూ.. సాగుతూ
ఆగుతూ.. సాగుతూ
ఆగుతూ.. సాగుతూ


