ఇంకా ఆలస్యమే.. | - | Sakshi
Sakshi News home page

ఇంకా ఆలస్యమే..

Dec 30 2025 6:55 AM | Updated on Dec 30 2025 6:55 AM

ఇంకా ఆలస్యమే..

ఇంకా ఆలస్యమే..

ఇంకా ఆలస్యమే..

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్‌ సర్వీసులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఇది పూర్తయితే ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మామునూరు

ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ

మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్‌ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది.

నింపాది పనులతో

తప్పనితిప్పలు

వరంగల్‌ పాత ఆజంజాహీ మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి.

● మూడెకరాల్లో ఐదంతస్తుల ప్రణాళికతో ‘కుడా’ పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్‌ మోడ్రన్‌ బస్టాండ్‌ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

● అమృత్‌ భారత్‌ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ను కార్పొరేట్‌ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు.

నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement