సాగు ప్రణాళిక ఖరారు | - | Sakshi
Sakshi News home page

సాగు ప్రణాళిక ఖరారు

May 17 2025 7:15 AM | Updated on May 17 2025 7:15 AM

సాగు ప్రణాళిక ఖరారు

సాగు ప్రణాళిక ఖరారు

మండలాల వారీగా సాగు విస్తీర్ణం అంచనా వివరాలు (ఎకరాల్లో)..

మండలం వరి మక్కజొన్న పత్తి ఆయిల్‌ సీడ్స్‌ పప్పు దినుసులు

భీమదేవరపల్లి 19,100 148 1700 10 40

ధర్మసాగర్‌ 16,200 1200 4,000 80 270

ఎల్కతుర్తి 15,600 300 3,700 30 70

హనుమకొండ 1,100 ––– ––– –– –––

హసన్‌పర్తి 15,300 200 3,900 10 80

ఐనవోలు 11,600 800 13,600 –– 150

కమలాపూర్‌ 20,700 200 5,800 –– 60

కాజీపేట 6,400 200 1,300 –– 50

వేలేరు 11,500 1,700 4,300 –– 50

ఆత్మకూరు 5,400 100 9,800 10 60

దామెర 3,700 200 9,700 30 10

నడికూడ 7,300 100 7,600 10 50

పరకాల 4,500 –– 5,200 –– 20

శాయంపేట 8,400 400 7,400 10 30

మండలాల వారీగా సాగు విస్తీర్ణం (ఎకరాల్లో), ఎరువుల అంచనా (మెట్రిక్‌ టన్నుల్లో)

మండలం వ్యవసాయ ఉద్యాన యూరియా డీఏపీ ఎన్‌పీకే ఎంఓపీ

విస్తీర్ణం విస్తీర్ణం

బీమదేవరపల్లి 20,950 1,600 3,044 1,128 2,819 902

ధర్మసాగర్‌ 21,750 1,500 3,139 1,163 2,906 930

ఎల్కతుర్తి 19,700 950 2,788 1,033 2,581 826

హనుమకొండ 1,100 20 151 56 140 45

హసన్‌పర్తి 19,490 1,190 2,792 1,034 2,585 827

ఐనవోలు 26,150 1,500 3,733 1,383 3,456 1,106

కమలాపూర్‌ 26,760 950 3,741 1,386 3,464 1,108

కాజీపేట 7,950 840 1,187 440 1,099 352

వేలేరు 17,550 560 2,445 906 2,264 724

ఆత్మకూరు 15,370 950 2,203 816 2,040 653

దామెర 13,640 600 1,922 712 1,780 570

నడికూడ 15,060 2,950 2,431 901 2,251 720

పరకాల 9,720 1,790 1,554 576 1,439 460

శాయంపేట 16,240 1,600 2,408 892 2,230 714

హన్మకొండ: హన్మకొండ జిల్లా సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ మేరకు వానాకాలంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు, విత్తనాలు, ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయనే అంచనాతో అధికారులు ప్రణాళిక రూపొందించారు. అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 2,31,323 ఎకరాలు కాగా ఈ వానాకాలంలో 2,31,320 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత వానాకాలంలో 2,36,691 ఎకరాలు, యాసంగిలో 1,50,660 ఎకరాల్లో సాగు చేశారు. అదేవిధంగా వానాకాలం వరి సాధారణ విస్తీర్ణం 1,46,753 ఎకరాలు కాగా.. ఈ వానాకాలంలో 1,46,800 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా. యాసంగిలో వరి 1,32,280 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి వానాకాలం సాగు సాధారణ విస్తీర్ణం 78,013 ఎకరాలు కాగా.. ఈ వానాకాలంలో 78 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత వానాకాలంలో 77,330 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5,437 ఎకరాలు కాగా.. ఈ సారి 5,400 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. నూనె గింజల సాధారణ విస్తీర్ణం 187 ఎకరాలు కాగా.. ఈ వానా కాలంలో 190 ఎకరాల్లో సాగు చేస్తారని, పప్పుదినుసుల సాధారణ విస్తీర్ణం 932 ఎకరాలు కాగా ఈసారి 930 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. వరి విత్తనాలు ఎకరాకు 25 కేజీల చొప్పున అధికారులు 36,700 క్వింటాళ్లు, మొక్కజొన్న విత్తనాలు ఎకరాకు 8 కిలోల చొప్పున 432 క్వింటాళ్లు, పత్తి ప్యాకెట్లు 1,95,000 అవసరని అధికారులు గుర్తించారు. ఆయిల్‌ సీడ్స్‌ విత్తనాలు 114 క్వింటాళ్లు, పప్పు దినుసుల విత్తనాలు 37 క్వింటాళ్లు అవసరం కానున్నాయి.

అన్ని పంటలు కలిపి

2,31,320 లక్షల ఎకరాల్లో సాగు

వరి 1,46,800, పత్తి 78 వేలు,

మొక్కజొన్న 5,400 ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement