సైలానిబాబా ఉర్సును జయప్రదం చేయాలి
దామెర: సైలానిబాబా దర్గా ఉర్సును జయప్రదం చేయాలని ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ శుక్రవారం అన్నారు. ఓగ్లాపూర్ సమీపంలోని సైలానిబాబా దర్గాలో ఉర్సు ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన ఆర్డీఓ నారాయణ ఉత్సవాలు విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పరకాల ఏసీపీ సతీశ్‌బాబు మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహిహిస్తామని అన్నారు. జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. దర్గా పీఠాధిపతి మహ్మద్ అబ్దుల్ హమీద్ షామియా (సైలాని బాబా) మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 23 వరకు ఉర్సు నిర్వహిస్తామని తెలిపారు. 21న రాత్రి గంధం కార్యక్రమం, 22న కళాకారుల ఖవ్వాలి, 23న తెహెల్ ఫాతియా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఉమ్మడి జిల్లాతోపాటు పలు రాష్ట్రాల నుంచి భారీగా హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం దర్గా పరిసర ప్రాంతాలు పరిశీలించి, ఉర్స వాల్‌పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓలు కల్పన, శ్రీనివాస్‌రెడ్డి, సీఐ సంతోష్, ఎస్సై అశోక్, మహ్మద్ రషీద్ బాబా, అమీర్‌బాబా, ఎస్‌కే మోయిన్‌సైలాని బాబా ఖాదిం పాల్గొన్నారు.
పరకాల ఆర్టీఓ నారాయణ


