వార్డుల పునర్విభజనలో అన్యాయం
పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్‌కు
సీతారాంపూర్‌వాసుల వినతి
పరకాల: గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు సీతారాంపూర్‌లోని మూడు వార్డులు (6, 7, 9) ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యాదవకాలనీ ప్రజలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో వార్డులతో సమస్యలు ఉండేవి కాదని, కానీ, పరకాల మున్సిపాలిటీలో విలీనం తర్వాత ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజన చేయడంతో సీతారాంపూర్ అభివృద్ధిలో వెనుకబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉడుత చిరంజీవి, ఉడుత సంపత్, ఇష్టబోయిన తిరుపతి, జాంకాజువ్వ మహేందర్, మహేశ్, నూకల రాజకోమురు, నూనెటి సురేశ్, ఉడుత రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


