మధ్యాహ్నభోజన పథకాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో ‘అక్షయపాత్ర’కు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించడాన్ని వెనక్కితీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. ఆ దివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజన పథకం కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 20ఏళ్లుగా మ ధ్యాహ్నభోజన కార్మికులు బిలులు సకాలంలో రాకపోయినా విద్యార్థులకు వంటచేసి పెడుతున్నారని అన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 14న లెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత తదితరులు పాల్గొన్నారు.


