అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
● వరంగల్ పోలీస్
కమిషనరేట్ పరిధిలో
433 కేసులు
● పోలీస్ కమిషనర్
సన్‌ప్రీత్ సింగ్
ముందస్తు చర్యలతో
సత్ఫలితాలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బుధవారం సాయత్రం నుంచే ప్రధాన కూడళ్ల దగ్గర గస్తీ నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత వరంగల్ నగరంలో అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన 433 మందిపై కేసులు నమోదు చేశారు.
13 చెకింగ్ పాయింట్ల ఏర్పాటు
వరంగల్‌లోని మూడు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 13 చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఈస్ట్‌జోన్ పరిధిలో 68 కేసులు, వెస్ట్‌జోన్ పరిధిలో 96 కేసులు, సెంట్రల్ జోన్ పరిధిలో 53 కేసులు.. మొత్తం కమిషనరేట్ పరిధిలో 433 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపి.. ప్రమాదాల బారినపడకుండా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు బందోబస్తు విధులతోపాటు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఎంజీఎం, బూడిదగడ్డ, పోచమ్మమైదాన్, తెలంగాణ జంక్షన్, హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు సీపీఓ జంక్షన్, అశోకా జంక్షన్, బస్టాండ్, ములుగురోడ్డు, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు కడిపికొండ, కాజీపేట, అదాలత్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు.
అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు


