ఆటోలు, బైక్‌ను ఢీకొట్టిన కారు
9 మందికి తీవ్ర గాయాలు కొత్తగట్టు శివారులో ఘటన
ఆత్మకూరు: అతివేగంగా వెళ్తున్న కారు రెండు ఆటోలు, బైక్‌ను ఢీకొనడంతో 9 మందికి తీవ్ర గాయాలైన సంఘటన కొత్తగట్టు శివారులోని ఎన్‌హెచ్–353సీపై గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అక్కంపేటకు చెందిన సిలువేరు ప్రసాద్, సిలువేరు కవిత ఆటోలో పరకాల మండలం వెల్లంపల్లిలో బంధువు మృతిచెందగా వెళ్తున్నారు. కొత్తగట్టు సమీపంలో ఎదురుగా నిర్లక్ష్యంగా అతివేగంగా వస్తున్న కారు బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో కారు ఎదురుగా పరకాల వైపు వెళ్తున్న మరో ఆటోను ఢీకొనడంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న కురుసపల్లి పరమేశ్, శరణ్య, అనిత, శివరాం, హేతు ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, ఇదే కారు మరో బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న బాదావత్ నరేశ్, నవ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంటనే 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి దామెర క్రాస్‌రోడ్డు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సిలువేరు ప్రదీప్ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోలు, బైక్‌ను ఢీకొట్టిన కారు


