
నాణ్యమైన విద్య బోధించాలి
మామునూరు: ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెస ర్ కోలా ఆనంద కిషోర్, డీఈఓ జ్ఞానేశ్వర్ సూచించా రు. ఈమేరకు వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల జిల్లాస్థాయి ఉపాధ్యా య శిక్షణ శిబిరాన్ని బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు డాక్టర్ కందాల రామయ్య, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీసీ ఈవీ సెక్రటరీ కృష్ణమూర్తి, ఎంఎంఓ సుజన్ తేజ, కోర్సు ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు, రిసోర్స్ పర్సన్స్ తాటిపాముల రమేష్, సంపత్, అశోక్, శ్రీని వాస్, కొమురయ్య, ఆనందమోహన్ పాల్గొన్నారు.
21మంది టీచర్లకు షోకాజ్ నోటీసు
విద్యారణ్యపురి : ఖిలావరంగల్ మండలంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఐదు రోజులపాటు జరిగే శిక్షణకు హాజరుకాని 21 మంది ఉపాధ్యాయులకు డీఈఓ జ్ఞానేశ్వర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 596 మంది ఉపాధ్యాయులు శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. అందులో 21 మంది టీచర్లు శిక్షణకు హాజరుకాలేదని గుర్తించి, డీఈఓ షోకాజ్ నోటీసులు జారీచేశారని జిల్లా క్వాలి టీ కోఆర్డినేటర్ సృజన్‌తేజ బుధవారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో ఒక్కరోజులో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ ఆనంద కిషోర్, వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్