
విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలి
విద్యారణ్యపురి: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఎయిడ్స్, హెచ్‌ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి వరకు కొవ్వొత్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్‌తో మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రజల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఎవరైతే హెచ్‌ఐవీతో జీవిస్తున్నారో వారికి సంఘీభావంగా ఉండేందుకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, పరకాలలోని సీఎస్సీ ఐసీటీసీ సెంటర్లుగా పని చేస్తున్నాయన్నారు. 2024–25లో 55,000ల మందిని పరీక్షించగా.. 100 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణఽ సంస్థ మేనేజర్ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్‌వైజర్ రామకృష్ణ, ఐసీటీసీ కౌన్సిలర్లు రాపర్త సురేశ్, రాజేందర్, సంపూర్ణ, సురక్ష కేంద్ర బృందం ఇక్బాల్, భాషా ల్యాబ్ టెక్నిషియన్లు, కరుణ మైప్రాజిటివ్ నెట్‌వర్క్ రవీందర్, మారి, విజయ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఽఖ అధికారి అప్పయ్య