
‘స్థానిక’ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
రాయపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కిష్టాపురం క్రాస్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌పార్టీ మండల స్థాయి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలాకాపాడుకుంటామని అన్నారు. ప్రతీ కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి, రవిచంద్ర, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, తొర్రూరు బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యానాయక్, మండలపార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.