
రారండోయ్ సర్కారు బడికి..!
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపుదలే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాటను జూన్ 6నుంచి 19వతేదీ వరకు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ బడిబాట ద్వారా చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉపాధ్యాయులు బడిబయట ఉన్న, బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ 6నుంచి ఉపాధ్యాయులు తప్పనిసరిగా తాము పనిచేస్తున్న ప్రాంతం పరిధిలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
● 6వ తేదీన గ్రామసభను నిర్వహించాల్సి ఉంటుంది.
● 7న ఇంటింటికి సందర్శంచి బడిఈడు పిల్లలను గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుంది.
● 8నుంచి 10వ తేదీవరకు
● జిల్లాల్లోని ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల పరిధిలో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించాలి. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి డ్రాపౌట్ పిల్లలను కూడా గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటే వారిని అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాల్సింటుంది.
● 11న అప్పటివరకు నిర్వహించిన బడిబాటపై సమీక్షించుకోవాలి.
● 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, స్కూల్ యూనిఫామ్స్ కూడా అందించాల్సి ఉంటుంది.
● 13న జిల్లాల్లో సామూహిక అక్షరాభ్యాసం బాలల సభను నిర్వహించాలి.
● 16న ఎఫ్‌ఎల్‌ఎన్, లిప్ దినోత్సవం నిర్వహించాలి.
● 17న విలీన విద్య, బాలికా దినోత్సవాన్ని చేపట్టాలి.
● 18న తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి, మొక్కల పెంపకం, ప్రాధాన్యాన్ని వివరించాలి.
● 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పొటీలు నిర్వహించాలి.
జూన్ 6నుంచి 19వ తేదీవరకు బడిబాట
షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు
విద్యార్థుల నమోదు పెంపుదలే లక్ష్యం
సమష్టిగా ముందుకెళ్లాలంటున్న
విద్యాశాఖ అధికారులు
జిల్లాలోని 41 పాఠశాలల్లో విద్యార్థులు అసలే లేరు. వీటిలో విద్యార్థులను చేర్పించుకునేలా కృషిచేయాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాలి.
– ఇటీవల సమన్వయ సమావేశంలో
హనుమకొండ డీఈఓ డి.వాసంతి
జిల్లాల వారీగా పాఠశాలలు..
జిల్లా పీఎస్‌లు యూపీఎస్‌లు హైస్కూళ్లు
హనుమకొండ 314 72 147
వరంగల్ 321 68 123