
క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేయూ క్యాంపస్: తెలంగాణలో క్రీడా రంగాభివృద్ధి కి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుమారు డు నాయిని విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని యూనివర్సి టీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నాయిని టీ–10 లీగ్ సీజన్–2 క్రికెట్ పోటీలు ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2015లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో విశాల్‌రెడ్డి మరణించడంతో ఆయన జ్ఞాపకాలను రాజేందర్‌రెడ్డి విశాల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి
విశాల్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్
ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం