
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
వర్ధన్నపేట: రైతులు తమకున్న భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం మండలంలోని దమ్మన్నపేట, రామవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆమె పరిశీలించారు. భూసమస్యలపై వస్తున్న దరఖాస్తుల్ని, రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ పని తీరును పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. దమ్మన్నపేటలో రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. అర్హుల ఎంపికలో సమగ్ర విచారణ చేపట్టి నిజమైన వారికే అందించాలని కోరారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారినే ఎంపిక చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్శనలో తహసీల్దార్ విజయసాగర్, పర్యవేక్షకుడు రమే శ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద