
డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించండి
వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో ఉన్న 350 ప్రధాన డ్రెయినేజీల్లో వ్యర్థాలను తొలగించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజా రోగ్య విభాగం, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో గురువారం వేర్వేరుగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఆమె మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొలగించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలని కోరారు. అనధికార లేఅవుట్లు గుర్తించాలని, ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేయాలని సూచించారు. ఇప్పటివరకు 30,500 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులతో రూ.130.50 కోట్ల ఆదాయం బల్దియాకు సమకూరిందని వివరించారు. ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఏసీపీలు రజిత, ఖలీల్, శ్రీనివాస్ రెడ్డి, ఏర్షాద్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీను పాల్గొన్నారు.
అమృత్ పనుల పురోగతిపై వర్చువల్ మీటింగ్
అమృత్ పనుల పురోగతి, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూడీఎఫ్‌ఐ) ప్రతిపాదనలపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ టీకే శ్రీదేవి మున్సిపల్ అధికారులు, అర్బన్ ప్లానర్లతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో మేయర్
గుండు సుధారాణి