
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
ఆత్మకూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్‌లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన స్థాయిలను పెంచి గుణాత్మక విద్యను అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడానికి సమాజంలోని అన్ని వర్గాల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియపర్చాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ విజయ్‌కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు తిరుపతిరెడ్డి, బుచ్చిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, రాజు, సుధాకర్ పాల్గొన్నారు.