
భక్తికి రూపం హనుమంతుడు
వేయిస్తంభాల దేవాలయంలో
ఘనంగా హనుమాన్ జయంతి
హన్మకొండ కల్చరల్: భగవంతుడి భక్తికి రూపం హనుమంతుడని, చిన్నాపెద్దా భక్తితో అతడిని కొలుస్తారని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, సందీప్ శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేదపండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్‌మాల్ అధినేత వెంకటరమణ, భరత్‌భూషణ్ దంపతుల అధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.