
పనిచేసిన వారికి ఎన్నికల్లో ప్రాధాన్యం
దుగ్గొండి/నల్లబెల్లి: కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, అధికారంలోకి రావడం కోసం నిత్యం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలలో ప్రాధాన్యత ఇస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో, నల్లబెల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు అధికారంలో లేకున్నా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అర్హులయిన వారికి పథకాలు అందేలా కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అమీర్‌ఖాన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో నిబద్దత గల కాంగ్రెస్ నాయకుడిగా మాధవరెడ్డికి పేరుందన్నారు. నల్లబెల్లిలో నిర్వహించిన సమావేశంలో పార్టీ ఎన్నికల నామినేషన్ పత్రాలను కార్యకర్తలకు అందించారు. కార్యక్రమంలో పరిశీలకుడు రవిచంద్ర, కిసాన్ సెల్ జిల్లా బాధ్యుడు బొంపెల్లి దేవేందర్‌రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు రామానంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, శ్రీనివాసరెడ్డి, బాబు, తిరుపతిరెడ్డి, కిరణ్‌రెడ్డి, నర్సింగరా వు, రమేష్, రాజేశ్వర్‌రావు, శివాజి, భరత్‌రెడ్డి, రఘుపతిరావు, అశోక్, శేఖర్, జ్యోతి పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి