
లండన్‌లో చదువుకున్నా.. మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్‌లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డెపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని
కాకతీయ 22వ వారసుడు
కమల్ చంద్ర భంజ్‌దేవ్
కోట, వేయిస్తంభాల గుడి,
భద్రకాళి ఆలయంలో పూజలు