
టీచర్లకు ‘నైపుణ్య’ శిక్షణ
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల సాధనకు అన్ని కేటగిరీల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఒక్కో టీచర్‌కు ఐదురోజులు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా డిజిటల్ విద్యకు, కంప్యూటర్ ద్వారా ఏఐ ఆధారిత విద్యా బోధన, లీడర్‌షిప్ లక్షణాల పెంపుదల, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు వివిధ సబ్జెక్టుల విద్యాబోధనపై జీవననైపుణ్యాలపై, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ బోర్డు (ఐఎఫ్‌బీ) వినియోగం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
మూడుదశల్లో
వేసవిసెలవుల్లో హనుమకొండ జిల్లాల్లోని టీచర్లకు మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు మొదటి దశ, ఈనెల 20 నుంచి 24 వరకు రెండో దశ, ఈనెల 27 నుంచి 31 వరకు మూడో దశలో టీచర్ల శిక్షణ ఉండనుంది. స్కూల్ అసిస్టెంట్లకు, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంలకు, గెజిటెడ్ హెచ్‌ఎంలకు, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు, ఎస్‌జీటీలకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఎక్కడంటే..
హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొదటిదశలో ఈనెల13 నుంచి 17 వరకు వివిధ కేటగిరీల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటిదశలో స్కూల్ అసిస్టెంట్‌లు ఇంగ్లిష్ (100), మ్యాఽథ్స్ (100) సోషల్ స్టడీస్ (100), ఎస్జీటీ ఎంఆర్‌పీలు (112), స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 33 మంది, ఎస్జీటీ ఉర్దూ మీడియం కేటగిరీలో 50 మందికి హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. హాజరయ్యే టీచర్లకు మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్, తాగునీటి సదుపాయం కల్పిస్తారు. శిక్షణ ఇస్తున్న స్కూల్‌లో ఏసీ సదుపాయం ఉన్నందున వేసవిలో శిక్షణ పొందే ఉపాధ్యాయులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా సబ్జెక్టుల్లో శిక్షణ పొందిన డీఆర్పీల ద్వారా ఇప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
20 నుంచి 24 వరకు ప్రాథమిక స్థాయి
జిల్లాలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఎస్జీటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంలకు ఈనెల 20 నుంచి 24 వరకు ఎంఈఓల ఆధ్వర్యంలో మండల స్థాయిలో శిక్షణ ఉంటుంది. జిల్లాలో 1,014 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలోని అన్ని కేటగిరీల టీచర్లకు ఈనెల 13నుంచి 17వరకు శిక్షణ ఇవ్వబోతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్ ఆదివారం తెలిపారు. ఈశిక్షణ ఖిలావరంగల్ మండలం ఉర్సుగుట్ట వద్ద ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మొదటి దశలో వనంగల్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు గణితం (224), ఇంగ్లిష్(179), సోషల్ స్టడీస్ (205) మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే మండల రిసోర్స్‌పర్సన్లకు 104 మందికి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు 34 మందికి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్సపర్సన్లు కలిపి మొత్తంగా 596 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జియోటాగింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో హాజరు ఉంటుందని విధిగా టీచర్లు శిక్షకు హాజరుకావాల్సిందేనన్నారు.
టీచర్లు విధిగా హాజరుకావాల్సిందే..
జిల్లాలో ఈనెల 13 నుంచి నిర్వహించనున్న టీచర్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావా లి. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలి. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధన, నాణ్యమైన విద్య నైపుణ్యాల పెంపుదల ముఖ్యమైన అంశాలపై ఒక్కో టీచర్‌కు ఐదురోజులు శిఽక్షణ ఉంటుంది.
– వాసంతి, డీఈఓ
సమయపాలన పాటించాలి..
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాల్సిందే. ప్రతీ సబ్జెక్టుకు కాంప్లెక్స్ హెచ్‌ఎంలను సెంటర్ ఇన్‌చార్జులుగా నియమించాం. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉపాధ్యాయులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉపాధ్యాయులందరికీ ప్రీటెస్టు, అంతిమ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. హాజరు కూడా ఆన్‌లైన్ ద్వారా ఉదయం శిక్షణా కేంద్రానికి 9:30 గంటల్లోపు వచ్చిన వారిని నమోదు చేస్తారు. జియో కార్డినల్ ద్వారా తమ మొబైల్ నుంచి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన అనంతరం ఆన్‌లైన్ ద్వారానే వారి మొబైల్‌కు పార్టిసిఫేషన్ సర్టిఫికెట్ అందుతుంది.
– శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్
రేపటి నుంచి 17 వరకు మొదటి దశ
ఒక్కో టీచర్‌కు ఐదురోజులపాటు..
మరో రెండు విడతలు కూడా..
ఇప్పటికే డీఆర్పీలకు శిక్షణ పూర్తి

టీచర్లకు ‘నైపుణ్య’ శిక్షణ

టీచర్లకు ‘నైపుణ్య’ శిక్షణ