
సబ్‌స్టేషన్.. రైతులకు ఉపయోగం
రాయపర్తి: సబ్‌స్టేషన్ నిర్మాణం చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతగానో ఉపయోగమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని జగన్నాథపల్లిలో సుమారు రూ.2.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకు అధికారులు, మండల నాయకుడు నంగునూరి అశోక్, శారద దంపతులు, ప్రజలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్‌స్టేషన్ మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ గుగులోతు కిషన్‌నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, విద్యుత్ ఏఈ రవళి, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే
మామిడాల యశస్వినిరెడ్డి