
కార్పొరేట్‌కు దీటుగా..
నెక్కొండ: కార్పొరేట్, ప్రైవేట్‌కు దీటుగా విద్యనదించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లు, కళాశాలల (ఆదర్శ పాఠశాలలు/కళాశాలలు)ను ఏర్పాటు చేసింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, నిపుణులైన అధ్యాపకులు ఉండడంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. 6 నుంచి 10వ తరగతితోపాటు ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తుడడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఆదర్శ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది.
ప్రతీ గ్రూపులో 40 సీట్లు..
జిల్లాలో మొత్తం 6 (నెక్కొండ, సంగెం, చెన్నారావుపేట, ఖానాపురం, పర్వతగిరి, గీసుకొండ) మోడల్ స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. ప్రతీ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయి. ప్రతీ గ్రూపులో 40 సీట్లు ఉన్నాయి. కళాశాలల్లో బాలికలకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అందుకు కనీసం మూడు కిలోమీటర్లు లేదా ఆపై దూరం ఉండేవారు మాత్రమే అర్హులని అధికారులు పేర్కొన్నారు.
అడ్మిషన్ల ప్రక్రియ ఇలా..
● జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు హెచ్‌టీటీపీ://183.82.97.97/ఎంఎస్‌టీజీలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
● 22న దరఖాస్తుల పరిశీలనతోపాటు ఎంపికై న వారి జాబితాను సిద్ధం చేయనున్నారు.
● రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా 26న ఎంపికై న వారి జాబితాను ప్రదర్శిస్తారు.
● 27 నుంచి 31వ వరకు విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
● ప్రతి గ్రూపులో 40 సీట్ల చొప్పున నాలుగు గ్రూపుల్లో 160 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.
● పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అల్పాదాయ వర్గాల వారికి ప్రాధాన్యమిస్తారు.
మోడల్ స్కూళ్లు, కాలేజీల్లో
నాణ్యమైన విద్యాబోధన
ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు
ఇంటర్‌లో ప్రవేశాలకు ఈనెల
20వ తేదీ గడువు
ఉత్తమ ఫలితాలు సాధించాం..
మోడల్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నేను ఇంటర్ ఎంపీసీలో 974 మార్కులు సాఽ దించాను. మా కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించి ఉత్తమ ఫలితాలు సాధించాం.
– మౌనిక, విద్యార్థిని,
నెక్కొండ మోడల్ స్కూల్
కార్పొరేట్ తరహాలోనే..
మోడల్ స్కూల్, కళాశాలలో కార్పొరేట్, ప్రైవేట్‌కు దీటుగా తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా సంసిద్ధులను చేస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఇంటర్ చదివేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– డాక్టర్ ప్రణయ్‌కుమార్,
మోడల్ స్కూల్, ప్రిన్సిపాల్ నెక్కొండ

కార్పొరేట్‌కు దీటుగా..

కార్పొరేట్‌కు దీటుగా..