
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
● సమగ్ర శిక్ష రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజీవ్
కమలాపూర్: విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 15 రోజులుగా జిల్లాలోని 9 కేజీబీవీలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థినులు వేసవి శిబిరంలో పాల్గొని స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ మ్యా థ్స్, క్రాఫ్ట్, పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, గేమ్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ మేర కు సోమవారం నిర్వహించిన వేసవి శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి శిబిరంలో నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థుల కు నేర్పించడంతో పాటు భవిష్యత్‌లో మరింత నైపుణ్యం సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన క్రాఫ్ట్ మెటీరియల్‌తో పాటు సంగీతం, నృత్య ప్రదర్శనలకు తిలకించారు. ముగింపు సమావేశంలో జిల్లా జీసీఈఓ సునీత, ఎంఈఓ కె.శ్రీధర్, శిబిరం సమన్వయకర్త అర్చన, పలు కేజీబీవీల ఎస్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు వృత్తిపరంగా విద్యాబోధన నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రాన్ని రాజీవ్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రావు, కోర్సు కోఆర్డినేటర్ చలమల నాగేశ్వర్‌రావు, రిసోర్స్‌పర్సన్లు పాల్గొన్నారు.