
వైభవంగా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ఐనవోలు: ఐలోని మల్లికార్జునస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని కోమల్లపల్లి సంపత్‌కుమార్ రుత్విక్ బృందం ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా ప్రతిష్ఠించారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, శాంతి కల్యాణం, ఒగ్గు పూజారులతో పెద్దపట్నం తదితర పూజలు నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీపీ మధుమతి పాల్గొన్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు నిర్మాణ దాతలు పర్ష సర్వేశ్వర్‌రావు యాదవ్ కుటుంబ సభ్యులకు శేషవస్త్రాలను అందజేశారు. అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, ఒగ్గు పూజారులు, నాయీబ్రాహ్మణులు, రజకులు పాల్గొన్నారు.