
గుణాత్మక విద్యపై దృష్టి సారించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు గుణాత్మక విద్య పై దృష్టి సారించాలని హనుమకొండ డీఈఓ వా సంతి సూచించారు. ఐదు రోజులుగా హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూ ల్‌లో నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణ కార్యక్రమం శనివా రం ముగిసింది. ఈ సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్లకు, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ కె.శ్రీని వాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, స్కిల్ స్టార్క్ విద్యాసంస్థల అధినేత అనుపురావు,రవికుమార్,రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. సమావేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఇన్‌స్పెక్టర్ వెంకన్న, పోక్సో చట్టం, ఉమెన్ ట్రా ఫికింగ్ పై షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాత, డ్రగ్ అడిక్షన్ పై ఏసీ పీ సైదులు,సైబర్ క్రైమ్ గురించి సంబంధిత అధికా రి శివకుమార్ ఉపాధ్యాయులకు వివరించారు.
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి :
వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధించాలని వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ ఉపాధ్యాయులను కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు నగరంలో ఐదు రోజులుగా నిర్వహిస్తుస్తున్న శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌తో పాటు కె.మల్లారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వరంగల్ నార్కొటిక్ డీసీపీ సైదులు మాట్లాడారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, నాగేశ్వర్‌రావు, సెంటర్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్‌రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హనుమకొండ డీఈఓ వాసంతి